newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. అక్కడ 31వరకూ లాక్ డౌన్

01-07-202001-07-2020 13:08:11 IST
Updated On 01-07-2020 18:09:09 ISTUpdated On 01-07-20202020-07-01T07:38:11.144Z01-07-2020 2020-07-01T07:38:02.778Z - 2020-07-01T12:39:09.159Z - 01-07-2020

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. అక్కడ 31వరకూ లాక్ డౌన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. భార‌త్‌లో గ‌త 24 గంట‌ల్లో 18,653 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా 507 మంది మృతి.. 5,85,493కు చేరాయి పాజిటివ్ కేసులు. ఇప్ప‌టి వ‌ర‌కు 17,400 మంది మృతి చెందారు. ఇటు తెలంగాణలో కేసుల తీవ్రత కొనసాగుతోంది. భాగ్యనగరవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలను కరోనా వైరస్ వెంటాడుతూనే వుంది. మంగళవారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 869 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 29, మేడ్చల్‌ జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి.   

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం వెలువరించింది. జూన్ 30తో కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ నిబంధనలు ముగిశాయి. దీంతో రాష్ట్రంలోని కంటైన్మెంట్ జోన్లలో ఈ నెల 31 వరకు లాక్ డౌన్‌‌ను పొడిగిస్తూ కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జీవోను జారీ చేశారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ యధావిధిగా కొనసాగనుంది.

కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. మెడికల్ షాపులు, ఆసుపత్రులు తప్ప మిగిలిన షాపులన్నీ కూడా రాత్రి 9.30 గంటల కల్లా మూసివేయాలన్నారు. కేంద్రం విధించిన అన్‌లాక్ 2.0 నిబంధనలు తక్షణం అమలులోకి వస్తాయని పేర్కొంది.

కాగా, పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతుండటంతో కంటైన్మెంట్ జోన్లు, బఫర్ జోన్లలో లాక్ డౌన్, రూల్స్ కఠినంగా అమలు చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్లలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకోవాలని పోలీసుకు తెలిపింది. 

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   5 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   6 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   6 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   10 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   11 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   9 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   11 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   12 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   7 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   14 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle