newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు..

13-08-202013-08-2020 08:56:20 IST
2020-08-13T03:26:20.840Z13-08-2020 2020-08-13T03:26:15.079Z - - 17-04-2021

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న సూచనలు కనిపించడం లేదు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 6,42,875 మందికి పరీక్షలు నిర్వహించగా.. 82,647 మందికి కరోనా పాజిటివ్‌ నిర్థ్దారణ అయినట్లు వైద్య , ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. 

ఒక్కరోజు 18,035 పరీక్షలు నిర్వహించగా.. 1,897 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, 9 మంది చనిపోయారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి 59,374 మంది కోలుకోగా.. 22,628 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 15,554 మంది హోం ఐసోలేషన్లో ఉన్నట్లు వివరించారు.

వ్యాధి బారినపడి ఇప్పటి వరకు మొత్తం 646 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక సోమవారం నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా 338 ఉండగా.. మేడ్చల్‌ జిల్లాలో 119, రంగారెడ్డిలో 147, కరీంనగర్‌లో 122, వరంగల్‌ అర్బన్‌లో 95, గద్వాలలో 85, కామారెడ్డిలో 71, ఖమ్మంలో 65, పెద్దపల్లిలో 66 ఉన్నాయి. 

ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2,629 మంది రోగులు చికిత్స పొందుతుండగా.. 5,807 బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో 3,336 మంది రోగులు చికిత్స పొందుతుండగా.. 2,149 బెడ్స్‌ ఖాళీగా ఉన్నట్లు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు.  

ఏపీలో రికవరీ భేష్ కానీ కొత్త కేసుల పెరుగుదల.. 87మంది మృతి

ఒకవైపు భారీగా పెరుగుతున్న డిశ్చార్జ్‌లు.. మరోవైపు తగ్గని కరోనా కేసులు. అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరోనా పరీక్షల్లో దూకుడు కొనసాగిస్తూనే ఉంది. ఒక్కరోజే 9,113 మంది కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో 25,92,619 టెస్టులు చేశారు. మిలియన్‌ జనాభాకు 48,551 టెస్టులు చేస్తున్నారు.

అయితే రాష్ట్రంలో కరోనా వైరస్‌ బారిన పడి కోలుకుంటున్న వారి శాతం గణనీయంగా పెరుగుతోంది. తాజా గణాంకాల ప్రకారం రికవరీ రేటు 63.28 శాతంగా నమోదయింది. మొన్నటివరకూ ఇది 50 నుంచి 55 శాతం మధ్య ఉండేది. 

గడిచిన 24 గంటల్లో 58,315 టెస్టులు చేశారు. 9,024 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే, వివిధ ఆస్పత్రుల్లో 87 మంది మృతిచెందారు. మరణాల సంఖ్య  2,203కు చేరింది.  ఎక్కువ నమోదు అవుతున్న కేసుల్లో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1,372 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కృష్ణా జిల్లాలో 342 కేసులు నమోదయ్యాయి. 

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   27 minutes ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   an hour ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   4 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   2 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   5 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   19 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   a day ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   20 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   16-04-2021


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle