newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ‘కరోనా’ కలవరం

27-06-202027-06-2020 11:53:39 IST
Updated On 27-06-2020 14:32:28 ISTUpdated On 27-06-20202020-06-27T06:23:39.323Z27-06-2020 2020-06-27T06:22:08.219Z - 2020-06-27T09:02:28.037Z - 27-06-2020

తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ‘కరోనా’ కలవరం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అలజడి కలిగిస్తున్నాయి. ప్రస్తుతం 5 లక్షలకు పైగా కేసులు వెలుగుచూశాయి. ఇటు తెలంగాణలో కరోనా టెస్టులు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. ప్రైవేట్ రంగంలోనూ టెస్టుల ప్రక్రియ ఆపాలని ప్రభుత్వం ఆదేశించింది. గ్రేటర్ పరిధిలో కరోనా కల్లోలం కలిగిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 985 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 774 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 86, మేడ్చల్‌-53, వరంగల్‌ అర్బన్‌-20, మెదక్‌-9, ఆదిలాబాద్‌-7, నాగర్‌కర్నూల్‌, నిజామాబాద్‌, రాజన్నసిరిసిల్ల-6 చొప్పున, సిద్దిపేట, జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం-3 చొప్పున, ములుగు, జగిత్యాల, యాదాద్రిభువనగిరి-2 చొప్పున, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాల్లో-1 చొప్పున కేసులు నమోదయ్యాయి. వైరస్‌ కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 75,308 పరీక్షలు చేయగా, 12,349 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మొత్తం 237 మంది మరణించారు. 

సరాసరి రోజుకి 7 నుంచి 8 వందల కేసులు నమోదవుతున్నాయి. ఎమ్మెల్యేలు, వారి గన్ మెన్లు, డ్రైవర్లు  ఈ మహమ్మారి బారిన పడుతుండడంతో అంతా వణికిపోతున్నారు. ఇటు తెలంగాణ కాంగ్రెస్ నేతలను కరోనా కేసులు వెంటాడుతున్నాయి.

ఇప్పటికే మాజీ ఎంపీ వి.హనుమంతరావు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు శనివారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వీహెచ్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్‌ కాలంలోనూ ఆయన పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన జలదీక్షలో సైతం వీహెచ్‌ పాల్గొన్నారు. దీంతో ఆయన ఏయే కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఎవరితో కలిసి మెలిగారు అనేదానిపై అధికారులు ఆరా తీసున్నారు. జూనియర్‌ డాక్టర్ల సమ్మెకు మద్దతుగా గాంధీ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు కరోనా సోకి ఉంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు.

కాగా తెలంగాణలో ఇప్పటికే పలువురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బాజిరెడ్డి గోవర్థన్‌, బీగాల గణేష్‌ గుప్తాలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నేత గూడూరు నారాయణరెడ్డి కూడా కరోనా బారినపడ్డారు. దీంతో వివిధ ఆందోళనా కార్యక్రమాలకు రావాలంటేనే కాంగ్రెస్ నేతలు భయపడిపోతున్నారు. 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   6 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   2 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   5 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   9 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   12 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   13 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle