తెలుగు రాష్ట్రాల్లో కరోనా వీరవిహారం
27-05-202027-05-2020 12:37:26 IST
Updated On 27-05-2020 13:22:49 ISTUpdated On 27-05-20202020-05-27T07:07:26.417Z27-05-2020 2020-05-27T07:06:31.567Z - 2020-05-27T07:52:49.185Z - 27-05-2020

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల ఉధృతి కొనసాగుతూనే వుంది. తెలంగాణలో కరోనా కేసులకు సంబంధించి వైద్యారోగ్యశాఖ తాజా బులెటిన్ విడుదలచేసింది. రాష్ట్రంలో కొత్తగా 71 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ లో ఇప్పటి వరకు 1991 కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా ఒకరు మరణించారని వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో మరణించినవారి సంఖ్య 57కి చేరింది. తెలంగాణా లో 650 యాక్టీవ్ కేసులుండగా, ఇవాళ 120 మంది డిశ్చార్జి అయినట్లు వైద్యుల వెల్లడించారు. ఇప్పటి వరకు 1284 మంది డిశ్చార్జి అయినట్టు తెలిపింది. తాజాగా నమోదయిన పాజిటివ్ కేసుల్లో జిహెచ్ఎంసీ పరిధిలో లో 38 వుండడం ఆందోళన కలిగిస్తోంది. 12 పాజిటివ్ కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళ వల్ల వచ్చాయి. విదేశాల నుంచి వచ్చిన వారికి 4మందికి కరోనా పాజిటివ్ నమోదు అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 7, మేడ్చెల్ 6,- సూర్యాపేట్, వికారాబాద్, నల్గొండ, నారాయణ్ పెట్ లో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఇటు ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య క్రమేపి పెరుగుతూనే ఉన్నాయి 24 గంటల్లో 68 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం ఏపీలో ఇప్పటివరకు 2787 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులను అమరావతి తరలించేందుకు వీలుగా తెలంగాణ సర్కారు ప్రత్యేక బస్సులకు అనుమతి ఇచ్చింది. తమ ఉద్యోగులను తరలించేందుకు ప్రత్యేక బస్సులకు అనుమతివ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ఏపీ సీఎస్ నీలం సాహ్ని లేఖ రాశారు. సుమారు 400 మంది ఉద్యోగులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బస్సులకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం అనుమతినిచ్చింది. తొలిదశలో 250 మందిని తరలించేందుకు ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఒక ఏసీ బస్సుతోపాటు మిగిలినవి సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేసింది. ఎల్బీనగర్ నుంచి ఈ బస్సులు బయల్దేరనున్నాయి.

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
6 hours ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
9 hours ago

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
12 hours ago

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
13 hours ago

ఏందయ్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే
13 hours ago

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మరి రాష్ట్రాల మాటేంటి
11 hours ago

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..
21-04-2021

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!
a day ago

కాంగ్రెస్ కి ఇంకా ఆశలు ఉన్నట్లున్నయ్
21-04-2021

తిరుపతి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ తప్పదా
21-04-2021
ఇంకా