newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణ రెవెన్యూలో క్యాబినెట్ దడ!

16-02-202016-02-2020 12:26:19 IST
2020-02-16T06:56:19.092Z16-02-2020 2020-02-16T06:56:16.718Z - - 15-04-2021

తెలంగాణ రెవెన్యూలో క్యాబినెట్ దడ!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్ సమావేశానికి ముహూర్తం పెట్టింది. సిఎస్ సోమేశ్ కుమార్ ఈ మేరకు మంత్రులకు సమాచారం ఇవ్వగానే అందరిలోనూ ఆసక్తి మొదలైంది. ఈరోజు జరగబోయే క్యాబినెట్ భేటీ ఎప్పటిలాగా కాకుండా మరేదో ఆసక్తికరమైన అంశం తెరమీదకి రాబోతుందని అందరిలో ఉత్కంఠ మొదలైంది. అటు ప్రభుత్వం నుండి పార్టీ వరకు అదే చర్చగా మారింది.

నిజానికి ఈరోజు క్యాబినెట్ లో రెండు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది.  త్వరలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్‌పై ఇవాళ్టి మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుండగా.. బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టాలో కూడా ఈ సమావేశంలోనే డేట్ ఫిక్స్ చేసే ఉందని తెలుస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మార్చి మొదటి వారంలో ఇది జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు.

ఇక, మరో అంశం రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో ప్రక్షాళన. చాలా కాలంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థ.. అందులో పేరుకుపోయిన అవినీతిపై గుర్రుగా ఉన్నారని అందరికీ తెలిసిందే. కడుపు మండిన రైతు తహసీల్దార్ ను పట్టపగలే కార్యాలయంలోనే హత్య చేసిన ఉదంతం.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో రైతులు రెవెన్యూ అధికారులపై చేస్తున్న ఆరోపణలన్నీ సీఎం దృష్టిలో ఉన్నటుగా తెలుస్తుంది.

దీంతో రాష్ట్ర రెవెన్యూ శాఖలో పలు మార్పులకు శ్రీకారం చుట్టాలని సీఎం బలంగా భావిస్తున్నారని వినిపిస్తూనే ఉంది. ఇప్పటికే దీనిపై కసరత్తుకు అప్పుడే అధికారులను ఆదేశించారు. సరికొత్తగా రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చేందుకు కూడా కొందరు న్యాయ నిపుణులు సలహాలు కూడా తీసుకున్నారు. టైటిల్ గ్యారంటీ చట్టం తీసుకురావాలని కూడా కొందరు నిపుణులు ముఖ్యమంత్రికి సూచించారు.

అప్పుడే రెవెన్యూ శాఖ పని పట్టాలని అనుకున్నా రాజకీయ కారణాల వలన అప్పటికి వాయిదా పడిన ప్రక్షాళన ఇప్పుడు అన్ని స్థానిక ఎన్నికలు కూడా ముగియడంతో ఇక ప్రక్షాళనే తరువాయిగా ఉన్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈరోజు జరిగే క్యాబినెట్ సమావేశంలో దీనిపై మంత్రి వర్గ అభిప్రాయాలను తీసుకొని.. ప్రక్షాలను పలు ఆదేశాలిచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.

ముఖ్యంగా రెవెన్యూ శాఖలో ఎక్కువగా అవినీతికి నిలయమైన వీఆర్ఓ వ్యవస్థపై తొలి కొరడా ఝళిపించే అవకాశం ఉందని వినిపిస్తుంది. వీలైతే పూర్తిగా వీఆర్ఓ వ్యవస్థనే రద్దు చేసేందుకు కూడా సీఎం సిద్దమైనట్లుగా చెప్తున్నారు. గ్రామస్థాయిలో రెవెన్యూకి బాస్ గా ఉండే వీఆర్ఓలే ఎక్కువగా అవినీతికి పాల్పడంతో పాటు పై ఉద్యోగులను కూడా అందులో దించుతున్నారని సీఎం దృష్టిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంతో ఈరోజు సమావేశంలో ఏ జరగబోతుందోనని రాష్ట్ర రెవెన్యూశాఖలో ఓ విధమైన భయాందోళనను వ్యక్తమవుతున్నాయట!

 

నా రూటే సెప‌రేటు

నా రూటే సెప‌రేటు

   25 minutes ago


బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   14 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   15 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   14 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   18 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   19 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   18 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   20 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   21 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   16 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle