తెలుగు రాష్ట్రాల సీఎంల చప్పట్లు.. జనతా కర్ఫ్యూపై ప్రశంసలు
22-03-202022-03-2020 18:46:40 IST
Updated On 22-03-2020 18:46:33 ISTUpdated On 22-03-20202020-03-22T13:16:40.988Z22-03-2020 2020-03-22T13:15:37.305Z - 2020-03-22T13:16:33.659Z - 22-03-2020

కరోనావైరస్ కట్టడి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపునకు దేశ ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. దేశమంతా ఒకే మాట ఒకేబాటగా ముందుకు సాగింది. ఎంతో నిబద్ధతతో జనతా కర్ఫ్యూ పాటించారు జనమంతా. .సాయంత్రం 5 గంటలకు ప్రజలంతా బయటకు వచ్చి చప్పట్లు కొడుతూ అహర్నిశలు పనిచేస్తున్న వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, అత్యవసర సిబ్బందికి సంఘీభావం తెలిపారు. ఇళ్ల లోగిళ్లలో నిలబడి చప్పట్లతో ధన్యవాదాలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపుమేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు జనతా కర్ఫ్యూ పాటించిన సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్. ఈ సందర్భంగా అహర్నిశలు సేవలు అందిస్తున్న వైద్య బృందాలకు గవర్నర్ ధన్యవాదాలు తెలిపారు. సమిష్టి కృషితో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్ట వచ్చన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రులతో కలిసి చప్పట్లు కొట్టి వైద్య సిబ్బందికి సంఘీభావం తెలిపారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చప్పట్లు కొట్టి...వారందరికి సంఘీభావం ప్రకటించారు. పోలీసలు, నేతలు, సామాన్య పౌరులు, సెలబ్రిటీలు తమవంతు బాధ్యతగా చప్పట్లతో, కరతాళ ధ్వనులతో వీధులు మారుమోగిపోయాయి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మరిని తరిమికొట్టేందుకు చేపట్టిన జనతా కర్ఫ్యూ కార్యక్రమంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహించిన పోలీసులు, వైద్యులు, జర్నలిస్టులకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం తెలుగు రాష్ట్రాలలో సందడిగా జరిగింది. ఐదు గంటలకు ప్రజలంతా కూడా బయటకు వొచ్చి కరతాల ధ్వనులతో అభినందనలు తెలియజేశారు.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
12 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
8 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
10 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
13 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
15 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
17 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
18 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
19 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
20 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
21 hours ago
ఇంకా