newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలుగు రాష్ట్రాల్లో టెస్టుల హవా.. తెలంగాణలో 5 లక్షలు, ఏపీలో 21 లక్షల పరీక్షలు

05-08-202005-08-2020 12:17:41 IST
Updated On 05-08-2020 14:02:59 ISTUpdated On 05-08-20202020-08-05T06:47:41.434Z05-08-2020 2020-08-05T06:47:19.104Z - 2020-08-05T08:32:59.629Z - 05-08-2020

తెలుగు రాష్ట్రాల్లో టెస్టుల హవా.. తెలంగాణలో 5 లక్షలు, ఏపీలో 21 లక్షల పరీక్షలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు రాష్ట్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. కేసుల సంఖ్య, పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలంగాణలో మంగళవారం నాటికి కరోనా నిర్ధారణ పరీక్షలు 5 లక్షలు దాటాయి. కాగా కరోనా పరీక్షల్లో దేశంలోని అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరీక్షల సంఖ్య 22 లక్షలకు చేరువలో ఉంటోంది. 

తెలంగాణలో 5 లక్షలకు చేరిన కరోనా పరీక్షలు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో.. కొత్తగా 2012 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 70,958కు చేరింది. కాగా కరోనా నుంచి కొత్తగా 1139 మంది కోలుకోగా.. ఇప్పటివరకు కరోనా నుంచి 50,814 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 

కాగా గత 24 గంటల్లో కరోనాతో కొత్తగా 13 మంది మృతి చెందగా.. రాష్ట్రంలో మరణాల సంఖ్య 576కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 19,568 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా కేసుల విషయానికి వస్తే జీహెచ్‌ఎంసీ పరిధిలో 532,మేడ్చల్‌లో 198, రంగారెడ్డిలో 188, వరంగల్‌ అర్బన్‌లో 127 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.  తెలంగాణలో ఇప్పటివరకు 5,22,143 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు

కాగా, తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 391, రంగారెడ్డి జిల్లాలో 121, కరీంనగర్‌లో 101, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 72, వరంగల్‌ అర్బన్‌లో 63, నిజామాబాద్‌లో 59, జోగులాంబ గద్వాలలో 55, ఖమ్మంలో 41, మహబూబ్‌నగర్‌లో 39, భద్రాద్రి కొత్తగూడెంలో 38, నల్లగొండలో 29, నాగర్‌ కర్నూలు, పెద్దపల్లి జిల్లాల్లో 29 కేసుల చొప్పున నమోదయ్యాయని శ్రీనివాసరావు తెలిపారు. 

ఇదిలాఉంటే రాష్ట్రంలో 72 శాతం రికవరీ రేటు ఉందని ఆయన తెలిపారు. అదే దేశంలో సరాసరి 65.77 శాతంగా ఉందని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా పడకల సంఖ్య 5,907 ఖాళీగా ఉండగా, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 2,509 పడకలు ఖాళీగా ఉన్నాయి. 

ఏపీలో 64,147 పరీక్షలు.. మొత్తం పరీక్షల సంఖ్య 22 లక్షలు

ఏపీలో కరోనా నిర్ధారణ పరీక్షల జోరు కొనసాగుతూనే ఉంది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 వరకు 64,147 మందికి పరీక్షలు నిర్వహించినట్టు వైద్యారోగ్యశాఖ మంగళవారం బులెటిన్‌లో పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 21,75,070కి చేరింది.

కొత్తగా 9,747 మందికి పాజిటివ్‌గా తేలడంతో మొత్తం కరోనా కేసులు 1,76,333కి చేరాయి. తాజాగా 67 మంది మృతితో మొత్తం మరణాలు 1,604కి చేరాయి. ఆస్పత్రుల నుంచి 6,953 మంది డిశ్చార్జ్‌ అవడంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 95,625కి చేరింది. యాక్టివ్‌ కేసులు 79,104 ఉన్నాయి. మిలియన్‌ జనాభాకు 40,732 పరీక్షలు నిర్వహిస్తున్నారు.

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   an hour ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   3 hours ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   2 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   4 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   4 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   5 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   21 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   22-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle