newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

తెలంగాణ ఆర్టీసీలో వీఆర్ఎస్ స్కీమ్‌..!

23-11-201923-11-2019 11:07:52 IST
2019-11-23T05:37:52.589Z23-11-2019 2019-11-23T05:37:49.531Z - - 22-02-2020

తెలంగాణ ఆర్టీసీలో వీఆర్ఎస్ స్కీమ్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో ఆర్టీసీలో వీఆర్ఎస్ స్కీమ్ రాబోతుందా..? అన్న ప్ర‌శ్న‌పై విస్తృత స్థాయి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. కేసీఆర్ స‌ర్కార్ ఆర్టీసీ ఉద్యోగుల‌కు వీఆర్ఎస్ ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. స్టాఫ్‌ను త‌గ్గించ‌డం ద్వారా ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావాల‌న్న దిశ‌గా ప్ర‌భుత్వ ఆలోచిస్తున్న‌ట్టు స‌మాచారం.

ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్టీసీలో 50వేల మంది కార్మికులు ప‌నిచేస్తున్నారు. 50 శాతం ప్ర‌యివేట్ రూట్‌లు, ప్ర‌యివేటు బ‌స్సుల‌ను తీసుకొస్తే ఇక ఆర్టీసీలో మిగిలేది ఐదువేల బ‌స్సులు మాత్ర‌మే. ఇప్ప‌టి వ‌ర‌కు 10,400 బ‌స్సుల‌కు ఈ 50 వేల మంది కార్మికులు పనిచేసేవారు.

బ‌స్సుల సంఖ్య స‌గానికి త‌గ్గ‌డంతో 20 నుంచి 25 వేల మంది కార్మికులు స‌రిపోతారు. దీంతో ఆర్టీసీలో వీఆర్ఎస్ స్కీమ్ తీసుకురావాల‌న్న‌ది ప్ర‌భుత్వ ఆలోచ‌న‌గా తెలుస్తుంది. దీనిపై కొంత క‌స‌ర‌త్తు జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం.

అయితే, ఇప్ప‌టికిప్పుడు వీఆర్ఎస్ స్కీమ్ ప్ర‌క‌టించ‌క‌పోవ‌చ్చ‌న్న‌ది మ‌రికొంద‌రు అధికారులు చెబుతున్న మాట‌. స‌మ్మె ముగిసిన త‌రువాత 50 వేల మంది కార్మికుల‌ను తిరిగి విధుల్లోకి తీసుకుంటారు. ఆ త‌రువాత వీఆర్ఎస్‌ను తెర‌పైకి తేవాల‌ని ప్ర‌భుత్వ వ్యూహంగా క‌నిపిస్తోంది.

వీఆర్ఎస్ తీసుకునే ఉద్యోగుల‌కు కొంత ప్రోత్సాహ‌కంగా ఆర్టీసీ ఇచ్చే బెనిఫిట్స్‌తోపాటు ప్ర‌భుత్వం కూడా కొంత న‌గ‌దును క‌లిపే అవ‌కాశం ఉంది. వాలెంట‌రీ రిటైర్మెంట్ ప‌థ‌కాన్ని అమ‌ల్లోకి తెస్తే.. అప్ప‌టిక‌ప్పుడు కాకుండా ఒక‌టి రెండేళ్ల‌లో స‌గం మంది ఉద్యోగులు త‌గ్గుతార‌ని ఆర్టీసీ యాజ‌మాన్యం అంచ‌నా.

ప్ర‌భుత్వం, వీఆర్ఎస్ స్కీమ్ తీసుకొస్తే రిటైర్మెంట్ ద‌గ్గ‌ర‌గా, లేదా మ‌రో ఐదారేళ్ల స‌ర్వీసు ఉన్న కొంత మంది ఉద్యోగులు వీఆర్ఎస్ వైపు మొగ్గుచూపే అవ‌కాశం ఉంది. దీనిపై విమ‌ర్శ‌లు రాకుండా ఉండేందుకు కూడా ప్ర‌భుత్వం రెడీ అయిన‌ట్టు తెలుస్తుంది.

ఈ ప‌రిస్థితి కార‌ణంగా ప్ర‌తిప‌క్షాలు ఎదురుదాడికి దిగే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఆర్టీసీ కార్మికులు స‌మ్మెకు దిగ‌డం వెనుక ప్ర‌తిప‌క్షాల రాజ‌కీయ ల‌బ్ధి ఉంద‌ని అధికార పార్టీ ఇప్ప‌టికే ప్ర‌చారాన్ని మొద‌లు పెట్టింది. ఈ స‌మ్మె వ‌ల్ల ఆర్టీసీ కోలుకోలేని ఆర్థిక భారాన్ని మూట‌గ‌ట్టుకుంద‌ని, ఇక ఆర్టీసీని ఆదుకోవ‌డం ప్ర‌భుత్వానికి కూడా క‌ష్ట‌మే అంటూ ఇప్ప‌టికే ఒక ప్ర‌క‌ట‌న‌ను కూడా విడుద‌ల చేసింది.

ఆర్టీసీని ద‌శల‌వారీగా ప్రయివేటీక‌రించాల‌న్నది ప్ర‌భుత్వ వ్యూహంగా తెలుస్తుంది. అయితే, 50 శాతం మించ‌కుండా ఉంటుంద‌న్న‌ది సీఎం స్ప‌ష్టంగా చెబుతున్న మాట‌. మ‌రోవైపు కేంద్ర ప్ర‌భుత్వం కూడా అనేక సంస్థ‌ల్లో వీఆర్ఎస్ తీసుకొస్తున్న నేప‌థ్యంలో అటు బీజేపీ నుంచి కూడా విమ‌ర్శ‌లు వ‌చ్చే అవ‌కాశం లేక‌పోవ‌డంతో కేసీఆర్ స‌ర్కార్ ఈ విష‌యంలో వేగిర‌మైన అడుగులు వేసే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం అభిప్రాయ‌ప‌డుతున్నారు.

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   2 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   3 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   4 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   5 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   5 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   6 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   7 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   8 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   8 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   9 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle