newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

తెలంగాణ క‌లెక్ట‌ర్లు.. వినూత్న ఆలోచ‌న‌లు

03-01-202003-01-2020 09:39:26 IST
Updated On 03-01-2020 10:54:31 ISTUpdated On 03-01-20202020-01-03T04:09:26.955Z03-01-2020 2020-01-03T04:08:58.754Z - 2020-01-03T05:24:31.071Z - 03-01-2020

తెలంగాణ క‌లెక్ట‌ర్లు.. వినూత్న ఆలోచ‌న‌లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా ప‌రిపాల‌న సులువు అవుతుంద‌ని, పాల‌నా వ్య‌వ‌స్థ ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతుంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ బాగా న‌మ్మారు. అందుకు త‌గ్గ‌ట్లుగానే 10 జిల్లాల తెలంగాణ‌లో 33 జిల్లాలు చేశారు. దీంతో క‌లెక్ట‌ర్లు చిన్న జిల్లాల‌కే ప‌రిమితం కావ‌డంతో ప్ర‌జ‌ల‌పై ఎక్కువ దృష్టి పెట్ట‌గ‌లుగుతున్నారు. వినూత్న ఆలోచ‌న‌ల‌తో ప్ర‌జ‌ల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఈ లిస్టులో మొద‌ట చెప్పుకోవాల్సిన పేరు ప్ర‌స్తుత నిజామాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ నారాయ‌ణ‌రెడ్డి పేరు. మొన్న‌టి వ‌ర‌కు ములుగు జిల్లా క‌లెక్ట‌ర్‌గా ప‌ని చేసిన ఆయ‌న జిల్లాను ప్లాస్టీక్ ఫ్రీ చేసేందుకు బాగా కృషి చేశారు. మేడారం జాత‌ర‌ను ప్లాస్టీక్‌ ర‌హితంగా నిర్వ‌హించేలా కార్య‌చ‌ర‌ణ అమ‌లు చేశారు. ప్ర‌జ‌ల చేత‌ను ప్లాస్టీక్‌ను సేక‌రించి వారికి ఒక కిలో ప్లాస్టీక్‌కు కిలో బియ్యం ఇచ్చే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు.

తాజాగా ఆయ‌న నిజామాబాద్‌కు బ‌దిలీ అయ్యారు. జిల్లా ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో ప్ర‌జ‌ల‌కు సేవ‌లు ఎలా అందుతున్నాయో తెలుసుకునేందుకు సైకిల్ ఎక్కి సెక్యూరిటీ, అధికారుల‌కు స‌మాచారం ఇవ్వ‌కుండా ఆసుప‌త్రికి వెళ్లారు. సామాన్యుడిలా వెళ్లి రోగుల‌తో మాట్లాడి వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. డాక్ట‌ర్ల ప‌నితీరుపై ఆరా తీశారు. స‌మ‌యానికి రాని డాక్ట‌ర్లు, సిబ్బందిపై చ‌ర్య‌ల‌కు ఆదేశించారు. ఇక‌, జిల్లా వాసుల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు ప్ర‌తి సోమ‌వారం మ‌న ఆకాశ‌వాణి - మ‌న నిజామాబాద్ అనే కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌తి సోమ‌వారం ఉద‌యం అర‌గంట పాటు ప్ర‌జ‌ల‌తో ఆకాశ‌వాణి ద్వారా క‌లెక్ట‌ర్ నేరుగా మాట్లాడ‌తారు.

ఇక‌, ఆదిలాబాద్ క‌లెక్ట‌ర్ దివ్య దేవ‌రాజ‌న్‌, కొమ్రం భీం ఆసిఫాబాద్ క‌లెక్ట‌ర్ రాజీవ్ గాంధీ హ‌నుమంతు కూడా వైవిద్య ఆలోచ‌న‌ల‌తో ముందుకు వెళుతున్నారు. ఈ జిల్లాల్లో చ‌లి తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంటుంది. గిరిజ‌నులు, నిరుపేద‌లు, అనాధ‌లు చ‌లికి తీవ్ర ఇబ్బందులు ప‌డ‌తారు. ఇందుకోసం వీరిద్ద‌రు క‌లెక్ట‌ర్లు త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చే ఎవ‌రైనా పుష్ప‌గుచ్చాలు తేవొద్ద‌ని, బ్లాంకెట్లు, స్వెట్ట‌ర్లు తేవాల‌ని కోరారు. వీరి పిలుపున‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. వంద‌లాది బ్లాంకెట్లు, స్వెట్ట‌ర్లు క‌లెక్ట‌ర్లు సేక‌రించారు. ఇవి అనాధ‌ల‌కు, నిరుపేద‌ల‌కు ఇవ్వ‌నున్నారు.

ఇక‌, పెద్ద‌ప‌ల్లి క‌లెక్ట‌ర్ శ్రీ దేవ‌సేన ఎప్పుడూ ఇలా వినూత్న ఆలోచ‌న‌ల‌తో ముందుకు వెళ‌తారు. ముఖ్యంగా మ‌హిళ‌ల విష‌యంలో, పారిశుధ్యంపై ఆమె ప్ర‌త్యేక దృష్టి పెడ‌తారు. ఇంత‌కుముందు జ‌న‌గామ జిల్లా క‌లెక్ట‌ర్‌గా ఉన్న స‌మ‌యంలో ఆమె జిల్లాలోనే విద్యార్థినులు అంద‌రికీ ఆత్మ‌ర‌క్ష‌ణ కోసం క‌రాటెలో శిక్ష‌ణ ఇప్పించారు. ఆమె పెద్ద‌ప‌ల్లి జిల్లాకు బ‌దిలీ అయ్యాక పారిశుధ్యంపై ఎక్కువ దృష్టి పెట్ట‌డంతో జిల్లాకు జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు వ‌చ్చింది.

తాజాగా, మ‌హిళ‌ల ఆరోగ్యంపై ఆమె శ్ర‌ద్ధ పెట్టారు. రుతుస్రావంపై మ‌హిళ‌ల్లో ఉన్న అపోహ‌లు తొల‌గించేందుకు స‌బల అనే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగానే స్వ‌యం స‌హాయ‌క మ‌హిళ‌ల చేత శానిట‌రీ నాప్కిన్ల త‌యారీ యూనిట్‌ను ప్రారంభింప‌జేశారు. జిల్లాలోని మ‌హిళ‌ల‌కు ఇవి స‌ర‌ఫ‌రా చేయిస్తున్నారు.

ఇక‌, ప్ర‌భుత్వ అధికారుల్లో పేరుకుపోయిన లంచ‌గొండిత‌నాన్ని నిర్మూలించేందుకు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా క‌లెక్ట‌ర్ రోనాల్డ్ రోస్ కూడా వినూత్న ఆలోచ‌న చేశారు. ఆయ‌న జిల్లాలోని అంద‌రూ ప్ర‌భుత్వ సిబ్బంది, అధికారుల‌తోటి తాము లంచం తీసుకోమ‌ని ప్ర‌తిజ్ఞ చేయించారు. ఇది ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుంది అనే విష‌యాన్ని ప‌క్క‌న‌పెడితే అవినీతి నిర్మూల‌న‌కు వైవిద్యంగా ఒక ప్ర‌య‌త్నం మాత్రం క‌లెక్ట‌ర్ చేశార‌ని చెప్పాలి. ఇలా తెలంగాణ క‌లెక్ట‌ర్లు కొత్త ఆలోచ‌న‌ల‌తో ప్ర‌జ‌ల‌కు మంచి చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. వీరిని ప్ర‌భుత్వం కూడా ప్రోత్స‌హిస్తోంది.

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   an hour ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   2 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   3 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   4 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   4 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   5 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   6 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   7 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   7 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   8 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle