newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?

18-01-202018-01-2020 11:42:31 IST
Updated On 20-01-2020 17:34:11 ISTUpdated On 20-01-20202020-01-18T06:12:31.143Z18-01-2020 2020-01-18T06:12:28.880Z - 2020-01-20T12:04:11.350Z - 20-01-2020

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ కాంగ్రెస్ పేరుకే పెద్దన్న అయినా పార్టీ మాత్రం పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఆ పార్టీ నేతలు సవాలక్ష కారణాలతో తడబడుతూ పార్టీని ప్రజలలో పలచన చేశారు. గత ఏడాది ఎన్నికలలో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీగా ప్రజలలో బజ్ క్రియేట్ చేసినా పార్టీ చివరికి ఘోరపరాజయం చవిచూసి ప్రతిపక్ష స్థానంతో సరిపెట్టుకున్నారు.

అధికార పార్టీ గులాబీ బాస్ కాంగ్రెస్ నేతలలో కొరవడిన సమన్వయాన్ని క్యాష్ చేసుకుంటూ ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. అయినా ఆ పార్టీ నేతల తీరు మారలేదు. ఏపీలో తుడిచిపెట్టుకుపోతుందని తెలిసినా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించినా ఆ త్యాగాన్ని ప్రజలలో ఓట్లగా మలచడంతో కాంగ్రెస్ లీడర్లు కేసీఆర్ తో పోటీపడలేకపోయారు.

ఇక తొలి నుండి పార్టీలో ఉండే గ్రూపు తగాదాలు.. ఆధిపత్య పోరు ఓటమితో ఇంకా పెచ్చుమీరడం ఆశ్చర్యం కలిగించక మానదు. ప్రస్తుతానికి ఆ పార్టీకి రాష్ట్రంలో సత్తా గల అధినాయకుడు కరువయ్యారు. పేరుకి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నా మున్సిపల్ పోరుకి ముందే తాను అధ్యక్షుడిగా ఉండలేనని అధిష్టానం వద్ద చెప్పేసి చేతులెత్తేశారు. ఎన్నికల ముందు కొత్త పంచాయతీ ఎందుకని ఆయననే కొనసాగిస్తుంది.

అయితే, ఉత్తమ్ తర్వాత ఆ పదవి ఎవరిని వరిస్తుందన్నది ఇప్పటికే అధిష్టానం వద్ద స్పష్టమైన రిపోర్ట్ ఉందని తెలుస్తుంది. నిజానికి ఈ పదవికి దాదాపు డజను మంది పోటీపడుతున్నారు. సీనియర్లలో వీహెచ్, భట్టి, కోమటిరెడ్డి, జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి లాంటి వాళ్ళతో పాటు పార్టీలో వయసు తక్కువే అయినా ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ గా సత్తా చూపించిన రేవంత్ రెడ్డి కూడా రేసులో ఉన్నారు.

కాగా అధిష్టానం మాత్రం ప్రభుత్వాన్ని ఢీకొట్టే నేతగా రేవంత్ కే మొగ్గుచూపినట్లుగా తెలుస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా ఆ పార్టీలో సీనియర్ నేతలలో ఒకరైన మాజీ మంత్రి శైలజానాథ్ పేరును ఏఐసీసీ ప్రకటించింది. శైలజానాధ్ దళితవర్గానికి చెందిన నేత కాగా.. వర్కింగ్ ప్రెసిడెంట్లు తులసిరెడ్డి, షేక్ మస్తాన్ వలీని ప్రకటించి అధిష్టానం సామజిక సమతౌల్యం పాటించింది.

ఏపీపిసిసితో పాటు తెలంగాణ పిసిసి ప్రక్షాళన కూడా జాగ్రల్సి ఉండగా మున్సిపల్ ఎన్నికల ఎఫెక్ట్ తో వాయిదా పడినట్లుగా తెలుస్తుంది. అయితే వాయిదా పడింది ప్రకటన మాత్రమేనని.. కమిటీ మాత్రం అధిష్టానం వద్ద ఫిక్స్ అయిపోయిందంటున్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేసారని, మున్సిపల్ ఎన్నికల అనంతరం ఫిబ్రవరి మొదటివారంలో ప్రకటన వెలువడుతుందని పార్టీ వర్గాలలో వినిపిస్తుంది. మరి ప్రకటన సమయానికి రేవంత్ పేరే ఉంటుందా? లేక మారుతుందా? అప్పటి వరకు సీనియర్లు రాయబారాలు చేయకుండా ఉంటారా? అన్నది వేచిచూడాల్సి ఉంది.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle