newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు కోవిడ్ రూల్స్

05-09-202005-09-2020 08:07:02 IST
Updated On 05-09-2020 08:35:36 ISTUpdated On 05-09-20202020-09-05T02:37:02.661Z05-09-2020 2020-09-05T02:36:51.881Z - 2020-09-05T03:05:36.222Z - 05-09-2020

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు కోవిడ్ రూల్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ కలకలం రేపుతున్న వేళ అన్ని వ్యవహారాలు ఆగిపోతున్నాయి. వ్యాపారాలు, సినిమాల విడుదలలు నిలిచిపోయాయి. ప్రభుత్వ కార్యక్రమాలు అనేక నిబంధనల మధ్య జరుగుతున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు సిద్ధం చేశారు.

అసెంబ్లీ సమావేశాలకు వచ్చేవారందరు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని సూచించారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి.. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి సమావేశాలకు కోవిడ్ కారణంగా మీడియాని అనుమతించడం లేదు. ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా కరోనా రిపోర్ట్ తో సమావేశాలకు రావాలంటున్నారు స్పీకర్ పోచారం. ఈ సమావేశాలలో అనేక నిబంధనలు పెట్టారు. సభ్యుల అరోగ్యం కోసమే ఇవన్నీ చేపడుతున్నామని సహకరించాలన్నారు. 

ఈనెల 7వ తేదీ సోమవారం నుంచి  మొద‌ల‌య్యే అసెంబ్లీ స‌మావేశాలకు అన్ని ఏర్పాట్లు చేసారు. సమావేశాలు  దాదాపు రెండు వారాలు సాగే అవ‌కాశం ఉండ‌డంతో ప్ర‌భుత్వ ప‌రంగా అన్ని ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌ను  తీసుకుంటోంది.  అసెంబ్లీలో విధులు నిర్వ‌హించే సిబ్బంది స‌హా స‌భ్యులంద‌రీ కోవిడ్ పరీక్ష‌ల‌ను త‌ప్ప‌ని స‌రి చేస్తున్న‌ట్లు శాస‌నస‌భ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వెల్ల‌డించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కఠిన నియమ నిభందనలు అమలుచేస్తున్నారు. ప్రస్తుత  ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో జ‌రుపుతున్న స‌మావేశాలు కావ‌డంతో స‌భ్యుల‌తో పాటు అసెంబ్లీ  స‌మావేశాల సంద‌ర్భంగా విధులు నిర్వ‌హించే అందర‌కీ కోవిడ్ ప‌రీక్ష‌లు చేసేందుకు  అసెంబ్లీలోనూ ఏర్పాట్లు చేశారు. 

స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డిల‌తో పాటు ప‌ల‌వురు శాస‌న‌స‌భ్యులు  శుక్ర‌వారం రోజే ర్యాపిడ్ టెస్ట్ నిర్వ‌హించుకున్నారు. అందరికి నెగిటివ్ గా నిర్ధార‌ణ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. స‌భ్యులు రాష్ట్రంలో ఎక్క‌డ ఉన్నా.....కోవిడ్ ప‌రీక్ష  చేసుకుని 6 వ తేదీ లోపు రిపోర్ట్ వ‌చ్చే విధంగా చూసుకోవాల‌ని స్పీక‌ర్ పోచారం స‌భ్యుల‌ను కోరారు.

కరోనా  కార‌ణంగా ఈసారి  స‌మావేశాల‌కు కొన్ని ప్ర‌త్యేక నిబంధ‌న‌ల‌ను  శాస‌న‌స‌భ‌లో అనుస‌రించాలని నిర్ణ‌యం తీసుకున్నారు. శుక్ర‌వారం ఉన్న‌తాధికారుల‌తో  స‌మీక్ష‌లు నిర్వ‌హించిన స్పీక‌ర్, మండ‌లి చైర్మ‌న్ లు ప‌లు నిర్ణ‌యాలు మీడియాకు వెల్ల‌డించారు. శాస‌న‌స‌భ‌కు, శాసన మండ‌లికి హాజ‌ర‌య్యే స‌భ్యుల‌కు వ్య‌క్తి గ‌త సిబ్బందిని అనుమ‌తించ‌రాద‌ని, మంత్రులకు మాత్రం ఇద్ద‌రి స‌హాయకుల‌ను మాత్రమే అనుమ‌తిస్తామ‌న్నారు. స‌భా ప్రాంగ‌ణాన్ని రోజుకు రెండు సార్లు శానిటైజ్ చేయాల‌ని నిర్ణ‌యించారు.అసెంబ్లీ స‌మావేశాలు  జ‌రిగిన‌న్ని రోజులు స‌భ్యులు కూడా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు.  అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో కూడా  ముందు జాగ్ర‌త్త‌గా వైద్య స‌దుపాయాలు క‌ల్పించాల‌ని నిర్ణ‌యించారు.

అత్య‌వ‌స‌రం కోసం వైద్యులు, అంబులెన్స్ ల‌ను అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో ఏర్పాటు చేయ‌నున్నారు. స‌భ్యులందరికీ ఒక కిట్ ను అంద‌చేయాల‌ని కిట్ లో శానిటైజ‌ర్ తో పాటు ఆక్సీ మీట‌ర్ల‌ను అంద‌చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.  థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్  త‌ర్వాతే  స‌భ్యుల‌ను, సిబ్బందిని అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లోకి అనుమ‌తించ‌నున్నారు.  ఏ మాత్రం అనుమానం వ‌చ్చినా వారిని  అసెంబ్లీ ప్రాంగ‌ణ‌లోకి అనుమ‌తించేది లేద‌ని  స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్ప‌ష్టంచేశారు. ఉభ‌య స‌భ‌ల నిర్వ‌హ‌ణ కోసం కోవిడ్ కార‌ణంగా అమ‌లు చేస్తున్న నిబంధ‌న‌ల‌కు స‌హ‌క‌రించాల‌ని మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి  కోరారు.

కోవిడ్ నిబంధ‌న‌లు పాటించి పార్ల‌మెంట్ లో ఎలాంటి నిర్ణ‌యాలు అమ‌లు చేసారో అసెంబ్లీ స‌మావేశాల్లో అవే విధానాలు అమ‌లు చేయ‌నున్న‌ట్లు శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి తెలిపారు. స‌మావేశాల సంద‌ర్భంగా అన‌వ‌స‌ర ర‌ద్దీని  త‌గ్గించే చ‌ర్య‌ల‌ను చేప‌ట్టిన‌ట్లు మంత్రి తెలిపారు. సభలో సిట్టింగ్ ప్యాట్రన్ కూడా మార్చినట్టు వివరించారు. అసెంబ్లీలో 40 , మండలిలో 8 అదనపు సీట్లు పెంచారు. సభ్యుల మద్య ఆరు మీటర్లు దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.

అసెంబ్లీ  నిర్వ‌హ‌ణ‌లో ఇప్ప‌టికి ఎలాంటి మార్పులు చేయ‌క‌పోయినా....బిఏసి సంద‌ర్భంగా వెల్ల‌డ‌య్యే అభిప్రాయాల‌కు అనుగుణంగా స‌భ నిర్వ‌హ‌ణ‌పై తుది ఏర్పాట్లు చేయాల‌ని ఈ స‌మావేశాల్లో నిర్ణ‌యం తీసుకున్నారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం లేకున్నా అసెంబ్లీలో జీరో అవర్ కూడా ఉంటుందన్నారు. కరోనా నేపథ్యంలో మీడియా పాయింట్ ఎత్తేయడాన్ని ప్రతిపక్ష పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి. 

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   13 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   14 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   14 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   18 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   19 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   17 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   20 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   20 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   15 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle