newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

త్వరలో జేబీఎస్‌ టు ఎంజీబీఎస్‌ మెట్రో పరుగులు

19-12-201919-12-2019 09:39:41 IST
2019-12-19T04:09:41.177Z19-12-2019 2019-12-19T04:09:25.929Z - - 22-02-2020

త్వరలో జేబీఎస్‌ టు ఎంజీబీఎస్‌ మెట్రో పరుగులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థలో మెట్రో తనదైన ప్రత్యేకతను చాటుకుంటూనే వుంది. తాజాగా జేబీఎస్‌ టు ఎంజీబీఎస్‌‌కి త్వరలో మెట్రో రైలు పరుగులు తీయడానికి రెడీ అవుతోంది.  మెట్రో -2 కారిడార్‌లో భాగంగా ట్రయల్ రన్ నవంబర్ 24 ప్రారంభించారు.

ఇదిలా ఉంటే మొదట 2019 డిసెంబర్ చివరి నాటికి మెట్రో -2 కారిడార్‌ జూబ్లీ బస్ స్టేషన్ (జెబీఎస్) నుంచి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) వరకున్న లైన్లను ప్రారంభిస్తామని తెలిపారు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన నూతన సంవత్సరంలో ప్రారంభిస్తామని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్విఎస్ రెడ్డి తెలిపారు.

డిసెంబర్ 17న సాంకేతిక నిపుణులు, ఇంజనీర్ల బృందం ట్రయల్ పరుగులను పరిశీలించి రైళ్ల పనితీరును పరీక్షించారు. ట్రయల్ రన్ కొనసాగుతోది. సాంకేతిక పరమయిన అంశాలు, భద్రతా ప్రమాణాలను రైల్వే నిపుణులు క్షుణ్ఱంగా  పరీక్షిస్తున్నారు. మెట్రో ప్రారంభానికి సంబంధించి తుది నిర్ణయాన్ని మెట్రో రైల్ సేఫ్టీ కమిషనర్ నుంచి అనుమతి పొందాల్సి వుంటుందని అధికారులు చెబుతున్నారు.

పారడైజ్ గ్రౌండ్స్‌ నుంచి ఇంటర్‌చేంజ్ స్టేషన్ ద్వారా జేబీఎస్, ఎంజీబీఎస్ మధ్య 11 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మెట్రో ద్వారా ఈ దూరాన్ని కేవలం 16 నిమిషాల్లో చేరుకోవచ్చు. అదే రోడ్డు మార్గం ద్వారా ఐతే 38-40 నిమిషాలు పడుతుంది. హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు జేబీఎస్ బస్టాండ్ నుంచి ఎంజీబీఎస్ బస్టాండ్ కు పావుగంటలో చేరుకునే అవకాశం ఉంటుంది.

మెట్రో చరిత్రలో ఇంత తక్కువ సమయం పట్టేది ఇదే. దీంతో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతుందని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఎల్బీ నగర్-మియాపూర్, నాగోల్-రాయదుర్గం రూట్లో మెట్రో పరుగులు తీస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం రూట్లో మెట్రో ప్రారంభం కావడంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు హ్యాపీగా ఫీలవుతున్నారు. తమ కార్యాలయాలకు చాలా సులువుగా చేరుకోగలుగుతున్నామని ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   2 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   3 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   4 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   5 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   6 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   6 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   8 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   8 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   8 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   9 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle