newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

త్వరలో జగన్-కేసీయార్ భేటీ.. జలవివాదాలపై చర్చ

06-06-202006-06-2020 10:52:32 IST
Updated On 06-06-2020 11:45:46 ISTUpdated On 06-06-20202020-06-06T05:22:32.946Z06-06-2020 2020-06-06T05:21:05.733Z - 2020-06-06T06:15:46.443Z - 06-06-2020

త్వరలో జగన్-కేసీయార్ భేటీ.. జలవివాదాలపై చర్చ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ తెలంగాణ మధ్య మళ్లీ జలవివాదాలు రాజుకున్నాయి. అయితే, రెండు రాష్ట్రాల సామరస్యంగానే వాటిని పరిష్కరించుకోవాలని భావిస్తున్నాయి. ఇందుకోసం జగన్-కేసీయార్ త్వరలో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. తాజాగా హైదరాబాద్ లో జరిగిన గోదావరి యాజమాన్య బోర్డు సమావేశంలో  అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. జూన్ పది లోగా డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు ఇవ్వాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు రెండు రాష్ట్రాలను కోరింది.

త్వరలో జరగనున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలను వెంటనే పంపాలని సూచించింది.డీపీఆర్ లు అందిన తర్వాతే ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తోన్న ఆరోపణలపై తేల్చాలని బోర్డు భావిస్తోంది.

గోదావరి నదిపై తెలంగాణా ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తోందని గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో బోర్డు  చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన బోర్డు సమావేశమై చర్చించింది. ఈ సమావేశానికి ఏపీ,నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్, తెలంగాణా ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ తో పాటు ఇరు రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు ఇతర అధికారులు హాజరయ్యారు. రెండు రాష్ట్రాల అధికారులు తమ వాదనలతో బోర్డ్ ముందు ప్రెజెంటేషన్ ఇచ్చారు. గోదావరి నదిపై రెండు రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టు ల డీపిఆర్ లు జూన్ 10 లోగా  సమర్పించాలని బోర్డ్ కోరింది.

తమ ప్రభుత్వాల అనుమతి తీసుకుని వెంటనే డిపిఆర్ లు సమర్పిస్తామని రెండు రాష్ట్రాల ఆధికారులు బోర్డుకు తెలిపారు. రెండు రాష్ట్రాల అధికారులు తమ వాదనలకు బలం చేకూరే ఆధారాలు బోర్డ్ కి ఇచ్చారని సమాచారం. 2014 జూన్ 2 తర్వాత నిర్మిస్తున్న ప్రాజెక్ట్స్ కొత్త ప్రాజెక్ట్స్ గా పరిగణించాలని ఆంధ్రప్రదేశ్ అభిప్రాయ పడింది. ఈ కొత్త  ప్రాజెక్టులకు అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదని ఏపి అధికారులు వాదించారని తెలుస్తోంది. ఏపీ వాదనలపై తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. 

రెండు రాష్ట్రాల వాదనలు విన్న బోర్డు డీపీఆర్ లు ఇస్తేనే ఎవరి వాదన సరైనదో తేల్చుతామని చెప్పినట్లు తెలిసింది. త్వరలో సమావేశం కానున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశం కోసం వెంటనే అజెండా పంపాలని రెండు రాష్ట్రాలకు బోర్డు సూచించింది. ఎక్కడ టెలిమెట్రీ ఏర్పాటు చేయాలనేది గుర్తించేందుకు గోదావరి బోర్డు సభ్యుని నేతృత్వంలో,రెండు రాష్ట్రాల అధికారులతో కమిటీని నియమించాలని నిర్ణయించారు.

ఏపీలోని పెద్ద వాగు ప్రాజెక్టు ఆధునికీకరణ అంశాన్ని రెండు రాష్ట్రాలు పరిష్కరించుకునేందుకు అంగీకరించినట్టు బోర్డు తెలిపింది. కృష్ణా, గోదావరి బోర్డు సమావేశాలు ముగిసిన నేపథ్యంలో తొందరలోనే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి అధ్యక్షత న అపెక్స్ కౌన్సిల్ సమావేశమయ్యే అవకాశం ఉంది. అపెక్స్ కమిటీలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు కాబట్టి  ఇరు రాష్ట్రాల ప్రయోజనాల కోసం అపెక్స్ కౌన్సిల్  అజెండా సిద్ధం చేయడానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు  త్వరలోనే కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఏపీలో అధికార మార్పిడి జరిగి జగన్ సీఎం అయ్యాక తెలంగాణతో సానుకూల వాతావరణం ఏర్పడింది. ఇటీవల తెరమీదకు వచ్చిన పోతిరెడ్డిపాడు అంశం రెండు రాష్ట్రాల మధ్య దూరాన్ని పెంచింది. అయితే ఈ అంశాన్ని మేమిద్దరం కలిసి పరిష్కరించుకుంటామని తెలంగాణ సీఎం కేసీయార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సీఎంలు ఏం మాట్లాడుకుంటారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

 

 

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   13 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   14 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   14 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   18 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   19 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   17 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   20 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   20 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   15 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle