newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణ టు ఆంధ్రా.. పర్మిషన్ కోసం వందలాదిమంది పడిగాపులు

25-03-202025-03-2020 12:14:51 IST
2020-03-25T06:44:51.581Z25-03-2020 2020-03-25T06:42:51.510Z - - 15-04-2021

తెలంగాణ టు ఆంధ్రా.. పర్మిషన్ కోసం వందలాదిమంది పడిగాపులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణతో సహా దేశమంతా కరోనా వ్యాప్తి నిరోధానికి గాను లాక్ డౌన్ అమలవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని వివిధ హాస్టళ్ళలో ఉండేవారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లేందుకు అనుమతివ్వాలని అనేకమంది యువతీ, యువకులు, చిరుద్యోగులు ప్రభుత్వానికి విన్నపాలు పెట్టుకుంటున్నారు. దేశమంతా లాక్‌డౌన్ నడుస్తున్న సమయంలో నగరాలు, గ్రామాల్లోని వారు ఎక్కడి వాళ్లు అక్కడే ఉండిపోవాల్సి వస్తోంది.

 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటనతో కొందరిలో ఎటూ పాలుపోని పరిస్థితి నెలకొంది.  నగరంలోని హాస్టళ్లలో ఉంటూ ఉద్యోగాలు చేసుకునే వారికి ఇది ఇబ్బందికరంగా మారింది. హాస్టళ్లను పోలీసులు ఖాళీ చేయిస్తుండటంతో.. అమీర్‌పేట్, పంజాగుట్టలో నివాసం ఉండేవారు ఆందోళనకు గురవుతున్నారు. హాస్టళ్లను ఖాళీ చేసినా.. సరైన రవాణా వ్యవస్థ లేక ఊరెళ్లలేని పరిస్థితి కనపడుతోంది. సరిహద్దులు అన్నీ మూసేయడంతో ... అటు సొంతూరు వెళ్లలేక ఇక్కడ తలదాచుకునే పరిస్థితి లేక తీవ్రంగా సతమతమవుతున్నారు. ముఖ్యంగా ఏపీకి చెందిన వారు తమ సొంతూళ్లకు వెళ్లేలా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ చొరవ తీసుకుని హైదరాబాద్ నుంచి స్వంతూళ్ళకు వెళ్ళేందుకు ప్రత్యేక అనుమతులు వచ్చేలా చూడాలని కోరుతున్నారు.

హైదరాబాద్ లో ముఖ్యంగా అమీర్ పేట, యూసుఫ్ గూడ, మాదాపూర్, గచ్చిబౌలి, లింగంపల్లి ప్రాంతాల్లోనే హాస్టళ్ళలో వున్నవారు తమ స్వంతూళ్ళకు వెళ్లేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. వారంతా తమకు సాయం చేయాలని కోరుతున్నారు. కరోనా ప్రభావంతో హాస్టళ్లను తక్షణమే ఖాళీ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎస్.ఆర్. నగర్, అమీర్ పేట్ ప్రాంతాల్లో 500 లకు పైగా ఉన్న లేడీస్, జెంట్స్ హాస్టళ్లను తక్షణమే ఖాళీ చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

ప్రభుత్వం ఊర్ల నుంచి నగరానికి వచ్చి ఉద్యోగాలు వెతుక్కొనేవారిని కూడా కొన్నిరోజులు ఇళ్లకు పోవాలని, సొంత గ్రామాల్లో ఉండాలని చెబుతుంది ప్రభుత్వం. కరోనా ఎఫెక్ట్ తగ్గిన తర్వాత తిరిగిరావాలనేది అధికారుల సూచించారు. దీంతో వారంతా దిక్కులేకుండా రోడ్లపై పడ్డారు. ఇప్పటికే హైదరాబాద్ యూనివర్శిటీ, ఉస్మానియా హాస్టల్స్ ఖాళీ చేయాలని అధికారులు విద్యార్థులకు ఆదేశాలు జారీచేశారు. ఏ ఒక్కరు కూడా హాస్టల్‌లో ఉండటానికి వీలు లేదని, వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. ఐటీ కంపెనీలు ప్రతి ఐటీ ఉద్యోగిని ఇళ్ల నుంచే పని చేయించుకుంటున్నాయి. ఇటు కూకట్ పల్లి పోలీసులకు ఇదే ఇబ్బంది వచ్చిపడింది. వందలాదిమంది తమను ఊరికి పంపేందుకు ఏర్పాట్లు చేయాలని, పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle