తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు
26-05-202026-05-2020 10:14:08 IST
Updated On 26-05-2020 10:16:44 ISTUpdated On 26-05-20202020-05-26T04:44:08.125Z26-05-2020 2020-05-26T04:44:05.725Z - 2020-05-26T04:46:44.039Z - 26-05-2020

కరోనా పాజిటివ్ కేసుల్లో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కరోనా విస్తరణ సంఖ్యాపరంగా పెద్దగా లేదని పైకి కనబడుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మెల్లమెల్లగా కరోనా కేసులు, మృతుల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. తెలంగాణలో హైదరాబాద్, జీహెచ్ఎంసీ కరోనా కేంద్రంగా కొనసాగుతుండగా, ఏపీలో గుంటూరు, కర్నూలు కరోనా వ్యాప్తి కేంద్రాలుగా సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సోమవారం మరో 66 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు చనిపోయారు. నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీకి చెందిన 31 మంది, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒకరు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలసదారులు 15 మంది, విదేశాల నుంచి వచ్చినవారు 18 మంది ఉన్నారు. ఇక మహారాష్ట్రకు చెందిన ఒకరు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,920కి చేరింది. మొత్తం ఇప్పటివరకు 56 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 700 మంది చికిత్స పొందుతున్నారని ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్‌రావు తెలిపారు. సోమవారం 72 మంది కోలుకోగా, వారితో కలిపి ఇప్పటివరకు 1,164 మంది డిశ్చార్జి అయ్యారని వివరించారు. తాజాగా నమోదైన 66 కేసుల్లో 32 తెలంగాణకు చెందినవని, మిగిలినవి విదేశాల నుంచి వచ్చిన వారు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలసదారులు, మహారాష్ట్రకు చెందిన ఒకరు ఉన్నారని పేర్కొన్నారు. ఏపీలో తాజాగా 41 మంది డిశ్చార్జి.. కొత్తగా 89 మందికి పాజిటివ్ నిర్ధారణ రాష్ట్రంలో కొత్తగా 41 మంది డిశ్చార్జి కావడంతో సోమవారానికి కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,884కు చేరింది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు మొత్తం 10,240 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 89 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఇందులో 45 కేసులు విదేశాల నుంచి వచ్చిన వారివి ఉన్నాయి. కువైట్ నుంచి వచ్చిన 41 మంది, ఖతార్ నుంచి వచ్చిన ముగ్గురికి, సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఒకరికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది. అదే విధంగా తమిళనాడులోని కోయంబేడుకు వెళ్లి వచ్చిన మరో ఏడుగురికి వైరస్ సోకినట్లు నిర్ధారించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,886కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. పాజిటివ్ కేసుల్లో విదేశాల నుంచి వచ్చిన 62 కేసులకు తోడు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి సంబంధించి 153 కేసులు కూడా ఉన్నాయి. గడిచిన రెండు రోజులుగా ఎటువంటి మరణాలు నమోదు కాలేదు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 56గా ఉంది. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 946గా ఉంది.

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
2 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
3 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
5 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
6 hours ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
6 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
7 hours ago

వన్ ప్లస్ వన్ ఆఫర్
5 hours ago

నా రూటే సెపరేటు
9 hours ago

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
a day ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
a day ago
ఇంకా