newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటికే కరోనా కిట్

11-07-202011-07-2020 12:23:26 IST
Updated On 11-07-2020 12:37:23 ISTUpdated On 11-07-20202020-07-11T06:53:26.990Z11-07-2020 2020-07-11T05:44:32.187Z - 2020-07-11T07:07:23.759Z - 11-07-2020

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటికే కరోనా కిట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కరోనా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించింది. 13 మంది ప్రత్యేక అధికారులను నియమించింది ప్రభుత్వం.  కరోనా కేసులు, బెడ్స్, ల్యాబ్స్ పై సమన్వయం చేయనున్నారు ఈ ప్రత్యేక అధికారులు.  కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. లక్షణాలు లేని వారు ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 10 వేల మందికి పైగా కరోనా పేషంట్లు హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు. మొదట్లో వీరిలో ఎలాంటి లక్షణాలు బయటపడకపోయినా.. రెండు రోజుల వ్యవధిలో జ్వరం, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలు స్వల్పంగా కనిపిస్తున్నాయి.

అయితే వీరి విషయంలో ప్రభుత్వం సరిగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. డాక్టర్లు సరిగా ఫోన్ చేయడం లేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఐసోలేషన్‌లో ఉండి అవస్థలు పడుతున్నామని బాధితులు ఆవేదన చెందుతున్నారు. భవిష్యత్తులో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో.. బాధితులకు ఇక్కట్లు తప్పించేలా తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్న కరోనా బాధితుల వద్దకే ఐసోలేషన్ కిట్ పంపాలని నిర్ణయించింది.

దీంతో పాటు మాస్క్‌లు, శానిటైజర్లు, గ్లౌజులు, హైడ్రాక్సీక్లోరోక్విన్‌, పారాసెటమాల్‌ మాత్రలు, యాంటీ బయాటిక్స్‌, విటమిన్‌ సి, ఇ, డి3 ట్యాబెట్లు, లివోసెటిరిజైన్‌, ఎసిడిటీని తగ్గించే మాత్రలు ఈ కిట్‌లో ఉంటాయి. అంతే కాకుండా కరోనా వచ్చినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలిపే బుక్‌లెట్‌ను కూడా అందించనున్నారు. దగ్గర్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల‌్‌కు చెందిన సిబ్బంది బాధితుడి ఇంటికెళ్లి ఈ కిట్లను అందజేస్తారు. ఎలా వుండాలో వివరిస్తారు. 

ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 32,224 ఉండగా.. యాక్టివ్ కేసులు 12,860 ఉన్నాయి. వీరిలో దాదాపు 10 వేల మంది ఇళ్లలోనే ఉండి చికిత్స పొందుతున్నారు. కొందరిలో కరోనా పాజిటివ్ అని తేలినా ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. కానీ కొందరిలో దగ్గు, జలుబు, జ్వరం తదితర లక్షణాలు కనిపిస్తున్నాయి.

ఇంట్లో నుంచి బయటకు రాలేకపోవడం, ఎవరిని సంప్రదించాలో తెలియకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ మందులు లేదా చికిత్స కోసం బాధితుడు బయటకు వస్తే.. ఇతరులకు వైరస్ సోకే ప్రమాదం ఉంది. వీటిన్నింటిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ సర్కారు 17 రోజులపాటు కరోనా బాధితులకు సరిపడేలా ఐసోలేషన్ కిట్‌ను అందించనుంది. రానున్న 20 రోజుల్లో దాదాపు 3 లక్షల కరోనా నిర్ధారణ పరీ క్షలు చేయాలని అత్యంత కీలక నిర్ణ యం తీసుకుంది. ఆ ప్రకారం రోజుకు 15 వేల పరీక్షలు చేస్తారు. ప్రస్తుతం చేస్తున్న ఆర్టీ–పీసీఆర్‌ టెస్టు ద్వారా రోజుకు 5 వేలు, తాజాగా ప్రారంభిం చిన ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టుల ద్వారా రోజుకు 10 వేల కరోనా పరీక్షలు చేస్తారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle