newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

తెలంగాణ ఆర్టీసీ కథ ముగిసిందా? కేసీఆర్ ఆలోచన అదేనా?

26-11-201926-11-2019 16:35:37 IST
2019-11-26T11:05:37.061Z26-11-2019 2019-11-26T11:05:35.502Z - - 24-02-2020

 తెలంగాణ ఆర్టీసీ కథ ముగిసిందా? కేసీఆర్ ఆలోచన అదేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ఆర్టీసీపై కేసీఆర్ కీలక నిర్ణయం?

ఇక టీఎస్ఆర్టీసీ బోర్డు కనిపించదా?

ప్రైవేట్ పర్మిట్లు త్వరలో రాబోతున్నాయా?

ఆర్టీసీని రక్షించడం ఎవరి తరం కాదా?

ఆర్టీసీ ఉద్యోగుల భవితవ్యం ఏంటి? 

సమ్మెకు స్వస్తి చెప్పినా వారికి ఉద్యోగాలు లేనట్టేనా?

లేబర్ కోర్టు నిర్ణయం ఎలా ఉండబోతుంది?

తెలంగాణలో ప్రజారవాణా వ్యవస్థలో ప్రైవేటు వాహనాలు రాబోతున్నాయి. ఇంతకాలం జనంలోకి వెళ్లిన తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ భవిష్యత్తు ప్రశ్నార్థకం కాబోతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారో సర్వత్రా ఉత్కంఠ రేగుతోంది. కేసీఆర్ మరోసారి ఆర్టీసీపై సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్‌లో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌, ఆర్టీసీ ముఖ్య అధికారులతో భేటీ నిర్వహించారు.

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ నివేదికపై ఈ సమీక్షా సమావేశంలో కసరత్తు చేశారు. ఈ నివేదికపై గురువారం జరిగే రాష్ట్ర కేబినెట్‌ భేటీలో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రూట్లను ప్రైవేటీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కార్యరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే హైకోర్టు రూట్ల ప్రైవేటీకరణ కు అనుమతి ఇచ్చింది. టీఎస్ఆర్టీసీని పూర్తిగా మూసివేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. కేబినెట్లో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు.

ఆర్టీసీ కార్మికులను ఎంత ఒప్పించినా పట్టించుకోలేదని,  ఆర్టీసీని రక్షించేందుకు తామెంతో చేశామని వందలకోట్లు ఇచ్చామని గతంలో ప్రకటించారు సీఎం కేసీఆర్.  పండుగలు, డబ్బులు వచ్చే టైంలో కార్మికులు తీసుకున్న సమ్మె నిర్ణయం వల్ల సంస్థ మనుగడ ప్రశ్నార్థకం అయిందని, ఆర్టీసీని కాపాడడం ఎవరితరం కాదని, చివరకు దేవుడు కూడా కాపాడలేడన్నారు. ఆర్టీసీ సమ్మెకు ముగింపు లేదని, ఆర్టీసీయే ముగింపు అన్నారు కేసీఆర్. నెలరోజుల క్రితమే ఆర్టీసీ భవిష్యత్తుపై కేసీఆర్ ప్రకటన చేశారు. కార్మికులు విధుల్లో చేేరేందుకు డెడ్ లైన్ కూడా విధించారు. నవంబర్ 5 లోగా చేరాలన్నారు. కేవలం 4 నుంచి 5 వందల మంది మాత్రమే చేరారు. 

నెల క్రితం కేసీఆర్ ఏమన్నారంటే..

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle