newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం

29-05-202029-05-2020 17:09:48 IST
Updated On 29-05-2020 18:57:56 ISTUpdated On 29-05-20202020-05-29T11:39:48.734Z29-05-2020 2020-05-29T11:39:35.259Z - 2020-05-29T13:27:56.408Z - 29-05-2020

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ఏర్పాటయ్యాక ప్రజల ఆకాంక్షలే ఊపిరిగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కొత్త రాష్ట్రం అయినా అనేక సవాళ్ళను అధిగమించి ఆదర్శంగా ముందుకు సాగుతోందన్నారు కేసీయార్.తెలంగాణ చరిత్రలో కొండపోచమ్మ సాగర్ ఓ ఉజ్వల ఘట్టం. తెలంగాణ రైతులకు త్వరలోనే తీపి కబురు అందిస్తామన్నారు. దేశం ఆశ్చర్యపడే విషయం చెప్తామని, మహారాష్ట్రతో ఒప్పందం సక్సెస్ అయ్యింది.  గౌరవల్లి, గండిపల్లి ప్రాజెక్టులు త్వరలోనే పూర్తవుతాయన్నారు కేసీయార్. భూములు ఇచ్చిన వారి త్యాగం వెల కట్టలేనిది.. శిరస్సు  వంచి నమస్కరిస్తున్నాను.

భూ నిర్వాసితులు  పిల్లలు కు ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లలో ఉద్యోగాలు ఇస్తాము, వారి పట్ల సానుభూతి ఉందని అన్నారు. మల్టీ స్టేజి లిఫ్టింగ్ చాలా కష్టం. ఏ ప్రభుత్వం ఇంతా త్వరగా పూర్తి చేయలేదు. లక్ష కోట్ల పంటను తెలంగాణ రైతులు ఒక ఏడాది లో పండించనున్నారని కేసీఆర్ తెలిపారు. దేశం లో 63 శాతం పంటను తెలంగాణ సప్లై చేస్తుందన్నారు. కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవం అనంతరం  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అంశాలు ప్రస్తావించారు.

• తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం

• ఏ డిమాండ్ తో తెలంగాణ సాధించామో, ఇప్పుడు ఇప్పుడే నెరవేరుతున్నాయి

• అపురూపమైన ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్

• 10 లిఫ్ట్ లతో నిర్మితమైన ఇంజనీరింగ్ అద్భుతం

• భూములు కోల్పోయిన వారికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను

• మమిడియాల, బైలంపూర్‌, తానేదార్‌ప‌ల్లి గ్రామాలు రిజర్వాయర్లో ముంపుకు గురయ్యాయి

• జిల్లా కలెక్టర్, మంత్రి హరీష్ రావు చొరవతో నే పనులు త్వరగా పూర్తి అయ్యాయి

• భూములు కోల్పోయిన వారికి మంచి ఇండ్లను కట్టించి ఇచ్చాం

• వారి పిల్లలకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే

• గజ్వేల్ లో 6000 డబుల్ బెడ్ రూం  నిర్మించాం

• సిద్దిపేట జిల్లా ఫుడ్ ప్రాసెసింగ్ ఎస్ ఈ జడత లో నిర్వాసితుల కు ప్రాధాన్యత

• ప్రభుత్వం ఎప్పుడూ వారికి రుణపడి ఉంటుంది

• అత్యంత వేగంగా నిర్మించిన ప్రాజెక్ట్ కాలేశ్వరం ప్రాజెక్ట్

• మల్లన్న సాగర్ రిజర్వాయర్ తెలంగాణ రెండవ అతి పెద్ద రిజర్వాయర్

• 125 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ ల నిర్మాణం

• బ్యారేజిలు 40 టీఎంసీల  సామర్థ్యం తో నిర్మాణం

• 125 టీఎంసీల సామర్థ్యాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించింది

• కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం చాలా గర్వంగా ఉంది

• లక్ష్య కోట్ల పంట తెలంగాణ రైతాంగం పండించే పోతుంది

• 63% ఇండియన్ ప్రొక్యూర్ మెంట్ తెలంగాణ నుంచే అవుతుంది

• నా జీవితంలో మరిచిపోలేని రోజు

• ప్రణబ్ ముఖర్జీ అన్నాడు ఉద్యమాలు ప్రారంభించిన వాళ్లు ఫలితాలు పొందిన సందర్భాలు చాలా తక్కువ

• కొందరు ఉద్యమాలు ప్రారంభించిన ఫలితాలు వచ్చేవరకు బ్రతుకు ఉండరు అని అన్నారు

• కానీ నేను రెండు విధాలా అదృష్టం ఉందని ఉద్యమాన్ని ప్రారంభించాను ఫలితం కూడా వచ్చే వరకు బ్రతికి ఉన్నాను

• ఎన్ని ఆటంకాలు ఎదురైనా కాలేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశాను

• 618 మీటర్ల ఎత్తులో కొండపోచమ్మ రిజర్వాయర్ కి నీళ్లు తీసుకొచ్చాం

• తెలంగాణ ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఇది నిలువుటద్దం

• 4800 మెగావాట్ల విద్యుత్ అవసర పడుతుంది

• 521 విద్యుత్ లైన్ లు నిర్మాణం

• విద్యుత్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు

• చాలా గొప్ప కంపెనీలు సేవలందించాయి

• వలస కార్మికులు, కూలీలు విశేషంగా శ్రమించారు

• చెమటచుక్కలు వదిలిన వారందరికీ

• దుమ్ముగూడెం దగ్గర 35 టీఎంసీల సీతమ్మ ప్రాజెక్ట్ ని త్వరలోనే పూర్తి చేస్తాం

• బంగారు తెలంగాణ, పసిడి పంటల తెలంగాణా

• త్వరలో తెలంగాణ రైతాంగానికి శుభవార్త

• తెలంగాణ కోసం చావునోటిలో తొలి పెట్టాను

• తెలంగాణ అమరవీరుల త్యాగాలు మరువం

• 530 టీఎంసీల నీటిని వాడుకునే సామర్థ్యం తెలంగాణ సంతరించుకుంది

• మహారాష్ట్ర తో నీటి తగాదాలు పరిష్కారంలో అద్భుత రాజనీతిని ప్రదర్శించాము

• నియంత్రిత సాగు విధానంలో తెలంగాణ రైతులు అద్భుతాలు సృష్టించనున్నారు

• మెదక్ జిల్లా లో 900 గ్రామాలు నియంత్రిత సాగు వ్యవసాయానికి తీర్మానం

• కరెంటు కొరత నుండ అధిగమించడం

• వికలాంగుల కు 3016 రూపాయలు ఇచ్చే ఏకైక రాష్ట్రం 

• రైతు బీమా లాంటి ప్రపంచంలో ఎక్కడా లేదు

• నీటి తీరువ

• కరిదైన కాళేశ్వరం నీటిని కూడా నీటి తీరువా లేకుండా సాగునీటిని అందిస్తాం

• ఈ ఫలితాన్ని అందుకోబోయే రైతులకు శుభాకాంక్షలు

• జహీరాబాద్ వరకూ కాళేశ్వరం జలాలను అందిస్తాం

• ఎండిపోని మంజీరా నది, హెల్దీ వాగు చూడబోతున్నాం

• హల్దీ వాగు పై 15 చెక్ డ్యాములు నిర్మించాలని ఉన్నాం

• 4000 వేల కోట్లతో 1500 చెక్ డ్యాం నిర్వహించనున్నాం

• ఇప్పటికే భూగర్భ జల మట్టం పెరిగింది

• కాలువ వెంబడి ఉండే ప్రతి గ్రామంలో స్నానం చేసేందుకు స్విమ్మింగ్ పూల్ లు నిర్మిస్తామన్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle