newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణ మునిసిపోల్స్.. ఈసారి ఎన్నికల స్పెషలేంటంటే..?

22-01-202022-01-2020 08:18:15 IST
Updated On 22-01-2020 11:18:59 ISTUpdated On 22-01-20202020-01-22T02:48:15.008Z22-01-2020 2020-01-22T02:48:12.308Z - 2020-01-22T05:48:59.628Z - 22-01-2020

తెలంగాణ మునిసిపోల్స్.. ఈసారి ఎన్నికల స్పెషలేంటంటే..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో ఎన్నికల ప్రక్రియలో చివరి ఘట్టం నడుస్తోంది. 2018 ముందస్తు ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ వరుసగా ఎన్నికలను ఎదుర్కొంటోంది. అసెంబ్లీ, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో జయభేరి మోగించింది టీఆర్ఎస్. ఒక్క లోక్ సభ ఎన్నికల్లో మాత్రం షాకిచ్చారు ఓటర్లు. తాజాగా మునిసిపల్ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. దొంగఓట్లను నియంత్రించేందుకు నడుం బిగించింది.

భారత దేశంలోనే ఏ ఎన్నికలలోనూ ప్రయోగించని ఫేస్ రికగ్నిషన్ యాప్ ను మొట్టమొదటి సారిగా ప్రయోగిస్తున్నారు. ఈ యాప్ ను మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని కొంపల్లి మునిసిపాలిటీలోని పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా 10 పోలింగ్ స్టేషన్లలో అమలు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఓటరు సమర్పించే ధ్రువపత్రాలతో సంబంధం లేకుండా ఓటరును గుర్తించే అవకాశం కలుగుతుంది. 

ఈ యాప్ ద్వారా ఓటరుకి సంబంధించిన పూర్తి వివరాలను సునాయాసంగా తెలుసుకోవచ్చని, ఓటరు ముఖాన్ని చూసి అతడు ఓటరేనా? కాదా? అనేది 10 సెకన్లలో తేల్చేయగల సాంకేతికతను ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు. కృత్రిమ మేధ, బిగ్‌ డేటా, మెషీన్‌ లెర్నింగ్‌ల మేళవింపుగా ఈ సాంకేతికత పనిచేస్తుందని వెల్లడించింది. పోలింగ్‌ కేంద్రాల్లో ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసిన స్మార్ట్‌ఫోన్‌తో తీసే ఓటర్ల ఫొటోలను భద్రపర్చబోమని, ధ్రువీకరణ పూర్తవగానే తొలగిస్తామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జనవరి 25 న జరుగుతుండడంతో అక్కడి తుది ఫలితాలు జనవరి 27 న ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. మొత్తం మీద ఈసారి ఎన్నికలను చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నామని. అభ్యర్ధుల నేరచరిత్ర వారిచ్చిన అఫిడవిట్లలో తప్పులుంటే వారి ఎన్నికను నిలిపేసే అవకాశం కూడా ఉందని ఎస్ఈసీ నాగిరెడ్డి తెలిపారు. 

మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్చగా నిర్వహించేందుకు 50వేల మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.  తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలు, రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించిన వ్యూహాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ దళాలతో బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికల సందర్భంగా భారీగా మద్యం పట్టుబడింది. 

ఇప్పటి వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రూ.51,36,090 లక్షల రూపాయలను స్వాదీనం చేసుకోవడంతోపాటు రూ.21,22,933 విలువైన మద్యాన్నిస్వాధీన పరుచుకున్నారు. చట్టాన్ని అతిక్రమించిన 4,969 మందిపై 1122 కేసులను నమోదు చేశారు. 

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   30 minutes ago


వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   14 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   10 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   12 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   15 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   17 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   19 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   20 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   21 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle