newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

తెలంగాణ ఖజానాకు మద్యం కిక్కు.. డబ్బులే డబ్బులు

13-05-202013-05-2020 12:45:38 IST
Updated On 13-05-2020 14:30:26 ISTUpdated On 13-05-20202020-05-13T07:15:38.105Z13-05-2020 2020-05-13T07:15:29.806Z - 2020-05-13T09:00:26.437Z - 13-05-2020

తెలంగాణ ఖజానాకు మద్యం కిక్కు.. డబ్బులే డబ్బులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లాక్ డౌన్ పీరియడ్ ముగియకముందే తెలంగాణ మద్యం అమ్మకాలకు గేట్లు ఎత్తేసింది సర్కార్. ఎవరేమనుకున్నా.. కరోనా వైరస్ భయం వెంటాడుతున్నా మద్యం అమ్మకాలు మూడు క్వార్టర్లు, ఆరుబీర్లుగా వర్ధిల్లుతోంది. తెలంగాణలో లిక్కర్‌ సేల్స్‌ దుమ్మురేపుతున్నాయి. మద్యం అమ్మకాలు ప్రారంభం అయిన వారంరోజుల్లోనే మద్యం అమ్మకాలు దాదాపుగా వెయ్యికోట్ల వరకూ చేరుకున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే ఇప్పుడు మరింత రెట్టింపు అమ్మకాలు జరుగుతున్నాయి. 

మళ్లీ ఎక్కడ మద్యం షాపులు మూసేస్తారోనని మద్యం బాబులు బెంగెట్టుకుంటున్నారు. అందుకే మద్యం తాగని 45 రోజులది కలిపి అంతా ఇప్పుడు తాగేస్తున్నారో తెలియదు గానీ లిక్కర్‌ సేల్స్‌ మాత్రం బాగున్నాయి. తెలంగాణలో ఎక్కువ మద్యం అమ్మకాలు గ్రేటర్ హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయి. కరోనా కేసులు ఎక్కువైపోయి.. లిక్కర్ షాపులు ఎక్కడ మూసేస్తారోనన్న భయంతో జనాలు పెద్దమొత్తంలో లిక్కర్ బాటిల్స్ కొనేసి ఇంట్లో పెట్టుకుంటున్నారు. టూవీలర్లు, కార్లలో మద్యం బాటిళ్ళు కనిపిస్తున్నాయి. 

తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 6వ తేదీ నుంచి మద్యం షాపులను ఓపెన్‌ చేసిన సంగతి తెలిసిందే. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మద్యం అమ్మకాలు చేసుకోవచ్చని సీఎం కేసీయార్ సూచించారు. అంతేకాకుండా పదహారు శాతం రేట్లను కూడా పెంచింది. ఆరవతేదీ ఉదయం నుంచి ఈనెల 13 వ తేదీ ఉదయం వరకూ తెలంగాణ వ్యాప్తంగా 1000 కోట్ల అమ్మకాలు జరిగాయని తెలుస్తోంది.

అంటే రోజుకు గరిష్టంగా 135 కోట్ల అమ్మకాలు జరిగాయన్న మాట. ఇక 8వ తేదీన ఏకంగా 190 కోట్ల రూపాయల సేల్స్‌ జరిగితే.. ఆదివారం మాత్రం కేవలం 37 కోట్ల రూపాయల మద్యమే అమ్ముడయ్యింది. గత ఏడాది మేలో మొత్తం 1,847 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి. ఈ లెక్కన చూస్తుంటే మద్యం అమ్మకాలు కిక్కు ఖజానాను నింపేయడం ఖాయంగా కనిపిస్తోంది. అటు ఏపీలో డబుల్ రేట్లు వున్నా మద్యం అమ్మకాలు అక్కడ కూడా పెరుగుతున్నాయి. 

భౌతిక దూరం పాటించడం, మాస్కులు పెట్టుకోవాలని సూచించడంలో మద్యం బాబులు అక్కడక్కడా ఈ రూల్స్ బ్రేక్ చేస్తూనే వున్నారు. ఇదిలా వుంటే ఆన్‌లైన్ లిక్కర్ సేల్స్‌పై తెలంగాణ ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాల గురించి ఆలోచిస్తామని చెప్పారు.

అధికారులతో సమీక్ష నిర్వహించి డోర్ డెలివరీ అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు శ్రీనివాస్ గౌడ్. రాష్ట్రంలో కరోనా కేసులు మరింతగా పెరిగితే మద్యం అమ్మకాల మీద చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. వైన్ షాపుల వద్ద భౌతిక దూరం పాటించకుంటే.. ఆ షాపులను సీజ్ చేస్తామని హెచ్చరించారు.

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

   3 hours ago


తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

   8 hours ago


భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

   11 hours ago


మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

   11 hours ago


నిమ్మగడ్డ  ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

నిమ్మగడ్డ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

   11 hours ago


మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

   13 hours ago


యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

   14 hours ago


‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

   14 hours ago


తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

   14 hours ago


డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

   30-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle