newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణ జిల్లాలనూ వదలని కరోనా .. గ్రేటర్లోనే ఎక్కువ

10-06-202010-06-2020 11:44:55 IST
2020-06-10T06:14:55.202Z10-06-2020 2020-06-10T06:14:50.432Z - - 17-04-2021

తెలంగాణ జిల్లాలనూ వదలని కరోనా .. గ్రేటర్లోనే ఎక్కువ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ జిల్లాల్లో ఈమధ్య వరకూ కరోనా కేసులు అంతగా నమోదు కాలేదు. లాక్ డౌన్ సడలింపులు అనంతరం కేసుల తీవ్రత బాగా పెరగడంతో ఆందోళన ఎక్కువ అవుతోంది. రాష్ట్రంలో మంగళవారం 178మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 143మంది ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 15 మంది, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 10 మంది, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున, జగిత్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, రాజన్న సిరిసిల్ల, వరంగల్‌ రూరల్‌ జిల్లాల్లో ఒక్కొక్కరికి పాజిటివ్‌గా తేలింది. కరోనా, ఇతర కారణాలతో ఆరుగురు మరణించారు. రాష్ట్రంలో మొత్తం 3,920 మందికి పాజిటివ్‌ రాగా, 148 మంది మరణించారు.1,742 మంది డిశ్చార్జ్ అయ్యారు.

నేషనల్‌ పోలీస్‌ అకాడమి(ఎన్పీఏ)లో శిక్షణ పొందుతున్న ఇద్దరు ఐపీఎస్‌ ప్రొబేషనరీ అధికారులకు కరోనా పాజిటివ్‌గా తేలినట్టు సమాచారం. 130 మంది శిక్షణ ఐపీఎస్‌లు ఇటీవల ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ కోసం వారివారి క్యాడర్‌ రాష్ర్టాలకు వెళ్లి.. ఇటీవలే తిరిగి అకాడమిలో రిపోర్టు చేశారు. వీరికి అకాడమి ఉన్నతాధికారులు కొవిడ్‌-19 పరీక్షలు చేయించగా, ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

కామారెడ్డి జిల్లా అశోక్ నగర్ కాలనీలో ఐదుగురికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత అయిదు రోజుల క్రితం ముంబయి నుండి కామారెడ్డి చేరుకున్నారు 8 మంది బాధితులు. అందులో ఐదుగురికి కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. వీరిని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇటు కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. కాగజ్ నగర్ మండలం ఈజ్ గామ్ విలేజ్  కు చెందిన 24 ఏళ్ళ మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. సదరు మహిళ ఇటీవలే కలకత్తా నుండి వచ్చినట్టు తెలుస్తోంది. అసిఫాబాద్ క్వారంటైన్ నుండి గాంధీ ఆసుపత్రికి తరలించారు. జిల్లాలో 18కి చేరాయి కరోనా పాజిటివ్ కేసులు. అలాగే కరోనా పాజిటివ్ తో సింగరేణి కార్మికుడు మృతి చెందాడని తెలియడంతో కార్మిక కుటుంబాలు ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు.  ప్రశాంతంగా ఉన్న సింగరేణి కాలనీలో కరోనా కలకలం స్థానిక ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.

గత పది రోజుల క్రితం నాగారం చెందిన కనకమ్మ కరోనా పాజిటివ్ రావడంతో ఆయన భర్త కూతురిని కాలనీలోని క్వార్టర్ నుంచి హోమ్ క్వారంటైన్లో ఉంచారు ఆ భయం నుండి ప్రజలు కోలుకొనే లోపే కరోనా పాజిటివ్ తో కార్మికుడు మృతి చెందాడని తెలియడంతో కాలనీ ప్రజలు ఆయనతోపాటు విధులు నిర్వహించే సివిల్ డిపార్ మెంట్ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. అలాగే 11 బ్లాక్ లో ఉండే కార్మిక కుటుంబాలు కూడా భయాందోళన చెందుతున్నారు. కాలనీ లోని ప్రజలు ఇప్పటినుండి చాలా అప్రమత్తంగా ఉండాలని సింగరేణి అధికారులు పోలీస్ సిబ్బంది సూచిస్తున్నారు అవసరమైతే తప్ప ఎవరు బయటికి రాకుండా ఉండాలని తప్పక మాస్కు ధరించి బయటికి రావాలని పలు సూచనలు చేస్తున్నారు.

మంచిర్యాల జిల్లా పోలీస్ శాఖలోనూ కరోన కలకలం రేగింది. ఒక కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ప్రైమరీ కాంటాక్ట్ లోన్న వారిని గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. దీంతో మంచిర్యాల జిల్లాలో 45 కు చేరుకున్నాయి కరోన పాజిటివ్ కేసులు. తాజాగా మరో  రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. కానిస్టేబుల్ నివాసం ఉన్న గంగాకాలనీని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు అధికారులు.

వలస కార్మికులతో జిల్లాకు కరోనా భయం పట్టుకోవడం దీనికి తోడు స్థానికంగా ఉన్న వారు సైతం కరోనా బారిన పడటం తో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. దీనితో  జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది..కానిస్టేబుల్ తో సన్నిహితంగా ఉన్న వారిని హోం క్వారయింటెన్ చేసినట్లు మందమ్మరి సిఐ మహేష్ తెలిపారు. తెలంగాణలో కరోనా వైరస్‌ తీవ్రత లేనివారికి, వ్యాధి లక్షణాలు లేనివారికి ఇండ్లలోనే ఉంచి చికిత్స అందించాలన్న ఐసీఎమ్మార్‌ సూచనను రాష్ట్రంలో అమలుచేస్తున్నట్టు మంత్రి ఈటల చెప్పారు. 

 

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   an hour ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   an hour ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   2 hours ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   2 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   5 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   4 hours ago


hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

   19 minutes ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   7 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   20 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle