newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా దోబూచులాట.. ఏపీ 1775, తెలంగాణలో 1,178 కేసులు

12-07-202012-07-2020 08:57:14 IST
Updated On 12-07-2020 10:58:28 ISTUpdated On 12-07-20202020-07-12T03:27:14.260Z12-07-2020 2020-07-12T03:27:11.480Z - 2020-07-12T05:28:28.626Z - 12-07-2020

తెలుగు రాష్ట్రాల్లో కరోనా దోబూచులాట.. ఏపీ 1775, తెలంగాణలో 1,178 కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. అయితే కరోనా నిర్ధారణ పరీక్షల్లోనూ ఇప్పటికీ గందరగోళం కొనసాగుతోంది. చాలా సందర్భాల్లో పాజిటివ్‌కు నెగిటివ్ అని.. నెగిటివ్‌కు పాజిటివ్ అంటూ మెస్సేజులు రావడంతో జనాలు వణుకుపోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ ప్రభుత్వ ల్యాబ్‌లతో పాటు ప్రైవేటు ల్యాబ్‌ల్లో టెస్టులు జరుగుతున్నాయి. ప్రభుత్వ ల్యాబ్‌ల్లో ఫలితాలు ఆలస్యంగా వస్తున్నా. ..ప్రైవేటు ల్యాబ్‌ల్లో ఫలితాలపై అనుమానాలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో కొన్ని ప్రైవేటు ల్యాబ్‌ల్లో ఏకంగా 72 శాతం పాజిటివ్ రేటురావడంపై ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేసింది. కొన్ని రోజుల పాటు వాటి ఫలితాలను కూడా నిలిపివేసింది. 

కొన్ని ల్యాబ్‌ల్లో వందమందికి పరీక్షలు చేస్తే 72 మందికి పాజిటివ్ రావడంపై కలకం రేపింది. ప్రపంచంలో ఎక్కడా ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు రాలేదన్నారు. దీంతో దాదాపు 13 ల్యాబ్‌లకు నోటీసులు కూడా జారీ చేశారు. ఇప్పుడు కొందరు ప్రభుత్వ ల్యాబ్‌ల ఫలితాలపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోనే కాదు.. ఏపీలోనూ సేమ్ ఇదే సీన్ కనిపిస్తోంది. ఓవైపు ప్రభుత్వం వేల సంఖ్యలో టెస్టులు చేస్తున్నామని చెబుతున్నాఫలితాల విషయంలో మాత్రం సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తోంది. పాజిటివ్  నెటిగివ్ అని ఆన్ లైన్ లో నమోదు చేయడంతో గందరగోళం నెలకొంటోంది. కరోనా ల్యాబ్ నుంచి వచ్చిన పాజిటివ్ రిపోర్టులను వెబ్‌సైట్‌లో నెగిటివ్‌గా అప్‌లోడ్ చేస్తున్నారు. దీంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఏపీలో కొత్తగా 1,775 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,775 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాలకు నుంచి వచ్చిన  34 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో నలుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటిన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 14393 మంది కరోనా నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అయ్యారు. గడిచిన 24 గంటల్లో కర్నూలులో నలుగురు, గుంటూరులో ముగ్గురు, విజయనగరం ముగ్గురు, కృష్ణాలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు.. అనంతపురం,కడప,విశాఖపట్నంలో ఒక్కరు చొప్పున మొత్తం 17  మంది కరోనా వైరస్‌ బారినపడి  మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 309 మంది మృతిచెందారు. 

రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 27,235కు చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం 12,533 యాక్టివ్‌  కేసులు ఉన్నాయి. ఏపీలో ఇప్పటివరకు 11,36,255 కరోనా  నిరార్ధణ  పరీక్షలు నిర్వహించారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో రాష్ట్రం మరో మైలు రాయిని చేరుకుంది. గురువారం ఉదయం 9 నుంచి 24 గంటల్లో 21,020 మందికి పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 11,15,635కి చేరింది. వరుసగా మూడో రోజు కూడా కరోనా నుంచి కోలుకుని వెయ్యి మందికి పైగా.. 1,040 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 13,194కి చేరింది. 1,608 మందికి పాజిటివ్‌గా తేలడంతో మొత్తం కేసుల సంఖ్య 25,422కి చేరింది. మొత్తం మరణాలు 292కు చేరాయి. యాక్టివ్‌ కేసులు 11,936 ఉన్నాయి. ఇన్ఫెక్షన్‌ రేటు    2.28% - రికవరీ రేటు    51.90% - మరణాల రేటు    1.15%

తెలంగాణలో కొత్తగా 1,178 కరోనా కేసులు 

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,178 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 33,402కు చేరింది. ఇవాళ ఒక్కరోజే తొమ్మిది మంది కరోనాతో మృతిచెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే శనివారం రోజున ఆస్పత్రుల నుంచి 1,714 మంది కోలుకోని డిశ్చార్జ్‌ కాగా.. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 20,919కు చేరింది. కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 348కు చేరింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 12,135 మంది కరోనాతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. శనివారం 11,062 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. అందులో 9,884మందికి నెగెటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో 736, రంగారెడ్డిలో 125, మేడ్చల్‌లో 101 కేసులు నమోదయ్యాయి.

జీహెచ్‌ఎంసీ పరిధిలో 736 పాజిటివ్ కేసులు నమోదు కాగా రంగారెడ్డి జిల్లాలో 125, మేడ్చల్ జిల్లాలో 101, సంగారెడ్డిలో 13,  ఖమ్మంలో 2,  వరంగల్ అర్బన్‌లో 20, వరంగల్ రూరల్‌లో 2,  నిర్మల్‌లో 2,కరీంనగర్‌లో 24,  జగిత్యాలలో 2,  యాదాద్రిలో 9, మహబూబాబాద్‌లో 5, పెద్దపల్లిలో 12, మెదక్‌లో 16, మంచిర్యాలలో 5, నల్గొండలో 12, రాజన్న సిరిసిల్లలో 24, ఆదిలాబాద్‌లో 8, ఆసీఫాబాద్‌ జిల్లాలో 1, నారాయణపేట్ జిల్లాలో 5, వికారాబాద్ జిల్లాలో 9, జనగాం జిల్లాలో 2, నిజామాబాద్ జిల్లాలో 12, వనపర్తి జిల్లాలో 2, సిద్దిపేట జిల్లాలో 9, సూర్యపేట జిల్లాలో 7, గద్వాల జిల్లాలో 6 కేసులు నమోదు అయినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. 

 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   11 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   12 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   16 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   15 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   19 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   18 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   21 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   17 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle