newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణ విమోచన దినోత్సవంపై బీజేపీ ఆరోపణలు వాస్తవమేనా?

17-09-202017-09-2020 16:40:24 IST
Updated On 17-09-2020 16:43:38 ISTUpdated On 17-09-20202020-09-17T11:10:24.660Z17-09-2020 2020-09-17T11:10:15.998Z - 2020-09-17T11:13:38.970Z - 17-09-2020

తెలంగాణ విమోచన దినోత్సవంపై బీజేపీ  ఆరోపణలు వాస్తవమేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలన్న డిమాండ్ నేటిది కాదు...అయినా తెలంగాణ ఆవిర్భావం తరువాత నుంచీ ఈ డిమాండ్ చాలా చాలా గట్టిగా వినిపిస్తున్నది. అసలు ఇంతకీ తెలంగాణ విమోచన దినోత్సవం ఏమిటి? అంటే..భారత దేశం అంతా 1947 ఆగస్టు 15న స్వేచ్ఛా వాయువులు పీలిస్తే...తెలంగాణ తరతరాల బానిస సంకెళ్లను తెరచుకుని తెలెత్తుకున్న రోజు మాత్రం సెప్టెంబర్ 17. స్వదేశీ సంస్థానాలను భారత్ లో విలీనం చేయడంలో భాగంగా నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించింది. 

అప్పటి నుంచీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ ప్రజ ఘనంగా జరుపుకుంటూ వస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించుకుంటామని పేర్కొన్న కేసీఆర్...ఆవిర్భావం తరువాత పట్టించుకోవడం లేదు. అయితే బీజేపీ మాత్రం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్ తో  రోజు రోజుకూ స్వరాన్ని పెంచుతోంది. నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తి అయిన రోజును తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించడానికి కేసీఆర్ వెనుకాడటానికి మజ్లిస్ భయమే కారణమని బీజేపీ విమర్శలు గుప్పిస్తున్నది. మజ్లిస్ ను మెప్పించడానికే కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని విస్మరిస్తున్నారని బీజేపీ విమర్శలు చేస్తున్నది.  నిజానికి  తెలంగాణ  విమోచన దినోత్సవాన్ని  అధికారికంగా  నిర్వహించడం లేదన్న   మాటే కానీ...అన్ని  పార్టీలూ  (మజ్లిస్  మినహా) సెప్టెంబర్  17న విమోచన దినాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాయి. 

వాస్తవానికి హిందుత్వ  పరిరక్షణకు తనను  తాను  చాంపియన్ గా, బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించుకునే  బీజేపీ...తెలంగాణ విమోచన దినోత్సవం అంశాన్ని  కూడా హిందూ కార్డ్  ఉపయోగించడానికే వాడుకుంటోంది. అందుకే తెలంగాణ  సర్కార్ విమోచన దినోత్సవాన్ని  అధికారికంగా నిర్వహించకపోవడానికి  ముస్లిం  అనుకూల వైఖరిగా చిత్రీకరించి హిందూ సెంటిమెంట్ ను రగల్చాలని  కమలం  పార్టీ  ప్రయత్నిస్తున్నది.  యాధృచ్ఛికంగానే  అయినా  ప్రధాని  మోడీ  జన్మదినం  కూడా సెప్టెంబర్  17 కావడంతో...బీజేపీ కొత్త  ఉత్సాహంతో  రాష్ట్ర  వ్యాప్తంగా తెలంగాణ  విమోచన  దినోత్సవాన్ని  నిర్వహిస్తూ...దేశ  భక్తి  నినాదాలతో పాటు నిజాం  వ్యతిరేక నినాదాలతో హోరెత్తిస్తున్నది. తరతరాల బానిస సంకెళ్ల  నుంచి విముక్తి  పొందిన  రోజు సెప్టెంబర్  17ను  ఘనంగా  నిర్వహించడంలో  కానీ, అధికారికంగా విమోచన దినోత్సవాన్ని   జరపాలని  డిమాండ్ చేయడంలో కానీ  ఎటువంటి  అభ్యంతరం ఉండదు...కానీ  తెలంగాణ  విముక్తికి, మతానికి   ముడిపెట్టడాన్ని మాత్రం సమంజసం  కాదు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   14 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   10 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   12 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   17 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   19 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   20 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle