తెలుగు జాతికి వన్నె తెచ్చిన పీవీ
25-07-202025-07-2020 08:28:33 IST
Updated On 25-07-2020 08:34:57 ISTUpdated On 25-07-20202020-07-25T02:58:33.134Z25-07-2020 2020-07-25T02:57:26.972Z - 2020-07-25T03:04:57.096Z - 25-07-2020

మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలు శుక్రవారం ఇందిరాభవన్‌లో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, గీతారెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నేతలంతా మాట్లాడారు. సామాన్య కార్యకర్త నుంచి దేశ ప్రధాని స్థాయికి ఎదిగిన మహోన్నత వ్యక్తి పీవీ నరసింహరావు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనియాడారు. పీవీతో తనకు వ్యక్తిగతంగా మంచి పరిచయం ఉందని గుర్తు చేసుకున్నారు. భూసంస్కరణలు తెచ్చిన ఘనత ఆయనదని, చనిపోయే వరకు కాంగ్రెస్ వాదిగానే ఉన్నారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పీవీకి భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేశామని ఉత్తమ్ గుర్తు చేశారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న దేశాన్ని ఆదుకున్నది ఆయన సంస్కరణలే అని చెప్పారు. పీవీ ప్రధానిగా పనిచేసిన కాలం.. అనేక రాజకీయ, సామాజిక, విదేశాంగ విధాన విజయాలకు నాంది పలికిందని అన్నారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఒక సామాన్యుడు సైతం ప్రధాని కావచ్చనే విషయాన్ని పీవీని చూసి స్ఫూర్తి పొందాలని సూచించారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండానే దేశాన్ని ఏలే స్థాయికి పీవీ నరసింహారావు ఎదిగారని గుర్తు చేసుకున్నారు. ఒక తెలుగువ్యక్తికి అంతటి గొప్ప స్థాయి కాంగ్రెస్ పార్టీ కల్పించిందని అన్నారు. దక్షిణాది రాష్ర్టాల నుంచి పీవీకి దక్కిన గౌరవం మరెవరికి దక్కలేదని కొనియాడారు.సొంత గూటి నుంచే పీవీకి గట్టి పోటీ ఉండేదని వీహెచ్ అన్నారు. పీవీని తెలంగాణ వ్యతిరేకిగా ముద్రవేసే ప్రయత్నం జరిగిందని చెప్పారు. తమ అధ్యక్షుడి మాటకు గౌరవం ఇచ్చి ప్రస్తుతం రాజకీయాల గురించి మాట్లాడటం లేదని అన్నారు. పీవీ ఆశించినట్లు బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలని వీహెచ్ ఆకాంక్షించారు. తెలుగు జాతికి వన్నె తెచ్చిన వ్యక్తి పీవీ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అన్నారు.

ఏపీలో స్కూల్స్ బంద్
13 hours ago

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?
12 hours ago

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
17 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
18 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
14 hours ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
20 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
21 hours ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా
13 hours ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
15 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
21 hours ago
ఇంకా