newssting
BITING NEWS :
*హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో కారు బీభత్సం. అదుపుతప్పి హోటల్ లోకి దూసుకెళ్లిన కారు. తప్పిన ప్రమాదం, కారు వదలి పరారైన యువకులు. మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లుగా అనుమానం * అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న ట్రంప్. ఎయిర్ పోర్ట్ నుంచి ర్యాలీగా మొతేరా స్టేడియానికి ట్రంప్. మధ్యాహ్నం 12:30 గంటలకు నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగం*విశాఖ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్‌పై స్పందించిన నేవీ..మిలీనియం టవర్స్‌లో సచివాలయం పెట్టుకోవడానికి అనుమతి నిరాకరించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం*జనవరి 10న అమరావతి రైతుల మీద జరిగిన లాఠీఛార్జ్‌పై విచారణ ప్రారంభం..హైకోర్టు ఆదేశాల మేరకు తుళ్లూరులో విచారణ ప్రారంభించిన పోలీసులు..గుంటూరు అడిషనల్‌ ఎస్పీ స్వామిశేఖర్‌ నేతృత్వంలో కొనసాగుతున్న ఎంక్వైరీ *సికింద్రాబాద్ : బోయిన్ పల్లిలోనీ ఓ కెమికల్ గో డౌన్ లో భారీ అగ్నిప్రమాదం*చైనాలో 2400 పైగా చేరిన కోవిద్ 19 వైరస్ మృతులు. 78 వేలకు చేరిన వైరస్ బాధితుల సంఖ్య. ఇటలీలో కరోనా వైరస్ కారణంగా ఇద్దరు మృతి

తెలంగాణ బడుల్లో నైతిక విలువల పాఠాలు.!

04-01-202004-01-2020 10:30:24 IST
Updated On 04-01-2020 12:14:56 ISTUpdated On 04-01-20202020-01-04T05:00:24.481Z04-01-2020 2020-01-04T05:00:21.770Z - 2020-01-04T06:44:56.910Z - 04-01-2020

తెలంగాణ బడుల్లో నైతిక విలువల పాఠాలు.!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ముఖ్యమంత్రి కెసిఆర్ నూతన సంవత్సరంలో అడుగుపెడుతూనే వంద శాతం అక్షరాస్యత గల రాష్ట్రంగా తెలంగాణ అంటూ ఓ నినాదాన్ని అందుకున్న సంగతి తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే పల్లెప్రగతి కార్యక్రమంతో పాటు ప్రభుత్వ అధికారులు, పెద్దలు కూడా ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. నిన్నటికి నిన్న డీజీపీ కూడా ప్రతి పోలీస్ యూనిట్ కనీసం ఇరవై మంది నిరక్ష్యరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలని సంకల్పించుకోవాలని కోరారు.

కాగా, నిజానికి సీఎం అక్షరాస్యతతో పాటు మరో అంశాన్ని కూడా కొత్త ఏడాదిలో ప్రకటించారు. తెలంగాణ బడులలో నైతిక విలువల పాటలు చెప్పించాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. గురువారం (జనవరి 2) మాజీ డీజీపీ హెచ్.జె.దొర ఆటోబయోగ్రఫీ ‘జర్నీ థ్రూ టర్బులెంట్ టైమ్స్’ పుస్తకం ఆవిష్కరణ కార్యాక్రమంలో మాట్లాడుతూ కేసీఆర్ ఈ ప్రకటన చేశారు.

ప్రస్తుత సమాజంలో బాల్యం నుండే పిల్లలకు నేర ప్రవృత్తి.. దురలవాట్లు వచ్చేస్తున్నాయని.. దీని ప్రభావంతో సమాజంలో మనుషులు మృగాలుగా మారి అఘాయిత్యాలకు.. దారుణ అరాచకాలకు పాల్పడుతున్నారని సీఎం పేర్కొన్నారు. అందుకే బాల్యం నుండే పాఠశాల స్థాయి నుండే మార్పు తీసుకురావాలని నిర్ణయించుకున్నామని అందుకోసం పాఠాలను చెప్పించనున్నామని చెప్పారు.

సీఎం కెసిఆర్ నిర్ణయంపై మిషన్ ఎథిక్స్ ఇండియా ప్రతినిధులు అభినందించారు. ప్రస్తుత సమాజంలో విచక్షణ కోల్పోతున్న మృగాళ్లు చిన్న పిల్లలపై కూడా అఘాయిత్యాలకు తెగబడుతున్నారని.. ఈ పరిస్థితిలో మార్పు కోసం సీఎం కృషి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. మిషన్ ఎథిక్స్ ఇండియా సొసైటీ ప్రతినిధుల బృందం తాజాగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్‌ను కలిసింది.

ఈ సందర్భంగా నైతిక విలువల కోసం సీఎం కెసిఆర్ బాల్యం నుండే పాఠాలు బోధించాలని తీసుకున్న నిర్ణయం భవిష్యత్ లో గొప్ప వరం కానుందని పేర్కొన్నారు. ఆదర్శవంతమైన తెలంగాణగా తీర్చిదిద్దే క్రమంలో నైతిక విలువలపై పాఠాలు తొలి అడుగుమాత్రమేనని.. ఇందుకోసం సమూల మార్పులు రావాల్సి ఉందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

తల్లిదండ్రులు ధనార్జనలో పడి పిల్లల చదువులు, మార్కులను మాత్రమే చూస్తున్న ఈ సమాజంలో బాల్యమే పెడదోవకి వెళ్లకుండా కొంతలో కొంతైనా ఈ పాఠాలు దోహదం చేస్తాయని.. ఆ దిశగా సీఎం కెసిఆర్ మొదలుపెట్టనున్న ప్రయత్నంతోనైనా మార్పులు రావాలని మేధావులు కోరుతున్నారు. నేరాలను అణచివేయడం కన్నా.. నేర ప్రవృత్తి వైపు వెళ్లకుండా చూడడమే ఆరోగ్య సమాజం. ఇందుకోసం సీఎం ఆలోచన సమంజసమే.. మరి ఆచరణ ఎంతవరకో చూడాల్సిఉంది.

 

రుణమాఫీలు శాశ్వత పరిష్కారం కాదు. గిట్టుబాటు ధరలే సమస్య: ఉపరాష్ట్రపతి

రుణమాఫీలు శాశ్వత పరిష్కారం కాదు. గిట్టుబాటు ధరలే సమస్య: ఉపరాష్ట్రపతి

   11 hours ago


తెలంగాణలో కలకలం రేపిన 'దొంగలతో దోస్తీ' కథనం!

తెలంగాణలో కలకలం రేపిన 'దొంగలతో దోస్తీ' కథనం!

   15 hours ago


‘‘ఈజీవో నాపై వేధింపులకు పరాకాష్ట’’బాబు ట్వీట్

‘‘ఈజీవో నాపై వేధింపులకు పరాకాష్ట’’బాబు ట్వీట్

   15 hours ago


నూజివీడు ఘటనపై మంత్రి సురేష్ సీరియస్

నూజివీడు ఘటనపై మంత్రి సురేష్ సీరియస్

   15 hours ago


మిలీనియం టవర్స్ చుట్టూ అల్లుకున్న రాజకీయం!

మిలీనియం టవర్స్ చుట్టూ అల్లుకున్న రాజకీయం!

   16 hours ago


భూములు లాక్కోవడంలేదు.. తప్పుచేయకుంటే ఎందుకంత భయం?

భూములు లాక్కోవడంలేదు.. తప్పుచేయకుంటే ఎందుకంత భయం?

   17 hours ago


విద్యార్ధుల భవిష్యత్తే మాకు ముఖ్యం... నూజివీడు ట్రిపుల్ ఐటీ వీసీ హేమచంద్రారెడ్డి

విద్యార్ధుల భవిష్యత్తే మాకు ముఖ్యం... నూజివీడు ట్రిపుల్ ఐటీ వీసీ హేమచంద్రారెడ్డి

   17 hours ago


సిట్‌కు స‌హ‌క‌రించే సీన్ ఉందా..?

సిట్‌కు స‌హ‌క‌రించే సీన్ ఉందా..?

   17 hours ago


12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   22-02-2020


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   22-02-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle