newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

06-04-202006-04-2020 17:08:30 IST
Updated On 06-04-2020 17:13:00 ISTUpdated On 06-04-20202020-04-06T11:38:30.598Z06-04-2020 2020-04-06T11:38:28.150Z - 2020-04-06T11:43:00.490Z - 06-04-2020

తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు రాష్ట్రాలపై కరోనా మహమ్మారి తన కరాళ హస్తాలను మెల్లమెల్లగా చాస్తోందనడానికి సంకేతాలు బలంగా వెలువడుతున్నాయి. గత పదిహేను రోజులుగా అరుదుగా, ఒకటీ ఆరాగా నమోదవుతూ వచ్చిన కరోనా పాజిటివ్ కేసులు ఉన్నట్లుండి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో డజన్లసంఖ్యలో పెరుగుతూ భయోత్పాతం సృష్టించడానికి ముందుకొస్తోంది. తెలంగాణలో ఒక్క ఆదివారమే 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదవటంతో ఆందోళన పరాకాష్ట చేరుకుంది. రాష్ట్రం మొత్తం మీద హైదరాబాద్‌లో అధికంగా కరోనా కేసులు నమోదవుతుండటంతో నగరవాసులు భీతిల్లిపోతున్నారు. మరోవైపు..  శనివారం రాత్రి 9 గంటల నుంచి ఆదివారం సా.5 గంటలు వరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా త్తగా 60 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసులు, కరోనా కేసుల సంఖ్యలో కూడా ఏపీ తెలంగాణలు పోటీపడుతుండటం ప్రజారోగ్య వ్యవస్థలను ఆందోళనలోకి నెడుతోంది.

తెలంగాణలో కొనసాగుతున్న కరోనా పంజా.. 

తెలంగాణ రాష్ట్రంలో 25 జిల్లాలకు పాకిన మహమ్మారి దెబ్బకు అటు ప్రభుత్వం, ఇటు ప్రజానీకంలో కలవరం మొదలైంది. ఎంతగా కట్టడి చేసినా వేలాదిమంది పోలీసులు రాష్ట్రాన్ని జల్లెడపడుతున్నా,, తెలంగాణలో కరోనా కల్లోలం ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆదివారం మళ్లీ 62 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 333కు చేరుకుంది. అందులో 297 మంది ఢిల్లీ మర్కజ్‌తో సంబంధం ఉన్నవారు, వారి కుటుంబీకులే కావడం గమనార్హం. 

అంటే మొత్తం కేసుల్లో 89 శాతం మంది ఏకంగా ఢిల్లీ మర్కజ్‌తో సంబంధం ఉన్నవారే కావడం ఆందోళన కలిగిస్తోంది. మిగిలిన వారు వివిధ దేశాల నుంచి వచ్చినవారు, వారి కుటుంబీకులు, స్థానికంగా ఎటువంటి కాంటాక్ట్‌తో సంబంధం లేకుండా సోకిన వారున్నారన్నారు. ఆదివారం 480 మందికి కరోనా నిర్ధారణ పరీ క్షలు చేయగా, ఈ ఫలితాలు వచ్చాయి. కాగా, కరోనా కేసుల్లో ఇప్పుడు దేశంలో తెలంగాణ రాష్ట్రం పైపైకి చేరడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌ నుంచే ఉన్నాయి. ఇక్కడ 162 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఒకరోజు వ్యవధిలోనే 51 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇప్పటివరకు ఏడుగురు చనిపోయారు. 11 మంది డిశ్చార్జి అయ్యారు. వరంగల్‌ అర్బన్‌లో 24 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. అందులో ఒకరు  డిశ్చార్జి అయ్యారు. నిజామాబాద్‌ జిల్లాలో 19 నమోదు కాగా, ఒకరు చనిపోయారు. కాగా, తెలంగాణలోని 25 జిల్లాలకు కరోనా పాకింది. సోమవారం మరో 600 మందికి పరీక్షలు నిర్వహించే అవకాశముంది.

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   13 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   9 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   11 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   13 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   16 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   17 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   19 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   20 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   21 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle