newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణ ఆవిర్భావ దినం.. మేధావులు, జనం ఏమంటున్నారంటే?

02-06-202002-06-2020 12:22:50 IST
Updated On 02-06-2020 14:02:55 ISTUpdated On 02-06-20202020-06-02T06:52:50.728Z02-06-2020 2020-06-02T06:51:44.365Z - 2020-06-02T08:32:55.200Z - 02-06-2020

తెలంగాణ ఆవిర్భావ దినం.. మేధావులు, జనం ఏమంటున్నారంటే?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దశాబ్దాల పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణకు 5వసంతాలు నిండాయి. నీళ్ళు, నిధులు,నియమాకాలు, ఆత్మగౌరవం ప్రతిపాధికన జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాయా? అరేండ్ల పాలనలో ఉద్యమ ఆకాంక్షలన్ని నెరవేరాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం తమ గొప్పతనాన్ని చెబుతుంటే...ఆనాటి  ఉద్యమంలో పాల్గొన్న పలు రంగాల ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దాం. 

ఉమ్మడి పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వివక్షతకు గురైందని, తెలంగాణ వస్తే ఎంతో అభివృద్ధి అవుతుందని ఉద్యమకారులు భావించారు. తెలంగాణ వస్తే వలసలు, ఆకలిచావులు ఉండవని,  ప్రజాస్వామికంగా ఉంటుందని భావించారు. కానీ తెలంగాణలో ప్రస్తుతం నిర్బంధం పెరిగి పోలీస్ రాజ్యంగా మారిందని ప్రజాస్వామిక వాదులు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో ప్రశ్నించడమే నేరమైందని పౌరహక్కుల నేత  ప్రొఫెసర్ హారగోపాల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని విద్యార్థులు ఉద్యమంలో ముందు భాగాన నిలిచారు. ఉద్యమం తీవ్రత తగ్గిన ప్రతిసారి విద్యార్ధులు పలు రుపాల్లో తెలంగాణ సమాజానికి భరోసానిచ్చారు.

ఎంత పోరాడినా పట్టించుకోని నాటి పాలకులకు కనువిప్పు కల్గించడానికి విద్యార్థులు తమ బలిదానాలతో నిరసన తెలిపారు. ఇంటికొక ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ మాట  జుటా అయ్యిందని, కేజీ టూ పీజీ తన కల అని చెప్పిన కేసీఆర్ ఆ మాటను గాలికి వదిలేసి ప్రభుత్వ యూనివర్సిటీలకు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రయివేట్ యూనివర్సిటీల మోజులో ఉన్నాడని పలువురు విద్యార్థులు విమర్శిస్తున్నారు.

ఉమ్మడి పాలన నుండి సాగుతోన్న రైతుల ఆత్మహత్యలు తెలంగాణ వచ్చినా ఏమాత్రం ఆగడం లేదు. అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రైతులను రాజులుగా చేయడమే తన లక్ష్యమని చాటుతున్న కేసీఆర్  ఇరిగేషన్, వ్యవసాయంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు.

అయితే కేసీఆర్ పథకాలన్నీ ఎక్కువ భూములున్న భూస్వాములకే ఎక్కువ ఉపయోగపడుతున్నాయని విమర్శలున్నాయి. దేశంలో ఎక్కడా లేని రైతుబంధు, రైతు భీమా ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం రేపు మరిన్ని రైతు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టనుంది. అయితే నియంత్రిత వ్యవసాయ విధానం లాంటి నూతన విధానాల వల్ల  రైతులు అందోళన పడుతున్నారు.

పోరాడి సాధించుకున్న తెలంగాణలో పాలన జనరంజకంగా ఉందని కొందరు, అస్సలు బాగాలేదని మరికొందరు రాజకీయ పార్టీలవారీగా వాదిస్తున్నారు. మహిళల భద్రత, విద్య, వ్యవసాయం, ఆరోగ్యం లాంటి రంగాల ప్రజల జీవన పరిస్థితులు మెరుగయ్యయా అనే అంశంతో అభివృద్దిని అంచనా వేయవచ్చు. కానీ ప్రస్తుతమున్న కరోనా పరిస్థితులతో అలాంటి అంచనా వేయడం కష్టమే. త్వరలోనే కరోనా కష్టాలు దాటి తెలంగాణలో అమరులు కలలు గన్న స్వప్నాలు ఫలించాలని కోరుకుందాం. 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   4 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   5 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   5 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   9 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   10 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   8 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   11 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   11 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   6 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   13 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle