newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలుగు రాష్ట్రాల జలజగడాలపై కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

24-08-202024-08-2020 08:18:48 IST
Updated On 24-08-2020 13:32:47 ISTUpdated On 24-08-20202020-08-24T02:48:48.256Z24-08-2020 2020-08-24T02:48:44.321Z - 2020-08-24T08:02:47.796Z - 24-08-2020

తెలుగు రాష్ట్రాల జలజగడాలపై కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ తెలంగాణ రాష్ట్రాలు అన్నదమ్ముల్లా కలిసి వున్నాయి. కానీ మధ్యమధ్యలో జలజగడాలు వివాదాలకు కారణం అవుతున్నాయి. పోతిరెడ్డిపాడు, కృష్ణాజలాల విషయంలో రెండు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా అని సీఎం కేసీయార్ జగన్ పై మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో రెండురాష్ట్రాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈనెల 25 వ తేదీన జరగాల్సిన అపెక్స్ కమిటీ భేటీ వాయిదా పడింది. త్వరలో కొత్త తేదీ ప్రకటిస్తామంది కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ.  మంత్రికి కరోనా పాజిటివ్ సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది కేంద్ర జలశక్తి శాఖ.

తాజా వివాదాలపై కేంద్ర హోంశాఖ సహాయsమంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి సమస్యను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులే పరిష్కరించుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. నీటి పంపకాల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ చేసిన విమర్శలను ఖండిస్తున్నామని అన్నారు. తన మిత్రుడు జగన్‌తో కేసీఆర్‌కు రహస్య ఒప్పందముందని కిషన్ రెడ్డి ఆరోపించారు. 

గవర్నర్‌పై టీఆర్ఎస్ నేత రాజకీయ విమర్శలు చేయడం సరైన పద్దతి కాదన్నారు. కరోనా కట్టడి విషయంలో గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ వ్యాఖ్యలను సూచనగా మాత్రమే తీసుకోవాలని హితవు పలికారు. కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని.. కరోనా టెస్టులను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. 

నా రూటే సెప‌రేటు

నా రూటే సెప‌రేటు

   an hour ago


బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   14 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   15 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   15 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   19 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   20 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   18 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   21 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   21 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   16 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle