newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

02-07-202002-07-2020 08:44:02 IST
Updated On 02-07-2020 11:23:24 ISTUpdated On 02-07-20202020-07-02T03:14:02.522Z02-07-2020 2020-07-02T03:13:55.383Z - 2020-07-02T05:53:24.918Z - 02-07-2020

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జీవించే హక్కును కాలరాసే విధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ కరోనా హెల్త్‌ బులిటెన్‌లలో ప్రభుత్వం అరకొర సమాచారం ఇవ్వడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ నిర్దారణ టెస్టుల తీరుపై హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 

తెలంగాణలో కంటైన్‌మెంట్‌ విధానమేంటో తెలుపాలని ఆదేశాలు జారీ చేసింది. కంటైన్‌మెంట్‌ ప్రాంతాల వివరాలు సమర్పించాలని ఆదేశించింది. అలాగే తెలంగాణలో 20 రోజులుగా జరిగిన కరోనా పరీక్షల వివరాలు తెలపాలని ఆదేశించింది. అయితే కరోనా పరీక్షలు నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం ఆశ్చర్యమన్న హైకోర్టు.. ఐసీఎంఆర్‌ నిబంధనలకు విరుద్దంగా పీహెచ్‌ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారని హైకోర్టు తెలిపింది.

ఆర్‌ఏడీ బ్లడ్‌ శాంపిల్స్‌ ఎందుకు చేయకూడదని, పది నిమిషాల్లో రిజిల్ట్‌ వచ్చే పరీక్షలు చేయాలని ఆదేశించామని, ఎన్ని యూనిట్స్‌ తెచ్చారు.. ఇప్పటి వరకు ఎందుకు చేయలేదని కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. 50వేల పరీక్షలు చేస్తామని చెప్పి మూడు రోజులు అసలే పరీక్షలు నిర్వహించలేదని పిటిషనర్‌ తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.కరోనా నిర్దారణ పరీక్షలు ఆపడంపై అభ్యంతరం తెలిపింది. 

మే 23 నుంచి జూన్‌ 23వ తేదీ వరకు ఎన్ని టెస్టులు చేశారు.. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌ శాంపిల్స్‌ ఎన్ని తీసుకున్నారు.. జూన్‌ 26న ఐసీఎమ్మార్‌  గైడ్‌లైన్‌ ప్రకారం లక్షణాలు ఉన్నవారికి, లేనివారికి ఎన్ని పరీక్షలు చేశారో తెలుపాలని హైకోర్టు ఆదేశించింది.

అలాగే ఏప్రిల్‌ 21, జూన్‌ 8, జూన్‌ 18న ఎన్నెన్ని కిట్లను ఇచ్చారో, దీన్ని కూడా కోర్టు దిక్కరణ కింద తీసుకుంటామని తెలిపింది. 17న తేదీ వరకు ఆదేశించిన పనులు పూర్తికాకపోతే 20న చీఫ్‌ సెక్రెటరీ, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, హెల్త్‌, పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌, హెల్త్‌ కమిషనర్‌ హాజరు కావాలని ఆదేశించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదికలు సమర్పించకపోతే కోర్టు ధిక్కరణగా భావించాల్సి వస్తుందని న్యాయస్థానం తెలిపింది.

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   12 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   13 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   13 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   17 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   18 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   16 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   19 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   19 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   14 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   21 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle