తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
20-08-202020-08-2020 11:31:27 IST
Updated On 20-08-2020 14:57:09 ISTUpdated On 20-08-20202020-08-20T06:01:27.829Z20-08-2020 2020-08-20T06:01:24.809Z - 2020-08-20T09:27:09.556Z - 20-08-2020

రుతుపవనాల ప్రభావం కారణంగా తెలుగు రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఈ నెల 21న తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్-పట్టణ, వరంగల్- గ్రామీణ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వలన ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో సుమారుగా ఆగస్టు 23 తేదీన మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతం అల్పపీడనం ప్రభావంతో ఈ రోజు, రేపు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు జిల్లాల్లో వానల వల్ల ఉత్పన్నమయిన పరిస్థితిని మంత్రులు సమీక్షిస్తున్నారు. అటవీ జిల్లా ములుగులో కొద్ది రోజులనుంచి కురుస్తున్న వర్షాల వల్ల మునిగిపోయిన లోతట్టు ప్రాంతాల్లో రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించారు. ఏటూరు నాగారంలోని వరద ప్రభావిత ప్రాంతాలను ఆమె సందర్శించి బాధితులతో మాట్లాడారు. బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఓ మహిళ తన కొడుకు పక్షవాతంతో ఆస్పత్రిలో చేరాడని, వైద్యానికి డబ్బులు లేవని మంత్రితో తన ఆవేదనను వ్యక్తం చేశారు. కొడుకు వైద్యం కోసం ఓ మహిళ మంత్రిని వేడుకోగా అధికారులను ఆదేశించడమే కాకుండా వ్యక్తగతంగా 10 వేల రూపాయలను అందించారు. మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే సీతక్క, జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, కలెక్టర్ కృష్ణ ఆదిత్యతో పాటు ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా పర్యటించారు. ఇప్పటికే ఎమ్మెల్యే సీతక్క ఆటోలో సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఏపీలో స్కూల్స్ బంద్
13 hours ago

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?
13 hours ago

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
17 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
19 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
14 hours ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
21 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
21 hours ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా
14 hours ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
16 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
a day ago
ఇంకా