newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణ సర్కారుకు మరోసారి హైకోర్టు చివాట్లు!

03-03-202003-03-2020 11:47:32 IST
2020-03-03T06:17:32.985Z03-03-2020 2020-03-03T06:17:28.530Z - - 18-04-2021

తెలంగాణ సర్కారుకు మరోసారి హైకోర్టు చివాట్లు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈమధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు టైం అస్సలు బాగోలేనట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే రెండు రాష్ట్రాల హైకోర్టులో కూడా రోజూ పదుల సంఖ్యలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లు విచారించడం.. ప్రభుత్వాలకు చివాట్లు పెట్టడమే సరిపోతుంది. ఇందులో ఏపీ ప్రభుత్వం ఎవరికీ అందనంత ముందుకు వెళ్ళింది.

ఏపీ హైకోర్టులో రోజుకు పదుల సంఖ్యలో ప్రభుత్వ వ్యతిరేక పిటిషన్లు విచారణకు వస్తుండగా ప్రభుత్వ తరపు లాయర్లు అటూ ఇటూ పరుగులు పెడుతూ పూర్తి సమాచారం లేనందుగా వాయిదా వేయాలని కోరడమే పనిగా పెట్టుకున్నారు. మరీ ఆ స్థాయిలో కాకపోయినా తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఒకటిన్నర ఏడాదిలో చాలాసార్లు హైకోర్టుతో అక్షింతలు వేయించుకుంది.

అందులో ఆర్టీసీ సమ్మె దగ్గర నుండి లోకల్ బాడీ ఎన్నికలు.. ఇంటర్ బోర్డు పరీక్షలు ఇలా ఎన్నో ఉండగా తాజాగా మున్సిపల్ అధికారులకు ఇచ్చిన ఓ అధికారాల వలన మరోసారి హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ప్లాన్ డీవియేట్ అయిన ఇండ్లను నోటీసు ఇవ్వకుండానే కూల్చివేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కమిషనర్లకు కట్టబెట్టింది.

అయితే, సెక్షన్ 178 (2) ప్రకారం ప్లాన్ డీవియేట్ అయి కట్టిన ఇండ్లను కూల్చివేసే అధికారాన్ని మున్సిపల్ కమిషనర్లకు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ కొందరు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్స్ పై చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అభిషేక్ రెడ్డిలతో కూడిన బెంచ్ విచారణ చేపట్టి ప్రభుత్వాన్ని తప్పుబట్టింది.

అధికారంలో ఉన్నామని మీ ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకోవడం మంచి పద్ధతి కాదని ధర్మాసనం పేర్కొంది. ఏ చట్టమైనా సరే రాజ్యాంగానికి లోబడే ఉండాలని ప్రభుత్వానికి తెలియదా? అని ప్రశ్నించింది. ప్లాన్ కొద్దిగా అటూ ఇటూ అయినంత మాత్రాన కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఇండ్లను కూల్చేస్తారా? అని ప్రశ్నించింది.

ఉరిశిక్ష, యావజ్జీవ శిక్షలు విధించిన కేసులలో కూడా నిందితుల వాదనలు వినే చట్టాలు మనవని ఈ అధికారులకు తెలియదా? ఎలాంటి సమాచారం లేకుండా జేసీబీలు, ప్రొక్లైనర్లతో ఇంటి ముందుకు వెళ్లి మీ ఇల్లు కూల్చేస్తున్నాం అంటే ఆ వ్యక్తుల మానసిక పరిస్థితి ఏంటి? ఆర్ధిక పరిస్థితిని మీరు గమినించారా? అంటూ కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

డీవియేట్ అయినా ఇండ్లను కూల్చితే తప్పులేదంటూ ప్రభుత్వ తరపు లాయర్ సమర్ధించుకొనేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కమిషనరుకు తెలియకుండా టౌన్‌‌ప్లానింగ్‌‌ ఆఫీసర్‌‌ మార్పులతో నిర్మాణానికి పర్మిషన్‌‌ ఇచ్చి ఇల్లు కట్టుకుంటే కమిషనర్ వెళ్లి సమాచారం లేకుండా కూల్చేస్తారా? ఇదెక్కడి చట్టం అని ప్రశ్నించింది. తదుపరి విచారణ ఈ నెల 11కు వాయిదా వేసింది.

 

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

   3 hours ago


చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!

చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!

   4 hours ago


షర్మిల ఆరోగ్య పరిస్థితి ఇది..!

షర్మిల ఆరోగ్య పరిస్థితి ఇది..!

   2 hours ago


తిరుపతి పార్లమెంట్ ఎన్నికను రద్దు చేయాలి.. పెద్దిరెడ్డిపై విరుచుకుపడ్డ చంద్రబాబు

తిరుపతి పార్లమెంట్ ఎన్నికను రద్దు చేయాలి.. పెద్దిరెడ్డిపై విరుచుకుపడ్డ చంద్రబాబు

   5 hours ago


జానారెడ్డి చేతిలో.. రేవంత్ రెడ్డి భ‌విష్య‌త్

జానారెడ్డి చేతిలో.. రేవంత్ రెడ్డి భ‌విష్య‌త్

   6 hours ago


అబ్బో స‌మ‌స్య‌ల‌పై కూడా జ‌గ‌న్ ఫోక‌స్ చేస్తున్నారా

అబ్బో స‌మ‌స్య‌ల‌పై కూడా జ‌గ‌న్ ఫోక‌స్ చేస్తున్నారా

   7 hours ago


కోవిడ్ ను ఎదుర్కోవడంలో మోడీ సర్కారు విఫలం.. సోనియా గాంధీ

కోవిడ్ ను ఎదుర్కోవడంలో మోడీ సర్కారు విఫలం.. సోనియా గాంధీ

   20 hours ago


కోరలుచాస్తున్న కరోనా.. బెంగాల్ లో ఐదో దశ పోలింగ్ .. నిబంధనలు పట్టని పార్టీలు

కోరలుచాస్తున్న కరోనా.. బెంగాల్ లో ఐదో దశ పోలింగ్ .. నిబంధనలు పట్టని పార్టీలు

   a day ago


దొంగ ఓట్ల రచ్చ.. స్పందించిన పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి

దొంగ ఓట్ల రచ్చ.. స్పందించిన పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి

   a day ago


Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   17-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle