newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణ ఈఆర్సీ కీలక నిర్ణయం

08-04-202008-04-2020 09:12:12 IST
Updated On 08-04-2020 09:15:44 ISTUpdated On 08-04-20202020-04-08T03:42:12.436Z08-04-2020 2020-04-08T03:41:20.258Z - 2020-04-08T03:45:44.274Z - 08-04-2020

తెలంగాణ ఈఆర్సీ కీలక నిర్ణయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ వ్యాప్తంగా కరోనా వైరస్ తన ప్రతాపం చూపిస్తోంది. జనం బయటకు రాకుండా లాక్ డౌన్ అమలవుతోంది. ఏప్రిల్ 15 వరకూ లాక్ డౌన్ అమలుచేయబోతున్నారు. అయితే తరవాత కూడా లాక్ డౌన్ కొనసాగింపునకే ప్రభుత్వం మొగ్గుచూపుతోందని, ఆ విషయం ప్రధానికి కూడా వివరిస్తానని సీఎం కేసీయార్ రెండురోజుల క్రితమే ప్రకటించారు. లాక్ డౌన్ కొనసాగుతున్న నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటింటింకీ వెళ్లి విద్యుత్ రీడింగ్ తీసుకునే అవకాశం లేదు. కరోనా వ్యాప్తి వల్ల విద్యుత్ బిల్లుల విషయంలో వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం.

గతేడాది మార్చిలో వచ్చిన కరెంట్ బిల్లును.. ఈ నెలలో మళ్లీ ఆన్లైన్ ద్వారా చెల్లిస్తే సరిపోతుందని వినియోగదారులకు తెలియజేసింది. అటు వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలకైతే 2019 మార్చిలో వచ్చిన బిల్లులో సగం అమౌంట్ ఇప్పుడు కడితే సరిపోతుందని తెలిపింది. బిల్లు వివరాలన్నింటిని కూడా విద్యుత్ పంపిణీ సంస్థలు డైరెక్ట్ వినియోగదారుల ఫోన్లకే ఎస్ఎంఎస్‌ల ద్వారా పంపిస్తారు. దీని ప్రకారం ఆన్లైన్‌లో బిల్లు చెల్లిస్తే చాలు. లాక్ డౌన్ కారణంగా మీటర్ రీడింగ్ తీసుకునే అవకాశం లేనందున డిస్కంలకు ఈ వెసులుబాటు కల్పిస్తూ టీఎస్ఈఆర్సీ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

ఇక లాక్ డౌన్ ముగిసిన తరువాత ఇంటింటికీ వెళ్లి మీటర్ రీడింగ్ తీసుకుని విద్యుత్ సిబ్బంది బిల్లు ఇవ్వనున్నారు. ఇప్పుడు మీరు ఆన్లైన్ ద్వారా కట్టిన సొమ్మును అందులో సర్దుబాటు చేస్తారు. అటు ఒకవేళ ఇప్పుడు తక్కువ కడితే అదనంగా చెల్లించాలని వచ్చే నెల బిల్లులో కలిపి ఇస్తారు. అయితే లాక్ డౌన్ తర్వాత మీటర్ రీడింగ్ మార్చి 1 నుంచి మే 1 వరకు రెండు నెలలకు ఒకేసారి తీస్తారు కాబట్టి ఎక్కువ యూనిట్లు బిల్లు రావడమే కాకుండా రేట్ కూడా పెరిగిపోయే అవకాశం ఉందని కొంతమంది విద్యుత్ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.

అయితే అలాంటి సమస్యలు తలెత్తకుండా రీడింగ్ ఎన్ని రోజుల తర్వాత తీసినా కేవలం 30 రోజులకు మాత్రమే బిల్లు వచ్చేలా సర్వర్‌లో మార్పులు చేస్తామని దక్షిణ డిస్కం సీఎండీ రఘురాంరెడ్డి తెలిపారు. ఎక్కువ బిల్లులు వచ్చే అవకాశం ఉండదని, వినియోగదారులు ఇబ్బందులు పడకుండా చూస్తామంటున్నారు అధికారులు. జనమంతా 24 గంటలు ఇళ్ళకే పరిమితం కావడం వల్ల విద్యుత్ బిల్లులు భారీగానే వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణలో కరోనా వైరస్ తన ప్రతాపం చూపిస్తోంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle