newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణ రాష్ట్రం మావోయిస్టు ఫ్రీ స్టేట్‌

17-07-202017-07-2020 08:41:22 IST
Updated On 17-07-2020 14:26:34 ISTUpdated On 17-07-20202020-07-17T03:11:22.544Z17-07-2020 2020-07-17T03:11:16.845Z - 2020-07-17T08:56:34.346Z - 17-07-2020

తెలంగాణ రాష్ట్రం మావోయిస్టు ఫ్రీ స్టేట్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్రం మావోయిస్టు ఫ్రీ స్టేట్‌.. ఇప్పటిదాకా ప్రభుత్వ, పోలీసు ఉన్నతాధికారుల్లో ఉన్న భావన ఇది. బుధవారం నాటి రెండు వేర్వేరు ఎదురుకాల్పుల ఘటనలతో పరిస్థితి మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సబ్‌డివిజన్‌ పరిధిలో బుధవారం ఉదయం.. ఇంకా కొమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని తిర్యాణి అటవీ ప్రాంతంలోనూ ఒకే రోజు దాదాపు ఒకే సమయానికి పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఏజెన్సీలో కలకలం రేగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇప్పటిదాకా రాష్ట్రంలో ఈ స్థాయిలో మావోయిస్టుల సంచారం, రిక్రూట్‌మెంట్‌, యాక్టివిటీస్‌ నమోదు కాలేదు.

ఎప్పటికప్పుడు ఎస్‌ఐబీ‌ ఇచ్చే సమాచారంతో చత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్రల సరిహద్దులలోనే వారి కార్యకలాపాలను నిరోధిస్తూ వస్తున్నారు. పైపెచ్చు మన రాష్ట్రానికి చెందిన గ్రేహౌండ్స్‌ దళాలు చత్తీస్‌ఘడ్‌, ఒడిషాల్లో ఆపరేషన్లలో చురుగ్గా పాల్గొంటోంది. అయితే మావోయిస్టు పార్టీలో టాప్‌ ర్యాంకుల్లో ఉన్న నాయకత్వమంతా ఉత్తరతెలంగాణకు చెందిన వారు కావడం.. ఎక్కడైతే గతంలో వారి ప్రభావంతో తీవ్రవాద కార్యకలాపాలు ముమ్మరంగా సాగించారో అక్కడే ప్రస్తుతం ఉద్యమం పూర్తి స్థాయిలో నీరుగారిపోవడం ఇబ్బందిగా మారింది.

దీంతో ఇక్కడ రిక్రూట్‌మెంట్లపై దృష్టి సారించారన్న వాదన ఉంది. దీంతో పాటుగా ఉద్యమంలోని టాప్‌ లెవల్‌ నాయకత్వంలో ఉన్న ఆధిపత్య పోరు కూడా సొంత ప్రాంతాల్లో విస్తరణకు కారణం కావచ్చని ఓ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో పాల్గొన్నది మావోయిస్టు పార్టీ సెంట్రల్‌ కమిటీ సభ్యుడు సుధీర్‌ దళంగా పేర్కొంటున్నారు. ఈ దళంలో దామోదర్‌, భద్రూ, శాంత, భాస్కర్‌లతో బాటు మరో ఏడుగురు సభ్యులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎదురు కాల్పుల అనంతరం వారి నుంచి లభ్యమైన కిట్‌ బ్యాగుల్లోని వస్తువుల ఆధారంగా పోలీసులు విశ్లేషణ సాగిస్తున్నారు.

తెలంగాణలో మరోసారి రిక్రూట్‌మెంట్లు మొదలు పెట్టి తొంబయ్యో దశకంలోలా మావోయిస్టు ప్రాబల్యాన్ని పెంచడం.. తద్వారా దేశవ్యాప్తంగా రెడ్‌ కారిడార్‌లో పాల్గొంటున్న ఉద్యమ కీలక నేతల పలుకుబడిని పెంచడం.. అనుకూల రాజకీయ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం లక్ష్యంగా సెంట్రల్‌ కమిటీ సభ్యుల నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాలు తెలంగాణలోకి చొరబడ్డట్టు సమాచారం. ఈ మూడు బృందాల్లో రెండింటికి సంబంధించిన సమాచారాన్ని మాత్రం పోలీసులు కాని పెట్టారు.

ఆ బృందాల కదలికలపై దృష్టి సారించి, ఆయా ప్రాంతాల్లో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. దాని ఫలితమే బుధవారం నాటి ఎదురుకాల్పులు. చత్తీస్‌ఘడ్‌ నుంచి గోదావరి నది దాటి వచ్చిన ఒక దళం కదలికలపై ఇంతదాకా సమాచారం దొరకలేదు. దానిపై నిఘా వర్గాలు పూర్తి దృష్టి సారించాయి. దీంతోపాటు ఎదురు కాల్పుల్లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూడా కూంబింగ్‌ ముమ్మరం చేశారు.

ఈ మధ్య కాలంలో రాజకీయ, సామాజిక అంశాలపై మావోయిస్టులు కరపత్రాల ద్వారా తమ వైఖరిని వెల్లడించడంపై పెద్ద ఎత్తున పోలీసులు దృష్టి సారించారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులపై అటవీ, పోలీసు శాఖల వైఖరిని వ్యతిరేకిస్తూ గిరిజనంలో పలుకుబడి కోసం ప్రయత్నించారు. 

దీనికి తోడు కోవిద్‌ 19 కరోనా లాక్‌డవున్‌ వల్ల పెద్దగా పనులు లేక యువత ఏజెన్సీ గిరిజన గూడేల్లో అందుబాటులో ఉండడంతో వారిని ఉద్యమం వైపు ఆకర్షించే పనిలో భాగంగానే దళాలు సైలెంట్‌గా రాష్ట్రంలోకి ప్రవేశించినట్టు భావిస్తున్నారు.

వాస్తవానికి గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన పాత ఆదిలాబాద్‌, కరీంనగర్, వరంగల్‌, ఖమ్మం జిల్లాలలో మళ్లీ జీవం పోయడానికి ఈ ఆర్థిక, రాజకీయ, సామాజిక మార్పులను వాడుకోవాలన్న వ్యూహంలో భాగంగానే తెలంగాణపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

చత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్రలతో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న భారీ సరిహద్దు వల్ల కూడా వారి కార్యకలాపాలకు కారణం అవుతోంది. చాలా కాలం తర్వాత పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఏజెన్సీ పల్లెల్లో భయం నెలకొంది. దీంతోపాటు సరిహద్దుల్లోని అన్ని రహదారుల్లోని తనిఖీలు ముమ్మరం చేశారు.

రాష్ట్రంలోకి వచ్చిన వారిని ఏరివేయడం, కొత్త రిక్రూట్‌మెంట్లను నిరోధించడం, పొరుగు రాష్ట్రాల నుంచి కొత్తగా మావోయిస్టులు అడుగుపెట్టకుండా చేయడం లక్ష్యంగా తాము ముందుకెళ్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. 

ఈ విషయమై భద్రాద్రి కొత్తగూడెం ఓఎస్డీ (ఆపరేషన్స్) రమణారెడ్డి వివరణ ఇచ్చారు. బుధవారం నాటి ఎదురుకాల్పుల అనంతరం పారిపోయిన వారి కోసం ముమ్మర గాలింపు (కూంబింగ్‌) జరుపుతున్నామన్నారు. తనిఖీలు, కూంబింగ్‌ను ధృవీకరించారు.

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   6 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   3 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   5 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   9 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   12 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   13 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle