newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఊరట

18-06-202018-06-2020 12:39:25 IST
Updated On 18-06-2020 18:35:29 ISTUpdated On 18-06-20202020-06-18T07:09:25.740Z18-06-2020 2020-06-18T07:08:43.639Z - 2020-06-18T13:05:29.094Z - 18-06-2020

తెలంగాణ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఊరట
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల ఉధృతి కొనసాగుతూనే వుంది. గ్రేటర్ హైదరాబాద్ కరోనా హాట్ స్సాట్ గా మారింది. బుధవారం ఒక్కరోజే 269 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,675కు చేరింది. ఇందులో ప్రస్తుతం 2,412 మంది చికిత్స పొందుతున్నారు. 3,071 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా వైరస్‌ ప్రభావంతో బుధవారం ఒకరు మృతి చెందా రు. దీంతో రాష్ట్రంలో కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 192కు చేరింది. దీంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. 

మృతదేహాలకు కోవిడ్‌-19 పరీక్షలు చేయాలన్న తెలంగాణ హైకోర్టు తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించడంతో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించినట్టయింది. ఆస్పత్రుల్లో మరణించిన వారి మృతదేహాల నుంచి రక్త నమూనాలు సేకరించి వైద్య పరీక్షలు నిర్వహించడం లేదని తెలంగాణ హైకోర్టు.. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

మే 18, 26 తేదీల్లో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినా... వాటిని అమలు చేయకుండా అరకొర సమాచారంతో కోర్టును మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తే ఎలాగని ఇటీవల ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది.

ఈ నేపథ్యంలో విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలు నిర్వహించకపోవడం, పీపీఈ కిట్లు ఇవ్వకపోవడం, మృతదేహాలకు పరీక్షలు మొదలైన ప్రజాహిత వ్యాజ్యాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గత సోమవారం విచారింంది. ఈ సందర్భంగా.. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం మృతదేహాలకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని వైద్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ రావు చెప్పడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ పరీక్షల్లో ఒకవేళ కరోనా పాజిటివ్‌ అని తేలితే మృతుడి కుటుంబసభ్యులకు పరీక్షలు చేయొచ్చు కదా అని ప్రశ్నించింది. 

కరోనా పరీక్షల విషయంలో హైకోర్టు ఉత్తర్వులను ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించగా, హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని ఏజీ కోర్టుకు తెలిపారు. ఇందుకు స్పందించిన ధర్మాసనం.. తామిచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వనంత వరకు హైకోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రభుత్వ తీరు ఇలాగే ఉంటే వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్లపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. తాజాగా సుప్రీంకోర్టు స్టే విధించడంతో ప్రభుత్వానికి తాత్కాలికంగా ఊరట లభించింది. 

మరోవైపు తెలంగాణలో కరోనా టెస్టులు సరిగా చేయడం లేదని విపక్షాలు కూడా మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 10 రోజుల్లో 50 వేల టెస్టులకు రంగం సిద్ధం చేసింది. 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   7 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   10 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   13 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   13 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   14 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   12 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   a day ago


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle