తెలంగాణలో మళ్లీ సెటిలర్లపై పార్టీల ఫోకస్..!
07-09-202007-09-2020 18:44:58 IST
Updated On 08-09-2020 07:55:23 ISTUpdated On 08-09-20202020-09-07T13:14:58.362Z07-09-2020 2020-09-07T13:14:55.929Z - 2020-09-08T02:25:23.201Z - 08-09-2020

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలూ ఈ ఎన్నికలపై దృష్టి పెట్టాయి. కోటికి పైగా జనాభా హైదరాబాద్ మహానగర పీఠం మరోసారి దక్కించుకోవాలని టీఆర్ఎస్ పార్టీ కసరత్తు చేస్తోంది. బల్దియా ఎన్నికల బాధ్యతలను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తీసుకున్నారు. ఇప్పటికే ఎన్నికలపైన కూడా ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. నగరంలో సుమారు రూ.20 వేల కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనుల వేగం పెంచారు. ఎన్నికల నాటికి నగర రూపురేఖలు మారేలా ఆయన అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. పార్టీ పరంగానూ ఎన్నికలకు టీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. ఒక్కో డివిజన్‌కు ఒక్కో ప్రజా ప్రతినిధి(ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ)లను ఇంఛార్జిలుగా పెట్టి గెలుపే లక్ష్యంగా పెట్టుకోవాలని భావిస్తోంది. ఈసారి కూడా వంద డివిజన్లను సొంతం చేసుకోవడమే టార్గెట్‌గా పెట్టుకుంది. ఇదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా గ్రేటర్ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో బీజేపీకి కొంత పట్టుంది. కీలకమైన సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోని పలు డివిజన్లలోనూ బీజేపీ - ఎంఐఎం మధ్యే పోటీ ఉంటుంది. చాలా రోజులుగా బీజేపీ ఎన్నికలకు పార్టీ క్యాడర్‌ను సిద్ధం చేస్తోంది. భాగ్యనగరంపై కాషాయ జెండా ఎగరేయడమే తమ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా మళ్లీ గ్రేటర్లో బలోపేతం కావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. గ్రేటర్ పరిధిలోని 48 డివిజన్లు మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. ఇక్కడి నుంచి పార్లమెంటు ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలిచారు. దీంతో గ్రేటర్ ఎన్నికల బాధ్యతలను కూడా రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకునేలా ఆయన వ్యూహాలు రచిస్తుతున్నారు. పార్లమెంటు సమావేశాల తర్వాత ఆయన గ్రేటర్లో ప్రతి రోజూ రెండు డివిజన్లలో యాత్ర నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే, గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలూ సీమాంధ్ర సెటిలర్ల ఓట్లపై నజర్ పెడుతున్నాయి. హైదరాబాద్‌లో సెటిలైన ఆంధ్ర ప్రాంతం వారి ఓట్లు జీహెచ్ఎంసీలో కీలకం కానున్నాయి. సుమారు 60 - 70 డివిజన్లలో వీరి ఓట్లే పార్టీల గెలుపోటములను డిసైడ్ చేస్తాయి. దీంతో వీరిని ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలూ ఎన్నికల ముందు ప్రయత్నాలు చేయడం సంప్రదాయంగా మారింది. గతంలో సెటిలర్ల ఓట్లు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉండేవి. 2014 అసెంబ్లీ ఎన్నికల వరకు ఇదే పరిస్థితి ఉండేది. కానీ, 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి పరిస్థితి మారింది. సెటిలర్లకు టీఆర్ఎస్ పార్టీ భరోసా ఇచ్చింది. హైదరాబాద్ అందరిదీ అని నమ్మకం కల్పించింది. సుమారు 20 - 30 మంది సెటిలర్లకు టీఆర్ఎస్ పార్టీ టిక్కెట్లు ఇచ్చింది. దీంతో సెటిలర్ల ఓట్లు టీఆర్ఎస్ వైపు మళ్లాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ సెటిలర్లు టీఆర్ఎస్ వైపే నిలిచారు. మంత్రి కేటీఆర్ అప్పుడు నియోజకవర్గాల వారీగా సెటిలర్లతో ప్రత్యేకంగా సమావేశాలు పెట్టి గెలిపించాలని కోరారు. దీంతో టీఆర్ఎస్ సెటిలర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో భారీ మెజారిటీలతో విజయాలు నమోదు చేసింది. ఇప్పుడు కూడా సెటిలర్లు తమ వైపే ఉంటారని టీఆర్ఎస్ పార్టీ అంచనా వేస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ కూడా సెటిలర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించాలని భావిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒకడుగు ముందుకేసి సెటిలర్లకు టీఆర్ఎస్కు సమానంగా టిక్కెట్లు కేటాయించాలని ఆలోచన చేస్తోంది. బీజేపీ కూడా సెటిలర్లకు టిక్కెట్లు ఇవ్వాలనే ఆలోచనతో ఉంది. టీడీపీకి గతంలో సెటిలర్ ఓట్లుపై చాలా ఆశలు ఉండేవి. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో ఆ పార్టీ కూడా ఆశలు వదిలేసుకుంది. దీంతో సెటిలర్లను ఆకట్టుకునేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీనే ఎక్కువగా పోటీ పడుతున్నాయి.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
5 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
8 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
11 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
2 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
12 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
9 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
12 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
13 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
6 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
15 hours ago
ఇంకా