newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉండటమే వివక్షా.. పీయూష్ గోయల్‌ ప్రశ్న

19-02-202019-02-2020 11:43:50 IST
2020-02-19T06:13:50.978Z19-02-2020 2020-02-19T06:13:48.009Z - - 15-04-2021

తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉండటమే వివక్షా..  పీయూష్ గోయల్‌ ప్రశ్న
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని పదే పదే తెరాస తదితర పక్షాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ కొట్టిపడేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తొలినుంచి పోరాటం చేసిన పార్టీ బీజేపీయేనని, చిన్న రాష్ట్రాల ఏర్పాటు అనేది తమ పార్టీ మౌలిక విధానంగా ఎప్పటినుంచో ఉనికిలో ఉందని, ఇలాంటి ఘనమైన చరిత్రను కలిగిన తమపై ఒక ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శ చేయడం కంటే మించిన అసంబద్ధమైన విషయం మరొకటి ఉండదని కేంద్ర మంత్రి తోసిపుచ్చారు.

తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో సోమవారం  పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అప్పుడూ ఇప్పుడూ కూడా మనస్ఫూర్తిగా కట్టుబడి ఉంటోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పీయూష్ గోయల్‌తోపాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌, ఎంపీలు బండి సంజయ్‌, ధర్మపురి అరవింద్‌ కూడాపాల్గొన్నారు. ఈ సందర్భంగా గోయల్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఆనాడు పోరాటం చేశామని పేర్కొన్నారు. 

ప్రధాని మోదీ  అందరి  కోసం పని చేస్తానని మాట ఇచ్చారని, దానికి కట్టుబడి పని చేస్తున్నామని రైల్వే మంత్రి గోయల్ తెలిపారు. దక్షిణ భారత్‌ను నిర్లక్ష్యం  చేశారనడం నూటికి నూరుపాళ్లు అవాస్తవమన్నారు. ‘కాంగ్రెస్‌ హయాంలోనే సౌత్‌ సెంట్రల్‌ రైల్వేను  నిర్లక్ష్యం చేశారు. ప్రధాని మోదీకి  దేశమంతా ఒక్కటే, రూ.258 కోట్లు గతంలో ఇచ్చారు.  కానీ ఇప్పటి  బడ్జెట్‌లో పదింతలు ఎక్కువ నిధులు ఇచ్చాం.  కేంద్రం ఎంత ఇచ్చిందో నా దగ్గర పూర్తి లెక్కలు ఉన్నాయని’ వివరించారు. 

ఇంతవరకు రూ.258 కోట్లతో తెలంగాణలో రైలు మార్గాలను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. 2008లో ప్రారంభించిన పెండింగ్‌ పనులు అన్ని పూర్తి చేశామన్నారు. ఎంఎంటీఎస్‌ కోసం 500 కోట్లు కేంద్రం ఇచ్చిందని.. రాష్ట్రం ఇంకా డబ్బులు ఇవ్వలేదని..అది ఇస్తే పనులు పూర్తవుతాయన్నారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా ఆగదలేదని రైల్వే మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ..హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ ప్రధాన సమస్య అని..సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌ల నుంచి వేల మంది ప్రయాణిస్తారని..చర్లపల్లి రైల్వేస్టేషన్‌ వద్ద శాటిలైట్‌ టర్మినల్‌ ఏర్పాటుతో రద్దీ భారం తగ్గుందన్నారు. ఎంఎంటీఎస్‌, సబ్బరన్‌ రైళ్ల సంఖ్య పెంచాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రిని ఆయన కోరారు. యాద్రాది వరకు ఎంఎంటీస్‌పై కేంద్రం దృష్టిపెడితే రైల్వే ట్రాఫిక్‌ సమస్య తగ్గుతుందన్నారు. 427 రైల్వేస్టేషన్లలో ఉచిత హైస్పీడ్‌ వైపై సౌకర్యం కల్పించడం మంచి పరిణామం అని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు.

కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మంత్రి తలసాని యాదవ్ కేంద్ర మంత్రి సమక్షంలోనే తెలంగాణ పట్ల కేంద్రప్రభుత్వ నిర్లక్ష్యం, వివక్షా ధోరణి పట్ల నిరసన వ్యక్తం చేశారు. సౌత్‌ సెంట్రల్‌ రైల్వే అభివృద్ధి విషయంలో కేంద్రం ప్రతిసారి నిర్లక్ష్యం చూపుతోందని..ఇప్పటికైనా కేంద్రం తెలంగాణ అభివృద్ధి పట్ల, రాష్ట్లంలోని రైలు మార్గాల విస్తరణ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఎన్నో పనులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle