newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు బ్రేక్

10-07-202010-07-2020 19:18:51 IST
2020-07-10T13:48:51.515Z10-07-2020 2020-07-10T13:48:06.618Z - - 12-04-2021

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు బ్రేక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులకు బ్రేక్ పడింది. సచివాలయంలో చేప‌ట్టిన‌ భవనాల కూల్చివేత పనులు నిలిపి వేయాలని దాఖలైన ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యంపై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది.  భవనాల కూల్చివేతకు ఎలాంటి అనుమతులు తీసుకున్నారో పూర్తి వివరాలు తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ క్రమంలో ఇప్పటికే సచివాలయంలోని సగానికి పైగా భవనాలను కూల్చివేశామని అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసిన న్యాయస్థానం.. అప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టకూడదని స్టే విధించింది. 

కోవిడ్‌-19 నిబంధనలు ఉల్లంఘిస్తూ భవనాలను కూల్చివేస్తున్నారని ప్రొఫెసర్ పీఎల్‌ విశ్వేశ్వరరావు, న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ బుధవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిల్ ధాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ చర్యల వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని, 5 ల‌క్ష‌ల మంది పీల్చే స్వ‌చ్ఛ‌మైన గాలి కలుషితం అవుతుందని కోర్టుకు విన్నవించారు. మున్సిపాలిటీ సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ నిబంధ‌న‌ల‌ను పట్టించుకోకుండా కూల్చివేస్తున్నార‌ని పేర్కొన్నారు. తెలంగాణ స‌చివాల‌యం కూల్చివేత ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.  ఇప్పటికే ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని ప్ర‌తిప‌క్షాలు తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నాయి.  

ప్రపంచమంతా కరోనా బారినపడి ఇబ్బందికర పరిస్థితులలో ఉంటే, రోజు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో ఉపాధి అవకాశాలు లేక ఆర్థికంగా ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉంటే, స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే ఉద్యోగస్తులకు సగం జీతా లు చెల్లిస్తుంటే ఈ సమయంలో నూతన సెక్రటేరియట్ నిర్మాణం అవసరమా అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు కాంగ్రెస్ నేత‌ పొన్నం ప్రభాకర్.

రెండు లక్షల 90 వేల కోట్ల అప్పు అయింది, మళ్లీ కొత్తగా లక్షా యాభై వేల కోట్ల అప్పు తీసుకొని ఈ తెలంగాణ ప్రజలను అప్పుల ఊబిలో దించి మొత్తం వ్యవస్థనే నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నార‌.. దయచేసి ప్రజలారా గమనించాలన్నారు పొన్నం.  ఇదిలా ఉంటే సచివాలయం కూల్చివేత గురించి రాద్దాంతం చేస్తున్న కాంగ్రెస్ నేత‌ల‌కు వార్నింగ్ ఇచ్చారు మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్.. కాంగ్రెస్ పార్టీ నేతలవి  దిక్కుమాలిన ఆలోచ‌న‌లు అంటూ మండిప‌డిన ఆయ‌న‌.. ప్రభుత్వాన్ని బెదిరించాలి, భయపెట్టాలి అని చూస్తే.. తీసుకెళ్లి లోప‌ల‌వేస్తాం అంటూ హెచ్చ‌రించారు.

రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టి.. ఏవీ ఆప‌కుండా అమ‌లు చేస్తోంద‌న్న త‌ల‌సాని.. కొత్త స‌చివాల‌యం క‌డితే కాంగ్రెస్ నేత‌ల‌కు బాధ ఎందుకు? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నూతన సచివాలయంలో నిర్మాణం ఇప్పటి ఆలోచన కాద‌ని గుర్తుచేసిన త‌ల‌సాని.. సెక్షన్ 8 గురించి కాంగ్రెస్ నేత‌లు మాట్లాడుతున్నారంటే.. విధ్వంస‌క‌ర ప‌రిస్థితులు తెచ్చే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టుగా తెలుస్తోంద‌ని ఆరోపించారు. 

తెలంగాణ సచివాయం కూల్చివేత సందర్భంగా ఆ ప్రాంతంలో వున్న దేవాలయం, మసీదు కొంత దెబ్బతిన్నాయి. ఈ ఉదంతంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సెక్రటేరియట్ స్థలంలోనే ఇప్పుడున్న దాని కన్నా పెద్దగా, విశాలంగా ఆలయంతో పాటు మసీదును నిర్మించి ఇస్తామన్నారు. ఎత్తైన భవనాలు కూల్చే సందర్భంలో అక్కడే ఉన్న ప్రార్థనా మందిరాలపై శిథిలాలు పడి అవి దెబ్బతినడంపై ఆవేదన వ్యక్తం చేశారు సీఎం. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle