newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

తెలంగాణ కోసం కొట్లాడినందుకు బాధపడుతున్నా.... కోమటి రాజగోపాల్ రెడ్డి

15-03-202015-03-2020 18:03:24 IST
2020-03-15T12:33:24.120Z15-03-2020 2020-03-15T12:33:21.674Z - - 31-05-2020

తెలంగాణ కోసం కొట్లాడినందుకు బాధపడుతున్నా.... కోమటి రాజగోపాల్ రెడ్డి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
శాసనసభలో సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను విన్న తర్వాత రాష్ట్రం ఉమ్మడిగానే ఉంటే బాగుండేదని తనకు అనిపిస్తోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. గతంలో ఎంపీగా పార్లమెంట్‌లో తెలంగాణ కోసం కొట్లాడినందుకు ఇప్పుడు బాధపడుతున్నానని చెప్పారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ తోనే తెలంగాణ వచ్చిందని చెప్పిన కేసీఆర్‌.. ఇప్పుడు అదే పార్టీని కరోనా వైర్‌సతో పోల్చడమేంటని ప్రశ్నించారు. ప్రతిపక్షాలను గౌరవించాలన్న ఇంగితజ్ఞానం సీఎంకు లేదన్నారు. 

టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికలో ఆదిష్ఠానం నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని కోరారు.  పార్టీ సరైన నిర్ణయం తీసుకోకుంటే తమదారి తాము చూసుకుంటామని తెలిపారు. రేవంత్‌రెడ్డి విషయంలో పార్టీకి నష్టం కలిగించేలా కొందరు నాయకులు మాట్లాడటం మంచి పద్ధతి కాదని, పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే జూనియర్లను ప్రోత్సహించాల్సింది పోయి.. విమర్శలు చేయడం సరికాదన్నారు. 

టీడీపీతో పొత్తు వద్దని చెప్పా.. బహిరంగంగా చెప్పడం తప్పే: కోమటి రెడ్డి

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా గురించి గతంలో బహిరంగంగా మాట్లాడి తప్పు చేశానని మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే పార్టీకి నష్టం జరగకూడదనే ఆలోచన, ఆవేదనలే తనను అలా మాట్లాడించాయని పేర్కొన్నారు. టీడీపీతో పొత్తు వద్దని, అందరినీ కలుపుకుని వెళ్లాలని మాత్రమే చెప్పానని, అయినా తాను చేసింది తప్పేనని అంగీకరించారు. 

శనివారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో  కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పార్టీ నేతలకు ఏదైనా సమస్య ఉంటే అంతర్గత వేదికల్లో మాత్రమే మాట్లాడాలన్న కుంతియా సూచన సరైందేనని, పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు.

మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లడానికి, ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవి రావడానికి సంబంధం లేదన్నారు. రేవంత్‌ ఓటుకు నోటు కేసులోనే జైలుకు వెళ్లారని, ఇప్పుడు జైలుకు వెళ్తే తాను పీసీసీ అధ్యక్షుడిని అవుతాననే ఆలోచనతో జైలుకు వెళ్లలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకుల అభిమానులు వారు అభిమానించే వారికి పీసీసీ అధ్యక్ష పదవి రావాలనుకోవడంలో తప్పులేదని, అయితే అధిష్టానం నిర్ణయమే ఫైనల్‌ అన్నారు. 

టీపీసీసీ అధ్యక్ష పదవి అధిష్టానం ఎవరికి ఇచ్చినా అందరూ సహకరించాలని కోరారు. బలమైన నాయకుడికి పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగరవేస్తామని, టీఆర్‌ఎస్‌ను గద్దె దించుతామని ధీమా వ్యక్తం చేశారు.

‘‘రైతు బంధు మంచి కార్యక్రమం. వ్యవసాయం చేసే వారికే ఆ సాయం అందాలి. రాష్ట్రంలో 70 శాతం భూములను కౌలు రైతులే సాగు చేస్తున్నారు. కానీ, చాలా మంది పెద్దలకే సాయం చేరుతోంది. ఇది మంచి పద్ధతి కాదు. నా ఖాతాలోనూ రూ.3 లక్షల రైతు బంధు డబ్బు పడుతోంది. నాకెందుకు రైతు బంధు అందుకే ఊర్లోని పేద వర్గాలకు పంచుతున్నా’’ అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. శాసనసభలో శనివారం వివిధ శాఖల పద్దులపై ఆయన మాట్లాడారు. 

రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడంతోపాటు ప్రతి పంటకు మద్దతు ధర అందించాలని, అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ కంటే బెల్ట్‌ షాపులే చాలా డేంజర్‌ అని అభిప్రాయపడ్డారు. మద్యానికి ప్రజలు బానిసలవుతున్నారని, పేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఆర్టీసీని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని కేసీఆర్‌ చెప్పారు. సమ్మె వల్ల నష్టపోయింది ప్రజలు, ఆర్టీసీ కార్మికుల కుటుంబాలే’ అని పేర్కొన్నారు. 

 

 

 

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

   2 hours ago


తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

   6 hours ago


భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

   9 hours ago


మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

   10 hours ago


నిమ్మగడ్డ  ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

నిమ్మగడ్డ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

   10 hours ago


మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

   12 hours ago


యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

   13 hours ago


‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

   13 hours ago


తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

   13 hours ago


డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

   30-05-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle