newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణ విమోచనపై కేసీఆర్ రాజకీయం!

04-09-202004-09-2020 18:02:38 IST
2020-09-04T12:32:38.278Z04-09-2020 2020-09-04T12:31:52.125Z - - 15-04-2021

తెలంగాణ విమోచనపై కేసీఆర్ రాజకీయం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ వివెూచన దినోత్సవంపై ఏటా ఆందోళనలు జరుగుతన్నా సిఎం కెసిఆర్‌ దీనిపై స్పందించక పోవడం రాజకీయం తప్ప మరోటి కాదని బీజేపీ విమర్శలు గుప్పిస్తున్నది. ఎంఐఎంను సంతృప్తి పరిచేందుకే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి వెనుకాడుతున్నదన్నది బీజేపీ విమర్శల సారాంశం. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఈ  ఆరేళ్లుగా మౌనం వహించిన ప్రజలు ఇప్పుడు కేసీఆర్ ను, ఆయన సర్కార్ ను నిలదీయడానికి వెనుకాడటం  లేదని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు.   నిజాం పాలనలో ఎన్నో కష్టాలు పడిన తెలంగాణ జనం ప్రాణాలకు తెగించి నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడారనీ, వారి త్యాగాలను స్మరించుకునేందుకు కూడా కేసీఆర్ సర్కార్ వెనుకాడుతోంద, దీనిని బీజేపీ ఎంత మాత్రం సహించబోదని హెచ్చరించారు.

భారత దేశంలో విలీనానికి ముందు ప్రజలు పడ్డ బాధలు, మహిళలు ఎదుర్కొన్న అవమానాలు, అమరుల త్యాగాలు ఎన్నో ఉన్నాయని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు.  

సెప్టెంబరు 17న తెలంగాణ విలీన ఉత్సవాలను తెరాస ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన రోజు సెప్టెంబరు 17ను తెలంగాణ ప్రజ విజయోత్సవంగా జరుపుకోవాలని తహతహలాడుతుంటూ సీఎం అందుకు భిన్నంగా వ్యవహరించడం ప్రజలను వంచించడమే అవుతుందన్నారు.  పూటకో మాటగా కేసీఆర్ తీరు ఉన్నదని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా పాలన సాగుతున్నదని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజల అభీష్టం మేరకు ఈ ఏడాది సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటించాలని, లేకుంటే బీజేపీ ఉద్యమ బాట పడుతుందని హెచ్చరించారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి తెలంగాణ ప్రజల అభీష్టానికి భిన్నంగా పాలన సాగుతోందని రామచంద్రరావు పేర్కొన్నారు.

దేశ స్వాంత్ర్యా పోరాటంతో సమానమైన గౌరవం తెలంగాణ సాయుధపోరాటం సొంతమన్న బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు...ఆ పోరాటాన్ని గౌరవించకపోవడం, అమరులకు సముచిత గౌరవం ఇవ్వకపోవడం తెలంగాణ ద్రోహం కిందకే వస్తుందన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ సెప్టెంబర్ 17ను   తెలంగాణ విమోచన దినోత్సవంగా  ప్రకటించి...అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

 

 

నా రూటే సెప‌రేటు

నా రూటే సెప‌రేటు

   42 minutes ago


బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   14 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   15 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   15 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   19 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   20 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   18 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   20 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   21 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   16 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle