newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా టెర్రర్.. జాగ్రత్తలు లేకుంటే అంతే సంగతులు

07-06-202007-06-2020 08:52:46 IST
Updated On 07-06-2020 09:57:52 ISTUpdated On 07-06-20202020-06-07T03:22:46.391Z07-06-2020 2020-06-07T03:22:28.212Z - 2020-06-07T04:27:52.686Z - 07-06-2020

తెలుగు రాష్ట్రాల్లో కరోనా టెర్రర్.. జాగ్రత్తలు లేకుంటే అంతే సంగతులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గతంలో ఎన్నడూ లేనివిధంగా కరోనా వైరస్ తన ప్రతాపం చూపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు భారీగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఒక రోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుంటే.. మరొక రోజు తగ్గుతున్నాయి. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం పెరుగుతూనే వుంది. గత కొద్ది రోజులుగా రోజు వందకు పైగా నమోదవుతుండగా.. శనివారం నాడు ఏకంగా 206 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3496కి చేరింది. శనివారం నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలోనే నమోదు కావడంతో పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.

తాజాగా 152 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే వచ్చాయి. రంగారెడ్డిలో 10, మేడ్చల్‌లో 18, నిర్మల్‌లో 5, మహబూబ్‌నగర్‌లో4 కేసులు నమోదయ్యాయి. జగిత్యాల, నాగర్ కర్నూల్‌లో రెండేసి కేసులు నమోదవ్వగా.. మహబూబాబాద్, వికారాబాద్‌, గద్వాల్, నల్గొండ, భద్రాద్రి, కరీంనగర్‌, మంచిర్యాల జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి 123 మంది మరణించారు.

మరణాల సంఖ్య భారీగా పెరగడం అధికారులను కలవరపెడుతోంది. కరోనా నుంచి కోలుకొని.. 1710 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 1663 మంది ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. ఇప్పటివరకూ తెలంగాణలో 3496 కి కేసులు పెరిగాయి. 

ఆంధ్రప్రదేశ్ లో పరీక్షలు పెరుగుతున్నాయి. శనివారం ఒక్కరోజే కొత్త‌గా 210 కేసులు న‌మోదు అయ్యాయి. గతంలో ఎప్పుడూ  ఈస్థాయిలో కేసులు రాలేదు. వాటిలో వివిధ జిల్లాల‌కు చెందిన వారు 161 మంది, వ‌ల‌స కూలీలు 41 మంది, ఎన్‌ఆర్ఐలు 8 మంది ఉన్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో న‌మోదైన కేసుల సంఖ్య 4460కి పెరిగింది.. వాటిలో 13 జిల్లాల‌లో 3588 కేసులు, విదేశాల నుంచి వ‌చ్చిన 131 కేసులు, వ‌ల‌స కూలీల 741 కేసులున్నాయి. ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు 73 మంది మ‌ర‌ణించారు. 

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వైరస్ వదలడం లేదు. రోజు రోజూకూ విరుచుకుపడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా వైరస్  విస్తరిస్తుండడం గుబులు పుట్టిస్తోంది. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత కేసుల తీవ్రత అధికమవుతోంది. ఒక్క రోజులోనే రెండు రాష్ట్రాల్లో 4వందలకు పైగా కేసులు నమోదయ్యాయి. పరిస్థితి తీవ్రంగా వుందని. వైరస్ విస్తరించే ప్రమాదముందని... ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  లాక్ డౌన్ సడలింపులు వున్నా అవసరం వుంటేనే బయటకు రావాలని ప్రజలకు సూచిస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగానూ పరిస్థితి తీవ్రంగా ఉంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle