newssting
BITING NEWS :
*దిశ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృదం.. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో విచారణ కమిటీ *హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేలకు అనుమతి * ఎన్‌ఆర్‌సీ బిల్లుకిమంత్రివర్గం ఆమోదం*కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్*రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక గత మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు*చిత్తూరుజిల్లాలో దారుణం... కాలేజి నుండి వస్తుండగా బాలిక కిడ్నాప్*విజయవాడలో అజిత్ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు*నేడు పోలీస్‌ కస్టడీకి దిశ నిందితులు..నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు..వారం రోజుల పాటు విచారణ*నేడు ఆర్బీఐ విధాన సమీక్ష.. వడ్డీరేట్ల పై కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ *శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్... స్వామి గర్భగుడి పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేదించిన ట్రావెన్ కోర్ బోర్డు *తెలంగాణ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లైట్ అథారిటీని ఈ నెల 27వ తేదీలోగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం*వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. రోజుకు నలుగురిని విచారించిన సిట్ బృందం.. రేపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించనున్న సిట్

తెలంగాణ ఆర్టీసీ చేతులెత్తేసిందా?

17-11-201917-11-2019 11:35:23 IST
2019-11-17T06:05:23.267Z17-11-2019 2019-11-17T06:04:18.398Z - - 06-12-2019

తెలంగాణ ఆర్టీసీ చేతులెత్తేసిందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్టీసీ జేఏసీని మేనేజ్ మెంట్ నమ్మడం లేదా?

సమ్మె దెబ్బకు ఆర్టీసీ చితికిపోయిందా?

ఆర్టీసీని బాగుచేయడం ఎవరి తరం కాదా?

ఉద్యోగంలో చేరతామన్న ఒప్పుకోవడం లేదా?

తాజా పరిణామాలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది. తెలంగాణ ఆర్టీసీ పరిస్థితి దిగజారిపోయినట్టే కనిపిస్తోంది. హైకోర్టుకి సమర్పించిన అఫిడవిట్ ఇదే చెబుతోంది. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఈ సమయంలో కార్మికులు సమ్మెకు దిగారని ఇంచార్జీ ఎండీ సునీల్ శర్మ హైకోర్టుకి తెలిపారు.

కార్మికుల సమ్మెతో సంస్థకు రోజుకు 11 కోట్ల నష్టం వస్తుందని చెప్పారు. ఇప్పటివరకు కార్పొరేషన్ 44 శాతం అంటే రూ.473 కోట్ల వరకు నష్టం బారిన పడిందని ఆయన పేర్కొన్నారు. 

44 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ జేఏసీ మెట్టుదిగింది. విలీనం అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెడుతున్నామని ప్రకటించింది. చర్చలకు పిలవాలని కోరింది. అయితే ఆర్టీసీ యాజమాన్యం మాత్రం ససేమిరా అంటోంది.

విలీనమనే అసహేతుక డిమాండ్‌ను కార్మికులు తెరపైకి తీసుకొచ్చారని తెలిపారు. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి హైకోర్టులో కార్పొరేషన్ తరఫున తుది అఫిడవిట్ దాఖలు చేశారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించలేమని ఆర్టీసీ ఇంచార్జీ ఎండీ సునీల్ శర్మ తేల్చేయడంతో అయోమయం నెలకొంది. 

ఆర్టీసీ కార్మికులు. విలీనం పేరుతో సంస్థ, ప్రభుత్వాన్ని కార్మికులు ఇబ్బందికి గురిచేశారని, నష్టాలు మరింతగా పెరిగిపోయాయని ఆర్టీసీ తరఫున సునీల్ శర్మ హైకోర్టుకి నివేదించారు. ఆర్టీసీ జేఏసీ మిగతా డిమాండ్లను కూడా తాము పరిష్కరించలేమని తేల్చేశారు. అసలు చర్చలకే అవకాశం లేదని అఫిడవిట్‌లో పేర్కొనడంతో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు.

విలీనం అంశం పక్కన పెట్టినా భవిష్యత్తులో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉందని చెప్పారు. టెంపరరీగా వాయిదావేసి... అదనుచూసి దెబ్బ కొట్టే అవకాశం ఉందన్నారు. అందుకోసమే వారు విలీనం అంశాన్ని పక్కనపెట్టినా ఆర్టీసీ వారితో చర్చలు జరపబోదని తేల్చిచెప్పారు.

ఇప్పటికే 23 మంది డ్రైవర్లు, కండక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారని సునీల్ శర్మ గుర్తుచేశారు. ఇదిలా ఉంటే.. సమ్మెలో భాగంగా శనివారం నిరాహారదీక్షలకు దిగిన జేఏసీ నేతలు ఆదివారం కూడా అదే బాట పట్టారు. దీంతో హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్లో ఉద్రిక్తత నెలకొంది. జేఏసీ కన్వీనర్.  అశ్వత్థామరెడ్డి  ఇంటి దగ్గర భారీగా మోహరించారు పోలీసులు.

అశ్వత్థామరెడ్డి ఇంట్లోనే దీక్ష కొనసాగిస్తున్నారు. దీక్షను విరమించాలని అశ్వత్థామరెడ్డిని పోలీసులు కోరినా పట్టించుకోవడం లేదు. ఆదివారం, సోమవారం ప్రతి డిపో ముందు 50మంది చొప్పున కార్మికులు నిరహారదీక్షకు చేపడుతున్నారు. 19న సడక్‌ బంద్‌ పేరుతో హైదరాబాద్‌ నుంచి కోదాడ వరకు ర్యాలీ నిర్వహించబోతున్నారు ఆర్టీసీ కార్మికులు. 

పవన్ అభిమాని అత్యుత్సాహం.. ఏ రెడ్డి తలైనా నరుకుతా!

పవన్ అభిమాని అత్యుత్సాహం.. ఏ రెడ్డి తలైనా నరుకుతా!

   8 hours ago


ఎంఐఎంకి కీలక పదవి.. పీఏసీ ఛైర్మన్‌గా అక్బరుద్దీన్ నియామకం

ఎంఐఎంకి కీలక పదవి.. పీఏసీ ఛైర్మన్‌గా అక్బరుద్దీన్ నియామకం

   9 hours ago


అమరావతి వార్: వైసీపీ టీడీపీ పోటాపోటీ సమావేశాలు

అమరావతి వార్: వైసీపీ టీడీపీ పోటాపోటీ సమావేశాలు

   10 hours ago


ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల లిస్ట్.. ఎక్కడో తేడా కొట్టేస్తుందే?!

ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల లిస్ట్.. ఎక్కడో తేడా కొట్టేస్తుందే?!

   10 hours ago


శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్

శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్

   11 hours ago


జర్నలిస్ట్ అవతారం ఎత్తిన పవన్ కళ్యాణ్

జర్నలిస్ట్ అవతారం ఎత్తిన పవన్ కళ్యాణ్

   11 hours ago


అప్పులు చేయడంలో జగన్ సరికొత్త రికార్డులు..!

అప్పులు చేయడంలో జగన్ సరికొత్త రికార్డులు..!

   12 hours ago


మోడీ సర్కార్ విఫలం.. నిప్పులు చెరిగిన చిదంబరం

మోడీ సర్కార్ విఫలం.. నిప్పులు చెరిగిన చిదంబరం

   13 hours ago


దిశ కేసులో దర్యాప్తు మమ్మరం.. నెలలోపే హంతకులకు శిక్ష

దిశ కేసులో దర్యాప్తు మమ్మరం.. నెలలోపే హంతకులకు శిక్ష

   13 hours ago


రేపిస్టుల ప్రాణాలు ముఖ్యమై పోయాయా పవన్.. విజయసాయి విమర్శలు

రేపిస్టుల ప్రాణాలు ముఖ్యమై పోయాయా పవన్.. విజయసాయి విమర్శలు

   14 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle