తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు గుడ్ న్యూస్
10-07-202010-07-2020 10:04:24 IST
Updated On 10-07-2020 13:46:15 ISTUpdated On 10-07-20202020-07-10T04:34:24.411Z10-07-2020 2020-07-10T04:34:11.583Z - 2020-07-10T08:16:15.552Z - 10-07-2020

ఒకవైపు పదవ తరగతి పరీక్షలు రద్దుచేసిన తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ విద్యార్దులకు కూడా శుభవార్త అందించింది. తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ ఏడాది సెకండియర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులందరినీ పాస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 1.47 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. ఈ మేరకు ఫెయిల్ అయిన విద్యార్థులను కంపార్ట్మెంట్ పాస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ‘ఈ ఏడాది ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో 1.47 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. పాస్ అయిన వారిని కూడా రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోమని చెప్పాం. అందుకు దాదాపు 73 వేల దరఖాస్తులు వచ్చాయి. ఆ ప్రక్రియ కూడా 10 రోజుల్లో పూర్తి అవుతుంది. ఆ తర్వాత వారి రిజల్ట్స్‌ను ప్రకటిస్తాం. సెకండియర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులను కంపార్టమెంట్ పాస్ చేస్తున్నాం. జూలై 31 తర్వాత వారి మార్కుల మెమోలు సంబంధిత కళాశాలల్లో అందుబాటులో ఉంటాయి.విద్యార్ధులు పై చదువులు చదివేందుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీఎం కేసీయార్ ఈకీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో పదవ తరగతితో పాటు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేకుండా పోయింది. అయితే ఫస్టియర్ విద్యార్ధులకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. మొత్తం 1,67,630 మంది ప్రథమ సంవత్సర విద్యార్థులు అయోమయంలో వున్నారు. ద్వితీయ సంవత్సర విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోవద్దనే ఉద్దేశంతో అందరినీ పాస్ చేసింది. అయితే ప్రథమ సంవత్సర విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారా? లేదా? అనేది స్పష్టం చేయలేదు. కరోనా అదుపులోకి వచ్చాక పరీక్ష పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. లేదంటే వచ్చే ఏడాది వార్షిక పరీక్షలతో ప్రథమ సంవత్సరంలో ఫెయిలైన పరీక్షలను కూడా రాసుకోవాల్సి వస్తుంది.ద్వితీయ సంవత్సర విద్యార్థులు ఎంసెట్, ఇతర సెట్స్ రాసుకునేలా, డిగ్రీలో ప్రవేశాలు పొందేలా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. లేకపోతే వారు విద్యా సంవత్సరం నష్టపోతారని, అందుకే ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

నా రూటే సెపరేటు
13 minutes ago

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
14 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
14 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
14 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
18 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
19 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
18 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
20 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
21 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
16 hours ago
ఇంకా