newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం.. చివరి అవకాశమంటూ హైకోర్టు ఆగ్రహం

20-07-202020-07-2020 18:17:47 IST
Updated On 20-07-2020 19:03:17 ISTUpdated On 20-07-20202020-07-20T12:47:47.735Z20-07-2020 2020-07-20T12:47:30.149Z - 2020-07-20T13:33:17.172Z - 20-07-2020

తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం.. చివరి అవకాశమంటూ హైకోర్టు ఆగ్రహం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న వేళ తెలంగాణలో జరుగుతున్న పరీక్షలు, హెల్త్ బులిటిన్ వివరాలపై హైకోర్టు తీవ్రంగా అసహనం వ్యక్తం చేసింది. తెలంగాణలో కరోనా వైరస్ పరిస్థితులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ సహనాన్ని మళ్ళీ మళ్లీ పరీక్షించొద్దని, ఇదే చివరి అవకాశమని పేర్కొంది. హెల్త్ బులిటెన్‌లో సమగ్ర వివరాలు ఉండాలని అధికారులను ఆదేశించింది. 

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ్య వెబ్‌సైట్ పునరుద్ధరించాలని సూచించింది. ఈ నెల 28న చీఫ్ సెక్రటరీ, వైద్యారోగ్య కార్యదర్శి న్యాయస్థానం ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసి వాట్సాప్ నంబర్ గురించి అందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించింది. ప్రజలు ఫిర్యాదు చేసేందుకు మరిన్ని ఫోన్ నంబర్లు అందుబాటులోకి తేవాలని సూచించింది.

తెలంగాణలో కరోనా పరీక్షలు అందుబాటులో వున్న హాస్పిటళ్ల వారీగా ఖాళీగా ఉన్న బెడ్ల వివరాలను వెల్లడించాలని కోర్టు ఆదేశించింది. జిల్లాల వారీగా కేసుల వివరాలను కలెక్టర్లు సూచించాలని ఆదేశించింది. కరోనా వైరస్ నిర్దారణకు సంబంధించి ర్యాపిడ్ టెస్టులు ఏయే హాస్పిటళ్లలో చేస్తున్నారో తెలపాలని సూచించింది. పెళ్లిళ్లు, అంత్యక్రియలకు ఎక్కువ మంది హాజరుకాకుండా చూడాలని సూచించింది. ప్రైమరీ కాంటాక్టులకు జరిపిన పరీక్షల వివరాలను వెల్లడించాలని పేర్కొంది.

కరోనా విషయంలో ఇప్పటికే పలుమార్లు తీవ్ర వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. తమ ఆదేశాలను అమలు చేయడానికి చివరి అవకాశం ఇస్తున్నామని తెలిపింది. తమ ఆదేశాలు అమలు కాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈమేరకు సీఎస్ ను బాధ్యుడిని చేసింది. మరోవైపు నల్గొండ జిల్లాలో కరోనా కట్టడి జరుగుతోందని.  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పనితీరు భేషుగ్గా ఉందని  విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

సరిహద్దుల్లో సైనికుల్లా పనిచేస్తున్న వైద్య సిబ్బంది పనితీరుతో దవాఖానలపై ప్రజల్లో విశ్వసనీయత పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. పుకార్లను నమ్మవద్దని, అవగాహన లేక అక్కడక్కడా జరుగుతున్న అంశాలపై అపశృతులు దొర్లుతున్నట్లు ప్రచారం జరుగుతుందన్నారు.

కరోనా విషయంలో ప్రభుత్వం ఏం చేస్తోందో , నిజానిజాలు ఏమిటో ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు అన్నారు. ప్రాణాలకు తెగించి ప్రాణాంతక వ్యాధి నుంచి సామాన్య పేద ప్రజలను కాపాడే వైద్య ఆరోగ్య సిబ్బంది మనోధైర్యం కోల్పోవద్దన్నారు. నల్గొండ, సూర్యాపేట  దవాఖానల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేశామని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   14 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   11 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   13 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   17 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   20 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   21 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle