newssting
BITING NEWS :
ఎన్డీయేతో బంధం తెంచుకున్న అకాలీదళ్. కేంద్రం తీసుకొచ్చిన బిల్లులకు వ్యతిరేకంగా అకాలీదళ్ నిర్ణయం. ఈ బిల్లుల ప్రభావం రైతులు, దళితులు, రైతు కూలీల అందరిపై పడిందని తెలిపిన అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ప్రకటన. శనివారం పార్టీ నిర్వహించిన మూడు గంటల ఎమర్జెన్సీ కోర్ కమిటీ సమావేశం అనంతరం నిర్ణయం. 23 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ బంధాన్ని తెగతెంపులు చేసుకున్న అకాలీదళ్ * బాలీవుడ్‌ వివాదాస్పద నటి కంగనా రనౌత్‌పై కర్ణాటకలోని తుమకూరు కోర్టులో కేసు దాఖలు. కేంద్ర ప్రభుత్వ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను ఉగ్రవాదులతో పోల్చుతూ ట్వీట్‌ చేయడాన్ని తప్పుబడుతూ తుమకూరు జేఎంఎఫ్సీ కోర్టులో రమేశ్‌ నాయక్‌ అనే న్యాయవాది పిటిషన్‌ దాఖలు * అత్యంత ప్రతిష్టాత్మకమైన ఢిల్లీలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఎన్‌ఎల్‌యూ వైస్‌ చాన్సలర్‌గా వరంగల్‌ జిల్లాకు చెందిన ప్రొఫెసర్‌ పి.శ్రీకృష్ణదేవరావు నియామకం. ప్రస్తుత వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ రణబీర్‌ సింగ్‌ పదవీ విరమణ చేయడంతో శ్రీకృష్ణదేవరావు నియామకం. దేశంలోని పలు విశ్వవిద్యాలయాలలో కీలక బాధ్యతలు నిర్వహించిన శ్రీకృష్ణదేవరావు న్యాయ విద్యలో మార్పులు తీసుకువచ్చేందుకు యూజీసీ నియమించిన నిపుణుల కమిటీలో కూడా ఆయన సభ్యుడిగా కూడా పనిచేశారు * శివసేన నేత, లోక్ సభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఓ స్టార్ హోటల్ లో రహస్యంగా భేటీ అయినట్టు గుప్పుమన్న వార్తలు. ఓ లగ్జరీ హోటల్‌ లో సుమారు గంటన్నర పాటు వీరిమధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఈ సమావేశం వార్తలు. ఈ సమావేశం నిజమేనని, దీని వెనుక రాజకీయ కారణాలు లేవని స్పష్టం చేసిన బీజేపీ * అమెరికాలోని హిందూఆధ్యాత్మిక గురువు స్వామి ప్రత్యాగ్‌బోధానంద కన్నుమూత. పెన్సిల్వేనియాలో అర్ష విద్యా గురుకులానికి ఉపాధ్యక్షులుగా ఉన్న ప్రత్యాగ్‌బోధానంద వయసు 69 సంవత్సరాలు. గురుకులం 34వ వార్షిక ఉత్సవాల్లో పాల్గొన్న తర్వాత తీవ్రమైన గుండెపోటు రావడంతో ఈనెల 20తేదీన తుదిశ్వాస విడిచినట్టు తెలిపిన ఆయన శిష్యులు. ప్రత్యాగ్‌బోధానంద పార్థివదేహాన్ని భారత్‌కు తరలింపుకు ప్రయత్నాలు * పార్లమెంటు ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకి వ్యతిరేకంగా పంజాబ్‌లో కొనసాగుతున్న రైల్‌ రోకో ఆందోళన. గత మూడు రోజులుగా రైతులు రైలు పట్టాలపై కూర్చొని నిర్వహిస్తున్న రైల్‌ రోకో. తొలుత కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్ కమిటీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తే, ఆ తర్వాత మద్దతు ప్రకటించిన వివిధ సంఘాలు * బాలీవుడ్‌ పరిశ్రమలో కలకలం సృష్టిస్తున్న డ్రగ్స్‌ వ్యవహారం. దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో ఎదుట శనివారం హాజరు. వేర్వేరుగా ఐదు గంటలకు పైగా కొనసాగిన విచారణ. నటీమణుల వాగ్మూలాన్ని రికార్డు చేసిన ఎన్సీబీ * ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రలలో పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో అక్కడక్కడా నిలిచిన రాకపోకలు. పలుచోట్ల నీటమునిగిన పంట పొలాలు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నందిగామలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు * అక్టోబరు 1 నుంచి సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతినిచ్చిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలియజేసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. పరిస్థితులను గాడిలో పెట్టేందుకు అక్టోబరు 1 నుంచి సినిమా థియేటర్ల తెరిచేందుకు అనుమతినిస్తున్నామని, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యాజిక్ షోలు నిర్వహించేందుకు కూడా అనుమతినిస్తున్నామని ట్వీట్ * నెల్లూరు జిల్లాలో ఇటీవల జరిగిన రౌడీషీటర్ దారుణ హత్య మరువక ముందే చోటు చేసుకున్న మరో ఘటన. చిల్లకూరు మండలం కలవకకొండలో చేజర్ల సుబ్రహ్మణ్యం(38) అనే వ్యక్తి దారుణ హత్య. ఆదివారం ఉదయం అతి కిరాతకంగా చంపేసిన గుర్తు తెలియని వ్యక్తులు. సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు * సంగారెడ్డిలో వాగు దాటుతున్న వ్యక్తి వరద నీటిలో గల్లంతు. భారీ వర్షాలకు వాగు దాటుతున్న ముగ్గరు వ్యక్తులు గల్లంతవ్వగా ఇద్దరు వ్యక్తులను ఒడ్డుకు చేర్చిన స్థానికులు. కంగ్టి మండలం జంగి బికి చెందిన 55 ఏళ్ల మంగలి మారుతి కాకి వాగు వరద ఉధృతిలో గల్లంతు. మారుతి ఆచూకీ కోసం మండల రెవెన్యూ అధికారుల గాలింపు చర్యలు.

తెలంగాణ బడ్జెట్.. హరీష్ మార్క్ ఉంటుందా?

02-03-202002-03-2020 10:36:53 IST
Updated On 02-03-2020 13:17:23 ISTUpdated On 02-03-20202020-03-02T05:06:53.439Z02-03-2020 2020-03-02T05:06:51.286Z - 2020-03-02T07:47:23.088Z - 02-03-2020

తెలంగాణ బడ్జెట్.. హరీష్ మార్క్ ఉంటుందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ రెండోసారి ప్రభుత్వ ఏర్పాటులో తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టగా గత ఏడాది మిగతా ఆరునెలల కాలానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. గత ఏడాది బడ్జెట్ సమయం వరకు ఆర్థికశాఖ సీఎం కేసీఆర్ వద్దే ఉండగా బడ్జెట్ కు ఒక్కరోజు ముందుగా ఆ శాఖను హరీష్ రావుకు అప్పగించారు.

అయితే, అప్పుడు బడ్జెట్ ను మాత్రం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి శాసనసభలో ఆయనే ప్రసంగించారు. శాసన మండలిలో మాత్రం ఆర్ధిక మంత్రి హోదాలో హరీష్ రావు ప్రసంగించారు. ఇక ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుండగా తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న రెండో ఆర్థికమంత్రిగా హరీష్ రావు రికార్డ్‌ను సొంత చేసుకోనున్నారు. అంతకు ముందు 2014 నుండి 2018 వరకు ఈటల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.

కాగా, ఇప్పటికే బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల మార్చి 6వ తేదీ నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా ఉదయం 11 గంటలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం మొదలుపెట్టనున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తొలిసారిగా సభలను ఉద్ధేశించి ప్రసంగించనున్నారు. మార్చి 8న మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

కాగా, ఈ బడ్జెట్లో సీఎం కేసీఆర్ మార్క్ ఉండడం ఖాయంగా వినిపిస్తుంది. ఉన్న పథకాలకు నిధుల కేటాయింపుతో పాటు మరో ఒకట్రెండు కొత్త పథకాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇప్పటికే మంత్రి గంగుల కమలాకర్ ఇటీవల దీనికి సంబంధించి హింట్ ఇచ్చారు. ఆపద్బoధు కేసీఆర్ పేరుతో ఓ పథకం రూపకల్పన చేస్తున్నామని ఆయన చెప్పారు.

అయితే, వైఎస్ ప్రభుత్వంలో క్రీడలు, యువజన సర్వీసులు, కేసీఆర్ తొలి ప్రభుత్వంలో కీలకమైన సాగునీటి పారుదల శాఖలను నిర్వహించిన హరీష్ రావు తొలిసారి ఆర్ధిక మంత్రిగా బాధ్యతలను నిర్వర్తిస్తుండగా తొలిసారో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈక్రమంలో బడ్జెట్ లో హరీష్ మార్క్ ఏమైనా ఉంటుందా అనే చర్చ రాజకీయ వర్గాలలో నడుస్తుంది. ప్రభుత్వంలో.. పార్టీలో అధిష్టానం నేతలలో హరీష్ కూడా ఒకరు.

ఆ మాటకొస్తే ఉద్యమం సమయంలో కేసీఆర్ తర్వాత పార్టీలో రెండోస్థానం హరీష్ రావుదే. కేటీఆర్ వచ్చాక ఆ స్థానంలో మార్పులు వచ్చాయి. అయితే, పార్టీలో అయనకు తగిన గౌరవం మాత్రం ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. మరోవైపు ప్రజాక్షేత్రంలో కేసీఆర్ తర్వాత హరీష్ రావు ఆ స్థానం ఆక్రమించుకున్నారని ఎప్పుడో నిరూపించుకున్నారు. ఈక్రమంలో హరీష్ అయన మార్క్ ఉండేలా చూసుకున్నారా? అన్న చర్చలు సహజమే!

 

చేతులు మారుతున్న ఏపీలో పోర్టులు..  కాకినాడ పోర్టు అరబిందో కైవ‌సం?!

చేతులు మారుతున్న ఏపీలో పోర్టులు.. కాకినాడ పోర్టు అరబిందో కైవ‌సం?!

   11 hours ago


గ్రేటర్ వరద ప్రాంతాలలో రేవంత్ పర్యటన.. కారుని ఢీ కొడతారా?

గ్రేటర్ వరద ప్రాంతాలలో రేవంత్ పర్యటన.. కారుని ఢీ కొడతారా?

   12 hours ago


ఏపీకి మ‌ద్యం అక్ర‌మ ర‌వాణాలో కొత్త పుంత‌లు

ఏపీకి మ‌ద్యం అక్ర‌మ ర‌వాణాలో కొత్త పుంత‌లు

   12 hours ago


యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిసిన 'రవికిషన్'

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిసిన 'రవికిషన్'

   13 hours ago


బీజేపీలో పురందేశ్వ‌రికి కీల‌క ప‌ద‌వి... సామాజిక స‌మీక‌ర‌ణే ఎజెండా

బీజేపీలో పురందేశ్వ‌రికి కీల‌క ప‌ద‌వి... సామాజిక స‌మీక‌ర‌ణే ఎజెండా

   13 hours ago


అంబటి భూకబ్జా లీకులు.. సొంత పార్టీ నేతలే టార్గెట్ చేశారా?

అంబటి భూకబ్జా లీకులు.. సొంత పార్టీ నేతలే టార్గెట్ చేశారా?

   14 hours ago


ఎన్‌డీఏకు అకాలీదళ్‌ గుడ్‌బై.. రైతు వ్యతిరేక బిల్లులపై విభేదం

ఎన్‌డీఏకు అకాలీదళ్‌ గుడ్‌బై.. రైతు వ్యతిరేక బిల్లులపై విభేదం

   15 hours ago


డీకే అరుణకి జాతీయ పదవి.. రెడ్డి సామాజికవర్గంపై బీజేపీ టార్గెట్?

డీకే అరుణకి జాతీయ పదవి.. రెడ్డి సామాజికవర్గంపై బీజేపీ టార్గెట్?

   15 hours ago


ఏపీని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. పంటనష్టం

ఏపీని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. పంటనష్టం

   16 hours ago


తెలంగాణలో ఆడపిల్లను లక్ష్మిలా కొలుస్తున్నారు.. మంత్రి హరీష్ రావు

తెలంగాణలో ఆడపిల్లను లక్ష్మిలా కొలుస్తున్నారు.. మంత్రి హరీష్ రావు

   18 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle