newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణ సర్కార్ తీరుపై హైకోర్టు సీరియస్.. ఎందుకంటే?

15-07-202015-07-2020 12:23:01 IST
Updated On 15-07-2020 12:26:33 ISTUpdated On 15-07-20202020-07-15T06:53:01.480Z15-07-2020 2020-07-15T06:52:51.220Z - 2020-07-15T06:56:33.317Z - 15-07-2020

తెలంగాణ సర్కార్ తీరుపై హైకోర్టు సీరియస్.. ఎందుకంటే?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కోవిడ్ వైద్యం, పరీక్షలు, ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలు చనిపోతున్నా పట్టదా.. ప్రభుత్వానికి ఎందుకింత అహంకారం? అని తెలంగాణ సర్కారుపై మండిపడింది హైకోర్టు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న వేళ హైకోర్టు వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కార్పొరేట్‌ ఆస్పత్రులు, టీచింగ్‌ ఆస్పత్రుల్లో భారీగా ఫీజులు వసూళ్లు చేస్తున్నారని, బోధనాస్పత్రులను కోవిడ్‌ ఆస్పత్రులుగా గుర్తించాలని, ఆసుపత్రుల్లో ఉన్న బెడ్స్‌ ఖాళీలను డ్యాష్‌బోర్డుల ద్వారా తెలియజేయాలని కోరుతూ డీజీ నరసింహారావు, శ్రీకిషన్‌శర్మ, కర్ణాటి శివ గణేశన్, డాక్టర్‌ శ్రీనివాసన్‌లు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను హైకోర్టు మంగళవారం మరోసారి విచారణ జరిపింది.

రాష్ట్రంలో కరోనా రోగుల కోసం ఏయే ఆస్పత్రులను కోవిడ్‌ సేవల కోసం ఉపయోగిస్తున్నారు.. ఏయే ఆస్పత్రుల్లో ఎన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయి.. ఎన్ని వెంటలేటర్లు ఉన్నాయి.. ఏ ఆస్పత్రుల్లో ఏ రకమైన సేవలందిస్తున్నారు.. ఆ ఆస్పత్రుల వివరాలను చిరునామాలతో సహా ప్రతికా ముఖంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియచేయాలని హైకోర్టు మంగళ వారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కరోనా వల్ల ఇబ్బందిపడుతున్న వ్యక్తులకు ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో.. మధ్యరక, సాధారణ లక్షణాలున్న వారికి నీలోఫర్, ఫీవర్, ఛాతి ఆస్పత్రుల్లో.. నేచర్‌క్యూర్, ఆయుర్వేద ఆస్పత్రులను ఐసోలేషన్‌ కోసం కేటాయించినట్లు పత్రికల ద్వారా ప్రజలకు చెప్పాలని సూచించింది.కోవిడ్‌ సేవల కోసం గుర్తించిన 87 ఆస్పత్రుల వివరాలను కూడా తెలియజేయాలని స్పష్టంచేసింది. 

ఈ కేసులో తదుపరి విచారణ ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది హైకోర్ట్. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.  గాంధీ ఆస్పత్రిలో అందరికీ పరీక్షలు చేయలేమని, కేవలం చికిత్స మాత్రమే అందిస్తున్నామని వారు కోర్టుకు తెలిపారు. అందుబాటులో ఉన్న కిట్‌లతో గర్భిణీలకు మాత్రమే పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. అలాగే సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆసుపత్రిలో 300 పడకలను కోవిడ్‌ సేవలకు కేటాయించామన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంంది. 

నాచారంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రిని కూడా కోవిడ్‌ సేవల కోసం ఉపయోగించుకోవాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫీజుల తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవోలో నిర్ధేశించిన రేట్ల కంటే ఎక్కువ వసూలు చేసే ప్రైవేట్‌ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రైవేట్‌ ఆస్పత్రులపై ప్రభుత్వానికి అజమాయిషీ ఉందో లేదో అర్ధం కానట్లుగా ఉందని వాఖ్యానించింది.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అత్యంత ఉధృతంగా ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం ప్రజలు చనిపోతే మాకేంటి అన్నట్లుందని వ్యాఖ్యానించింది.  పరీక్షలు చేయించడం ప్రభుత్వ బాధ్యత. జనాన్ని గాలికి వదిలేయకూడదు. దయలేని ప్రభుత్వ మనస్తత్వం అంతు చిక్కడంలేదు. పరీక్షలు చేయకుండా ప్రజలను వెనక్కి పంపడం ద్వారా ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని కోర్టు పేర్కొన్నట్టు తెలుస్తోంది. 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   10 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   15 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   12 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   16 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   14 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   18 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   17 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   20 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   16 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle