newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణ గతిని మార్చే కాళేశ్వరం .. అన్నదాతకు వరం

21-06-201921-06-2019 09:15:35 IST
Updated On 21-06-2019 14:46:48 ISTUpdated On 21-06-20192019-06-21T03:45:35.243Z21-06-2019 2019-06-21T03:45:28.786Z - 2019-06-21T09:16:48.554Z - 21-06-2019

తెలంగాణ గతిని మార్చే కాళేశ్వరం .. అన్నదాతకు వరం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో లక్షల ఎకరాల భూములు నీరులేక బీడుబారాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అపారంగా ఉన్న నీటివనరులను భూముల వైపు పారించే మహాక్రతువు ప్రారంభించారు.

అతి తక్కువ కాలంలోనే అనితర సాధ్యమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ కలను సాకారం చేసుకొని తెలంగాణ అన్నదాతకు ప్రాజెక్టును అంకితం చేస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకం కాళేశ్వరం రికార్డుస్థాయిలో నిర్మాణం పూర్తిచేసుకుని ప్రారంభానికి సిద్ధమైంది. కాసేపట్లో గవర్నర్, ఇరుగుపొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో సీఎం కేసీఆర్ నీటిని విడుదల చేయనున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం నిర్ణయించడం వెనుక అనేక కారణాలున్నాయి. ఈరోజు నైరుతి రుతుపవనాలు కూడా తెలంగాణలోకి రానున్నాయి. సీఎం కేసీఆర్ ముందుగా నిర్ణయించిన ప్రకారం  కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి   గోదావరితీరం అన్నిరకాలుగా ముస్తాబైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం లోని మేడిగడ్డ బరాజ్, కన్నెపల్లి పంపుహౌజ్ వద్ద మహా ఘట్టానికి సన్నాహాలు పూర్తయ్యాయి. శాస్తోక్తంగా పూజలు నిర్వహించడంతో పాటు మేడిగడ్డ, కన్నెపల్లి వద్ద హోమాలు నిర్వహించాలని సంకల్పించడంతో ఆ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ప్రారంభోత్సవ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా గవర్నర్ నరసింహన్ హాజరుకానున్నారు. మహారాష్ట్ర ఏపీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా పాల్గొంటున్నారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు కూడా హాజరవుతున్నారు. ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్ర, ఏపీ ముఖ్యమంత్రులు ఈ మహోజ్వల ఘట్టానికి సాక్షీభూతంగా నిలవనున్నారు. 

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కన్నెపల్లి పంపు హౌస్‌కు చేరుకుంటారు. ఉదయం 10.50 గంటలకు కన్నెపల్లి పంపు హౌస్‌లోని మోటర్ల ద్వారా నీటి విడుదల చేస్తారు. అనంతరం అతిథులతో కలిసి డెలివరీ సిస్టర్న్ వద్దకు వెళ్లి గోదావరి జలాలు పైపుల ద్వారా ఎగిసిపడే దృశ్యాల్ని వీక్షిస్తారు.

ఆ తర్వాత కన్నెపల్లిలోనే సీఎం కేసీఆర్ అతిథులతో కలిసి భోజనం చేస్తారు. అటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఫొటో ఎగ్జి బిషన్‌ను కూడా ఏర్పాటుచేశారు. ప్రాజెక్టు ప్రారంభానికి ముందు మేడిగడ్డ, కన్నెపల్లి వద్ద నిర్వహించనున్న హోమాలకు తగిన ఏర్పాట్లు చేశారు, మేడిగడ్డ బరాజ్ వ్యూ పాయింట్ వద్ద 80 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పుతో హోమశాల నిర్మించారు.

మట్టితో ఫ్లోరింగ్ చేసి ఆవుపేడ కలిపి హోమశాలను తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఇతర ప్రముఖులు మేడిగడ్డ బరాజ్ వద్ద కార్యక్రమం ముగిసిన తర్వాత హెలికాప్టర్ల ద్వారా కన్నెపల్లి పంపుహౌస్‌కు చేరుకొంటారు.

ఇక్కడ హోమంలో పాల్గొన్న అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రాజెక్టు కోసం భూమి ఇచ్చిన కన్నెపల్లి గ్రామస్థులకు ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేశారు. కాళేశ్వరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు. మొత్తం మీద జూన్ 21 తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజంటున్నారు. 

 

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   22 minutes ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   a day ago


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   19 hours ago


కాంగ్రెస్సే ఉంటే ఇలా జరిగేదా.. బాబే ఉంటే ఇలా జ‌రిగేదా

కాంగ్రెస్సే ఉంటే ఇలా జరిగేదా.. బాబే ఉంటే ఇలా జ‌రిగేదా

   13-05-2021


కేటీఆర్ త‌ప్పించుకుంటున్నారా

కేటీఆర్ త‌ప్పించుకుంటున్నారా

   13-05-2021


రుయాలో చనిపోయింది 11 మంది కాదు 31 మంది: టీడీపీ

రుయాలో చనిపోయింది 11 మంది కాదు 31 మంది: టీడీపీ

   13-05-2021


నిరుద్యోగులకు ఆరువేలు ఇవ్వండి.. ప్రధానికి 12 పార్టీల విజ్ఞప్తి

నిరుద్యోగులకు ఆరువేలు ఇవ్వండి.. ప్రధానికి 12 పార్టీల విజ్ఞప్తి

   a day ago


విద్యా ప్రమాణాలు పెంచండి : అధికారులకు జగన్ ఆదేశం

విద్యా ప్రమాణాలు పెంచండి : అధికారులకు జగన్ ఆదేశం

   12-05-2021


అంతా కేంద్ర పెత్తనం వల్లే !  ఢిల్లీకి కొవ్యాక్సిన్ సరఫరా నిరాకరణపై సిసోడియా

అంతా కేంద్ర పెత్తనం వల్లే ! ఢిల్లీకి కొవ్యాక్సిన్ సరఫరా నిరాకరణపై సిసోడియా

   12-05-2021


ఏపీలో బీజేపీ, ఆ పార్టీ దోస్తులు ఏమైన‌ట్లు

ఏపీలో బీజేపీ, ఆ పార్టీ దోస్తులు ఏమైన‌ట్లు

   12-05-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle