తెలంగాణ 178, ఏపీ 143.. వణుకుతున్న హైదరాబాద్, విజయవాడ
10-06-202010-06-2020 19:17:08 IST
2020-06-10T13:47:08.836Z10-06-2020 2020-06-10T13:47:06.628Z - - 10-04-2021

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా మంగళవారం ఒక్కరోజే 178 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆరుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు 3,920కు చేరింది. మొత్తంగా 148మంది ప్రాణాలు కోల్పోగా, 1,742 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 2,030 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా వచ్చిన కేసుల్లో 143 జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. మిగిలిన కేసుల్లో రంగారెడ్డిలో 15, మేడ్చల్‌లో 10, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, మెదక్‌లో రెండేసి చొప్పున నమోదు కాగా, జగిత్యాల, అసిఫాబాద్, సిరిసిల్లా, వరంగల్ జిల్లాలో ఒక్కో కేసు నమోదైనట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, మృతులు ఆందోళన కలిగిస్తున్నాయి. లాక్డౌన్ సడలింపుతో కరోనా ఒక్కసారిగా విజృంభించింది. దీంతో రోజు రోజుకు కరోనా బారిన పడే వారి సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. వారం నుంచి అయితే మరీ ఘోరంగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో అయితే పాజిటివ్ నిర్ధారణ కేసులు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుతోంది. ఎప్పుడు ఎవరి వల్ల కరోనా సోకుతుందోనన్న భయం ప్రజల్లో కలుగుతోంది. ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు.. 147 పాజిటివ్‌లు ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 15,085 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. ఈ పరీక్షల్లో 147 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు పేర్కొంది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం విడుదల చేసిన కరోనా హెల్త్ బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ వివరించింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి పూర్తిగా కోలుకొని 16 మంది డిశ్చార్జ్ కాగా ఇద్దరు మృత్యువాతపడ్డారు. మరణించిన ఆ ఇద్దరు కృష్ణా, అనంతపురం జిల్లాలకు చెందిన వారని అధికారులు తెలిపారు. ఏపీలో ఇప్పటివరకు 3990 కరోనా కేసులు నమోదు కాగా 2403 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక కరోనా బారిన పడి ఇప్పటివరకు 77 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1510 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. విజయవాడలో సగం ప్రాంతాలు కంటైన్మెంట్ జోన్లే విజయవాడ నగరంలో కరోనా వైరస్ ప్రభావం అంతకంతకూ పెరగడంతో కలెక్టర్ ఇంతియాజ్ కీలక ప్రకటన చేశారు. నగరంలోని సగానికి పైగా ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ఆయన ప్రకటించారు. 64లో 42 డివిజన్లు కట్టడి ప్రాంతాలుగా ప్రకటించారు. కనకదుర్గ గుడి ప్రాంతం కూడా కంటైన్మెంట్ జోన్లోకే వస్తుండటం గమనార్హం. విజయవాడలో విపరీతంగా కేసులు పెరగడంతో అత్యవసర ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ప్రకటనతో నగరంలోని పలు కీలక ప్రాంతాలు కట్టడి జోన్లో చేరాయి.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
5 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
2 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
4 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
8 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
11 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
12 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
a day ago

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా