తెలంగాణ లాక్ డౌన్ 4 సడలింపులు...బస్సులకు రైట్ రైట్
18-05-202018-05-2020 21:23:00 IST
Updated On 19-05-2020 08:03:09 ISTUpdated On 19-05-20202020-05-18T15:53:00.853Z18-05-2020 2020-05-18T15:52:53.520Z - 2020-05-19T02:33:09.684Z - 19-05-2020

కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ సీఎం కేసీయార్ వాటిని మీడియాకు వివరించారు. లాక్ డౌన్ సడలింపులపై ముఖ్యమంత్రి మాట్లాడారు . లాక్డౌన్ మినహాయింపులతో పాటు అనేక అంశాలపైనా కేబినెట్ చర్చించింది. ఆర్టీసీపై మంత్రి పువ్వాడ అజేయ్ కేబినెట్ సమావేశంలో నివేదిక ఇచ్చారు. ప్రజా రవాణా విషయంలో రాష్ట్రాలదే నిర్ణయం అని చెప్పడంతో... కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న జీ హెచ్ ఎంసీ పరిధి మినహాయించి...మిగతా ప్రాంతాల్లో బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దీనిని కీలకంగా భావించవచ్చు. మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నడుస్తాయని కేసీయార్ వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లో సిటీ బస్సులను మాత్రం అనుమతించబోమని తేల్చిచెప్పారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆర్టీసీ బస్సులు నడుస్తాయన్నారు. బస్సుల్లో నిబంధనలు పాటించాలని, మాస్క్ లేకుంటే బస్సులు ఎక్కనివ్వమన్నారు.
సిటీ శివార్ల నుంచే తెలంగాణ జిల్లాలకు బస్సు సర్వీసులను నడుపుతామన్నారు. హైదరాబాద్లో ఆటోలు, ట్యాక్సీలకు అనుమతి ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ట్యాక్సీ, ఆటోల్లో ముగ్గురు ప్రయాణికులకు అనుమతిచ్చారు. ఇక ఈనెల 31 వరకూ మెట్రో రైలు సర్వీసులు నడపబోమన్నారు. స్టేడియంలు, స్పాలు, సెలూన్లు తెరవవచ్చన్నారు. పదవతరగతి పరీక్షలపై త్వరలో నిర్ణయం వెలువడుతుందన్నారు. 57 రోజుల అనంతరం ఆటోమొబైల్, సలోన్, బేకరీ, టెక్స్ టైల్స్ తెరుచుకుంటాయి.
రాష్ట్రంలో అన్ని చోట్లా అన్ని షాపులూ తెరుచుకోవచ్చు. హైదరాబాద్లో మాత్రం సరి-భేసి విధానం అమలు చేస్తారు. కంటైన్మెంట్ మినహా అన్ని చోట్లా సెలూన్లు తెరుచుకోవచ్చు. ఈ-కామర్స్కు నూరు శాతం అనుమతి.ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ పనిచేసుకోవచ్చు. పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, మానుఫాక్చరింగ్ యూనిట్లు పనిచేసుకోవచ్చు. కానీ మే 31 వరకు మాత్రం రాష్ట్రంలో కర్ఫ్యూ యథాతథంగా ఉంటుంది.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
12 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
8 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
10 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
13 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
15 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
17 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
18 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
19 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
20 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
21 hours ago
ఇంకా