newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

తెలంగాణ బీజేపీ చీఫ్‌కు పదవి గండం?

03-01-202003-01-2020 11:44:14 IST
Updated On 03-01-2020 13:43:10 ISTUpdated On 03-01-20202020-01-03T06:14:14.284Z03-01-2020 2020-01-03T06:14:12.309Z - 2020-01-03T08:13:10.261Z - 03-01-2020

తెలంగాణ బీజేపీ చీఫ్‌కు పదవి గండం?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ బీజేపీ చీప్ కు పదవి గండం ఉందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా కే.లక్ష్మణ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిజానికి గత ఏడాది డిసెంబర్ లోనే చీఫ్ మారే అవకాశం ఉందని ఊహాగానాలు వచ్చాయి. కానీ బీజేపీ అధిష్టానం మాత్రం తెలంగాణ రాష్ట్రం విషయంలో ఎలాంటి కొత్త నిర్ణయాలను తీసుకోలేదు. కానీ పార్టీ బలోపేతంపై జాతీయ నేతలు ఫోకస్ పెట్టారు.

అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా భారీగా చేరికలను ప్రోత్సహించారు. మాజీ మంత్రులు, సీనియర్ నేతలను చేర్చుకొని ప్రభుత్వం మీద దూకుడు పెంచారు. చీఫ్ స్థానంలో మరో ముఖ్య నేతను నియమించి గ్రాండ్ కలరింగ్ ఇవ్వనున్నారని ప్రచారం జరిగినా అప్పటికి వాయిదా పడింది. అయితే ఇప్పుడు లక్ష్మణ్ కు పదవి గండం ముంచుకొస్తున్నట్లుగా కనిపిస్తుందంటున్నారు.

త్వరలో రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలే పార్టీ రాష్ట్రాధ్యక్షుడికి పరీక్ష కాబోతుందని.. ఆ ఎన్నికలలో వచ్చిన ఫలితాలను బట్టే అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే లక్ష్మణ్ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని టికెట్ల ప్రాధాన్యత నుండి విజయ వ్యూహాలను సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే దిశానిర్ధేశాలు జరిగిపోయాయి.

లక్ష్మణ్ ఒకపక్క రాష్ట్రంలో ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేసుకుంటూనే మరోపక్క ఢిల్లీలో.. పార్టీ చీఫ్ పదవిలో తానే కొనసాగేలా ముమ్మర ప్రయత్నాలను చేస్తున్నట్లుగా చెప్తున్నారు. ఇందుకోసం అయన జాతీయస్థాయిలో తనకున్న పరిచయాలను వాడుకుంటున్నట్లుగా తెలుస్తుంది. కాగా, లక్ష్మణ్ స్థానంలో ఆ పదవి ఎవరిని వరించవచ్చనే చర్చలు పార్టీలో జరుగుతున్నాయి.

వచ్చే మున్సిపల్ ఎన్నికల ఫలితాలను బట్టి చీఫ్ ను మార్చే అవకాశం ఉందని తెలియడంతో మరికొందరు నేతలు కూడా జాతీయనేతలతో టచ్ లో ఉంటున్నారట. వీళ్ళలో మాజీ మంత్రి, మరో సీనియర్ నేత డీకే అరుణతో సహా మరికొందరు నేతలు పోటీపడుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఏదైనా మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాతనే ప్రక్షాళన ఉండనున్నడంతో ఎవరి ప్రయత్నాలలో వాళ్ళు ఉన్నారట.

చీఫ్ మార్పు ఖరారైతే కనుక డీకే అరుణకే ఎక్కువ అవకాశాలు ఉండనున్నట్లుగా రాష్ట్ర పార్టీలో గట్టి ప్రచారం జరుగుతుంది. మహిళా ప్రాధాన్యతకు పట్టం కట్టినట్లుగా కలిసి వచ్చే అవకాశం ఉండడంతో పాటు మాటలతోనే ప్రభుత్వాన్ని అటాక్ చేసే ఫైర్ బ్రాండ్ గా అరుణకు పేరుండడంతో ఆమెకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle