తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 80 వేలు దాటిన కరోనా కేసులు..
18-07-202018-07-2020 14:07:42 IST
Updated On 18-07-2020 17:26:41 ISTUpdated On 18-07-20202020-07-18T08:37:42.223Z18-07-2020 2020-07-18T08:37:38.000Z - 2020-07-18T11:56:41.315Z - 18-07-2020

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కరోనా కేసులు, తాజా కేసుల విషయంలో పోటీ పడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కరోనా కేసులు చెరో 40 వేలు దాటిపోయాయి. గత వారం రోజులుగా రోజుకు 1500 నుంచి 2500 వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో రెండు రాష్ట్రాల ప్రజలు కలవరపడుతున్నారు. తెలంగాణలో తాజా పాజిటివ్ కేసులు 1478 తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 1478 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 42,496కు చేరింది. ఇందులో 13,389 యాక్టివ్ కేసులుండగా ఇప్పటివరకు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న సంఖ్య 28,705గా ఉంది. ఇప్పటి వరకు కోలుకున్న వారు 68 శాతం ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనాతో శుక్రవారం ఏడుగురు మరణించగా.. మృతుల సంఖ్య 403కు చేరుకుంది. ఏపీలో తాజా కరోనా కేసులు 2,062. మొత్తం కేసులు 40,646 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 20 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో ఆస్పత్రుల నుంచి 905 మంది డిశ్చార్జ్ అవడంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 20,298కి చేరింది. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 వరకు 20,245 మందికి పరీక్షలు నిర్వహించగా 2,062 మందికి పాజిటివ్‌గా తేలినట్టు వైద్యారోగ్యశాఖ శుక్రవారం బులెటిన్‌లో పేర్కొంది. దీంతో మొత్తం పాజిటివ్ కేసులు 40,646కి చేరాయి. ఇప్పటి వరకు మొత్తం 12,60,512 మందికి పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో 42 మృతితో మొత్తం మరణాల సంఖ్య 534కి చేరింది. యాక్టివ్ కేసులు 19,814 ఉన్నాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వైరస్ వ్యాప్తి ప్రబలంగా ఉంటున్న రాష్ట్రాల జాబితాలో చేరకపోవడం గమనార్హం

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు
an hour ago

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి
an hour ago

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్
2 hours ago

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!
3 hours ago

తిరుపతిలో కొనసాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్
5 hours ago

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెపరేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేనట్లే
4 hours ago

hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. సరే Prends ఉంటా
25 minutes ago

సభ్య సమాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామని అక్కా
7 hours ago

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
20 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
16-04-2021
ఇంకా